Chinni Serial Today October 25th: చిన్ని సీరియల్: పాత జ్ఞాపకాల్లో మధు, మ్యాడీ! మహితో చిన్ని దాగుడుమూతలు! లోహితకు మాటిచ్చిన వరుణ్!
Chinni Serial Today Episode October 25th మధు, మ్యాడీ కలిసి చిన్నప్పుడు మధు, చందు వాళ్ల ఇంటికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహిత ఏడుస్తుంటే వరుణ్ వెళ్లి ఏమైందని అడుగుతాడు. లోహిత వరుణ్‌ని హగ్ చేసుకొని సారీ వరుణ్ నా వల్ల నువ్వు మ్యాడీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను నిన్ను ప్రేమించకపోయి ఉంటే మీ ఇద్దరూ హ్యాపీగా ఉండేవాళ్లు అని అంటుంది.
వరుణ్ లోహితతో మనిద్దరం ప్రేమించుకున్నాం.. అందుకే పెళ్లి చేసుకున్నాం అంటాడు. మన పరిస్థితి ఎప్పటికీ ఇంతేనా అని లోహిత అంటే నీకు ఏ కష్టం రాకుండా నిన్ను చూసుకుంటా అని వరుణ్ అంటాడు. నా ధైర్యమే నువ్వు వరుణ్ అందుకే ఏం ఆలోచించకుండా నీ కోసం వచ్చేశా అని అంటుంది. మ్యాడీ బావ మనకి సపోర్ట్ ఉన్నంత వరకు మనకి ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు అని వరుణ్ చెప్తాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత మంది మనల్ని విడదీయాలిఅని చూసినా నేను నీ చేయి వదలను అని ప్రామిస్ చేస్తాడు. లోహిత మనసులో ఆ ఇంటికి నేను కోడలు అవ్వాలి అక్కడ చక్రం తిప్పాల్సందే.. మధునే చిన్ని అని తెలిసిపోతే మధు ఆ ఇంటి అసలు కోడలు అయిపోతుంది.. అది ఎప్పటికీ జరగడానికి వీల్లేదు అని అనుకుంటుంది.
మ్యాడీ పెళ్లి కూతురు బొమ్మ చూస్తుంటే మధు చూసి చిన్ననాటి గుర్తున్ని ఎంత జాగ్రత్తగా దాచుకున్నావ్ మ్యాడీ అని అనుకుంటుంది. దగ్గరకు వెళ్లి తనే చిన్ని అని చెప్పాలి అనుకుంటుంది. అంతలోనే మ్యాడీ తన పేరెంట్స్‌తో కలిసిన తర్వాత చెప్తా అనుకుంటుంది. మ్యాడీ దగ్గరకి వెళ్లి ఏం చూస్తున్నావ్ అని అడుగుతుంది. మ్యాడీ చిన్నిని చూస్తున్నా అంటాడు. చిన్నప్పుడు బొమ్మల పెళ్లి జరిగింది ఈ బొమ్మ నా దగ్గర ఉంది ఇంకొటి చిన్ని దగ్గర ఉంది అప్పటి నుంచి ఈ బొమ్మని నా గుండెల్లో దాచుకున్నా అని మ్యాడీ అంటాడు.
మధు ఎమోషనల్ అయి చిన్ని కూడా ఇలాగే పెళ్లి కొడుకు బొమ్మని దాచుకుని ఉంటుంది అని అంటుంది. ఈ విషయం నీకు ఎలా తెలుసు అని మ్యాడీ అంటే గెస్ చేశా అని చెప్తుంది. ఇక చిన్ని కోసం మ్యాడీ కవితలు రాయడంతో మధు వాటిని వినిపించమని అడుగుతుంది. మ్యాడీ చిన్ని కోసం ఎమోషనల్‌గా అవి చదివితే మధు చాలా హ్యపీగా ఫీలవుతుంది. నా జీవితానికి అర్థం నీ ప్రేమని పొందడం మాత్రమే అని నిన్ను నన్ను కలపకపోతే ప్రేమకి అర్థమే లేదు అని మ్యాడీ చదువుతుంటే మధు చాలా హ్యాపీగా ఫీలవుతుంది.
మధు పెళ్లి కూతురు బొమ్మ మ్యాడీకి ఇచ్చి తొందర్లోనే నీ చిన్ని నీ దగ్గరకు వస్తుందని అని చెప్తుంది. మ్యాడీ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. మధు, మ్యాడీని తీసుకొని బయటకు వెళ్తుంది. కవితలు బాగున్నాయి అని మధు అంటుంది. నాకు నచ్చితే చిన్నికి నచ్చినట్టే అని అంటుంది. అది ఎలా అని మ్యాడీ అంటే నువ్వు అంత ఫీలై రాశావ్ నా మనసుని తాకాయి కాబట్టి చిన్నికి నచ్చుతాయి అని అంటుంది. ఇక నువ్వు చిన్ని కలిసి తిరిగిన ప్లేస్‌లు నాకు చూడాలి అని ఉంది చూపిస్తావా అని అడుగుతుంది. మ్యాడీ సరే అని మధుని తీసుకెళ్తాడు.
మ్యాడీ, చిన్ని ఇద్దరూ ముందు సత్యం ఇంటికి వెళ్లి చూస్తారు. ఇద్దరూ ఎమోషనల్ అయిపోతారు. చిన్నిని కలిసినట్లు ఉందని అని మ్యాడీ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఇక ఇద్దరూ సెల్ఫీ తీసుకుంటారు. మ్యాడీ మధు భుజం మీద చేయి వేయడంతో మధు చాలా హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత స్కూల్ ఉండే ప్లేస్‌కి వెళ్తారు. ఆ ప్లేస్ అంతా మ్యాడీ మధుకి వివరించి చెప్తాడు. అక్కడా ఫొటో తీసుకుంటారు. ఓ చోట పానీ పూరీ బండి కనిపించి అక్కడికి తీసుకెళ్తాడు. చిన్నప్పుడు పానీ పూరీ చిన్ని ఇక్కడే తినేది అని మ్యాడీ చెప్పగానే మధు వెళ్లి తింటుంది. మధుతో మ్యాడీ నువ్వు పానీ పూరీ తినే స్టైల్ చూస్తే నాకు చిన్ని గుర్తొస్తుంది అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















