అన్వేషించండి
Nuvvunte Naa Jathaga Serial Today October 25th: నువ్వుంటే నా జతగా: దేవా కేసులో ఊహించని ట్విస్ట్! న్యాయమూర్తి హరివర్ధన్ సంచలన నిర్ణయం!
Nuvvunte Naa Jathaga Serial Today Episode October 25th హరివర్ధన్ దేవా తరఫున వాదించి దేవాని నిర్దోషిగా బయటకు తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

నువ్వుంటే నా జతగా సీరియల్
Source : https://www.hotstar.com/
Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా వైపు మాట్లాడటానికి లాయర్‌గా జడ్జి హరివర్ధన్ వస్తారు. మిథునతో విచారిస్తాడు. మీ భర్త రౌడీయిజం చేస్తాడు కాబట్టి మీకు మీ భర్త మీద ద్వేషం ఉందా అని మిథునని అడుగుతారు. అవును అని మిథున అంటే ఈవిడ తన భర్తకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కారణం ఇదే యువరానర్.. అతను బలవంతంగా తాళి కట్టాడు.. రౌడీ అనే ఇలా సాక్ష్యం చెప్పారు అని అంటాడు.
ఆదిత్య మిథునకు దేవా అంటే ఇష్టమే అని కానీ తన తండ్రి నేర్పిన విలువల కారణంగా దేవా తప్పు చేశాడు అని సాక్ష్యం చెప్పిందని అంటాడు. మిథున చెప్పిన రోడ్డులో చాలా బిజీగా ఉంటుంది. దేవా రణధీర్‌ని తరిమి తరిమి కొడితే ఈవిడ తప్ప ఇంకెవరూ చూడలేదా అని హరివర్ధన్ అడుగుతాడు. ఇంత పెద్ద కేసులో ఒక్కరి సాక్ష్యం చూసి తీర్పు చెప్పడం కరెక్ట్ కాదని అంటారు. దేవా పేరు మోసిన రౌడీ.. పురుషోత్తం పెద్ద దాదా ఆ భయంతోనే ఎవరూ ముందుకు రాలేదని ఆదిత్య అంటే మరి ఈవిడ ఎందుకు వచ్చారు అని హరివర్ధన్ అడుగుతాడు.
మిథున ధైర్యంతో చెప్పిందని అంటే దేవా రోడ్డుమీద కొడితే ఆవిడ అప్పుడే పోలీసులకు చెప్పొచ్చు కదా. కనీసం ఇంటికి వెళ్లిన తర్వాత అయినా చెప్పాలి కదా అని అడుగుతాడు. దేవాని పోలీసులు అరెస్ట్ చేస్తామన్న తర్వాతే తనకి ధైర్యం వచ్చింది.. అతను తన మెడలో బలవంతంగా తాళి కట్టినందుకు బదులు తీర్చుకోవచ్చు అని ధైర్యం వచ్చిందని హరివర్ధన్ అంటారు. దానికి మిథున దేవా నా మెడలో బలవంతంగా తాళి కట్టినా నేను మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరించాను అని మీకు తెలుసు కదా నాన్న అని అంటుంది. నాన్న కాదు లాయర్ హరివర్ధన్ అని మిథున తండ్రి అంటాడు. దాంతో మిథున సారీ చెప్తుంది. లాయర్ హరివర్ధన్ ఆ గొడవ జరగలేదుని రణధీర్ ఎమ్మెల్యే కొడుకు కాబట్టి ఎవరో ఒకరు దాడి చేసుంటారు.. పురుషోత్తాన్ని రాజకీయంగా ఓడించడానికి దాన్ని దేవా మీద నెట్టేశారని హరివర్ధన్ అంటాడు. హరివర్ధన్ దేవా ఏం తప్పు చేయలేదు అని వాదిస్తాడు. సాక్ష్యం చెల్లదు కాబట్టి నిజానిజాలు తేలేవరకు దేవాని నిర్దోషిగా విడిచిపెట్టాలని అంటాడు.
జడ్జి కేసు పరిశీలించి ఒక్కరి సాక్ష్యం ఆధారంగా తీర్పు చెప్పడం సరికాదని అప్పటి వరకు దేవాని బెయిల్ మీద విడుదల చేసి కేసు వాయిదా వేస్తారు. దేవాని విడుదల చేయడంతో శారద చాలా సంతోషపడుతుంది. బయట శారద, సత్యమూర్తి దేవాతో మాట్లాడుతారు. మిథున దూరంగా ఉండి చూస్తుంది. నీ కోసం ఒక్క లాయర్ రాకపోవడం చూసి ఇలాంటి బతుకా నా కొడుకు బతుకుతున్నాడు అనుకున్నాకానీ జడ్జి హరివర్ధన్ గారు నీ కోసం జడ్జి స్థానం వదిలి లాయర్‌గా రావడం చూసి నువ్వు ఏం తప్పు చేయలేదు అని నమ్ముతున్నాం అని అంటాడు.
శారద, సత్యమూర్తి వాళ్లు జడ్జి హరివర్దన్ దగ్గరకువెళ్లి మీరు మా కొడుకు మీద ఉన్న కోపంతో వాడిని శిక్షిస్తారు అనుకున్నాం కానీ మీరు చేసిన ఈ సాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం అని దండం పెడతారు. తప్పుగా మిమల్ని అనుకున్నందుకు సారీ చెప్తారు. ఒకరు తప్పు చేయలేదు అనినేను నమ్మితే ఒకరు శత్రువు అయినా సరే వాళ్లకి అండగా నిలుస్తాను.. ఇది నా వృత్తి ధర్మం మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు. మా కొడుకుని కాపాడుకోవడమే కాదు మీ అల్లుడిని కాపాడుకున్నారు అని శారద అంటుంది. ఎవరు అల్లుడు ఎవరికి అల్లుడు నాకు కూతురే లేదు ఇక అల్లుడు ఎక్కడనుంచి వస్తాడు అని చెప్పి వెళ్లిపోతాడు. జడ్జి గారు ఏంటి కూతురు లేదు అల్లుడు లేడు అంటారు అని కాంతం అంటుంది.
ఎమ్మెల్యే దేవుడమ్మ కేసు ఓడిపోయినందుకు కోపంతో రగిలిపోతుంది. ఆ దేవా నాకొడుకుని కొట్టాడు వాడిని ఈ భూమి మీద లేకుండా చేయాలికానీ వాడు రేపు నా ముందు తల ఎగరేస్తాడు అందుకే వాడిని చంపేస్తా అని అంటుంది. కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు మేడం దేవా ఎమ్మెల్యే కొడుకుని ఎందుకు కొట్టాడు అని అంటే మీ అబ్బాయి ఆ అమ్మాయి మీద చేసిన అఘాయిత్యం బయటకు వస్తుంది. దాంతో అబ్బాయి జైలుకి వెళ్తాడు అంటే దాంతో హరివర్ధన్‌ని చంపేస్తానని దేవుడమ్మ అంటుంది. దేవా ఇంటికి వస్తాడని మిథున ఇంటి మొత్తం దీపాలతో నింపేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
హైదరాబాద్
విశాఖపట్నం
సినిమా
Advertisement





















