Illu Illalu Pillalu Serial Today October 25th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: దీపావళి వేడుకల్లో రామరాజు ఇంట్లో ఏం జరిగింది? తండ్రీకొడుకుల కామెడీ!
Illu Illalu Pillalu Serial Today Episode October 25th రామరాజు ఇంట్లో దీపావళి వేడుకలు మొదలవ్వడం రామరాజు కొడుకులకు బట్టలు పంచేటప్పుడు కామెడీ జరగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode రామరాజు ఇంట్లో దీపావళి పండగ వేడుకలు మొదలవుతాయి.. వేదవతి హడావుడిగా పనులు చేస్తూ పేరుకే ముగ్గురు కోడళ్లు ముగ్గురూ వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు కానీ ఒక్కరూ నాకు సాయం చేయడం లేదు అని ముగ్గుర్ని పిలుస్తుంది. 
ప్రేమ కూడా వల్లీ అక్కా అని పిలిస్తే శ్రీవల్లిని పిలిస్తే రాత్రి ప్రేమ మందు మత్తులో చేసిన పనులు గుర్తొచ్చి వల్లి వణికిపోతూ డైనింగ్ టేబుల్ కింద దాక్కుంటుంది. ప్రేమ మొత్తం వెతుకుతూ వల్లీ చేయి తొక్కి వల్లిని చూస్తుంది. ఇక్కడున్నావ్ ఏంటి అక్క రా నీతో పని ఉంది అని పిలుస్తుంది. రాత్రి ఒళ్లు నొప్పులే ఇంకా తగ్గలేదు నేను రాను అని వల్లీ బిక్కు ముఖం పెడుతుంది. నీ కంటే పెద్దదాన్ని నీకు అక్కలాంటి దాన్ని మంచితనానికి మారుపేరు అయినా నాతో నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని అంటుంది. దానికి ప్రేమ ఏం మాట్లాడుతావ్ అక్క నువ్వు నాకంటే పిచ్చి దానిలా.. బాగా తలనొప్పిగా ఉంది నువ్వు చక్కగా కాఫీ పెడతావ్ అని పిలిచా అని అంటుంది. 
వల్లీ ప్రేమతో రాత్రి ఏం జరిగిందో మర్చిపోయావా అంటే ఏంటి అక్క రాత్రి నువ్వు కూల్‌డ్రింక్ ఇచ్చావ్ తాగేసి పడుకున్నా అంతే ఇంకేం గుర్తు లేదు అంటుంది. నిజంగా గుర్తులేదా డ్రామాలాడుతుందా అని వల్లీ అనుకుంటూ కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. 
వల్లీ వెళ్లగానే నర్మద, వేదవతి వస్తారు. ఏంటి మేడం రాత్రి రచ్చ చేశారు అని అడిగితే వల్లీ అక్కా అలానే అంది నేనేం చేశా అందరం కలిసి ఆడుకున్నాం.. కూల్ డ్రింక్ తాగాను అంతే కదా అంటుంది. అంతేనా నువ్వు ఏం చేశావ్ గుర్తులేదా అని ఇద్దరూ చెప్పడంతో ఇంత సినిమా చేశానా అని ప్రేమ తలపట్టుకుంటుంది. కూల్‌డ్రింక్‌లో ఎవరో మందు కలిపేశారు అని నర్మద అంటే ఆ తలకమాసినోడు ఎవరు అని వేదవతి అంటే నేనే అని తిరుపతి వస్తాడు. ముగ్గురూ కోపంగా తిరుపతిని చూస్తారు. కూల్‌డ్రింక్‌లో మందు కలపడం ఏంట్రా అని ముగ్గురు తిరుపతిని చితక్కొట్టేస్తారు.
సేనాపతి దిగులుగా కూర్చొంటాడు. ఇంతలో భార్య వచ్చి పండగకు వెళ్దాం అని అంటుంది. ఎక్కడ మనకు పండగ ఉందే.. ఎక్కడ వెలుగు ఉందే.. మా అక్కని నా కూతుర్ని తీసుకెళ్లి వాళ్లు మన పండగ తీసుకెళ్లిపోయారు అని అంటాడు. విశ్వ కూల్‌గా ఈ పండగ మంచిగా చేసుకుందాం నాన్న త్వరలో నా చెల్లి మన ఇంటికి వస్తుంది అని అంటాడు. కూతురి కాపురం నాశనం అయితే మనమే తట్టుకోలేం వాడిని ఏం చేయొద్దని చెప్పండి అని సేనతో భార్య చెప్తుంది. 
విశ్వ భద్రావతితో అత్త ఈ రోజు నరకాసురవధ మన పగకి ఇంకో స్టెప్ ముందుకు వెళ్తా ఈరోజు అమూల్యకి ప్రపోజ్ చేసి నా ప్రేమ ఒప్పుకునేలా చేస్తా ఆ రామరాజు అంతు చూస్తా అని చెప్తాడు. 
రామరాజు ముగ్గురు కొడుకులకు బట్టలు ఇస్తాడు. అది చూసి ముగ్గురు కోడళ్లు కూడా మాకు ఇస్తారు అని వెళ్లబోతే తిరుపతి ఆపి మీకు లేవు మీకు మీ అత్త ఇస్తుంది. ముగ్గురు కొడుకులకు తనే కొడుకులు కొని స్వయంగా ముగ్గురు కొడుకులకు ఇస్తాడు అని తిరుపతి అంటే పిల్లలు ఇంత పెద్దవాళ్లు అయినా మామయ్య కొనుక్కొని వస్తారు అని అంటే మామయ్య గ్రేట్ అని వల్లీ అంటే మామయ్య కొన్న బట్టలు ముగ్గరు కొడుకులు తీసుకుంటున్నారు అంటే ఇంకా గ్రేట్ అని నర్మద అంటుంది. తిరుపతి, ప్రేమ పెద్దగా నువ్వుతారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది చూసుకోండి నవ్వుకోండి అని అంటారు.
రామరాజు ముగ్గరు కొడుకులకు బట్టలు నచ్చాయో లేదో చూసుకోమని అంటాడు. ముగ్గురు బట్టలు ఓపెన్ చేసి చూస్తారు. సేమ్ కలర్ సేమ్ మోడల్ 20 ఏళ్ల క్రితం నుంచి అని తిరుపతి అంటాడు. ముగ్గురు కొడుకులు పైకి ఓకే అని లోపల మాత్రం సేమ్ కలర్ సేమ్ డ్రస్ అని ముఖాలు మాడ్చేస్తారు. ముగ్గురికి అవి చూసి యూనిఫాంలా ఉందని అనుకుంటారు కానీ బాగున్నాయి అని చెప్తారు మా బావ నవ్వుకుంటాడు చూడండి అని అంటాడు. చందు, సాగర్, ధీరజ్‌ల యాక్టింగ్‌ని తిరుపతి వల్లీ, నర్మద, ప్రేమలకు చెప్తాడు. ముగ్గురు కలిసి ఒకే కోరస్‌లో చెప్తారు చూడండి అని అంటాడు. ముగ్గురు ఒకే డైలాగ్ చెప్పడంతో ప్రేమ వాళ్లు నవ్వుకుంటారు. రామరాజు పొంగిపోతాడు. 
రామరాజు వెళ్లిపోయిన తర్వాత ప్రతీసారి ఈ రంగుల పంచాయితీ ఏంట్రా మనకి అని ముగ్గురు కొడుకులు అనుకుంటారు. వేదవతి, రామరాజు దేవుడి దగ్గర ఉంటే ముగ్గరు కోడళ్లు కొడుకులు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















