అన్వేషించండి

Jagadhatri Serial Today August 17th:కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌

Jagadhatri Serial Today Episode August 17th: కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. పద్మ హత్య కేసులో గణేశ్‌కు శిక్షపడేలా చేయాలని అసిస్టెంట్ కమిషనర్‌ వివేక్‌మిశ్రా ప్రయత్నించగా..చివరి  నిమిషంలో కోర్టులో ఆధారాలు బయటపెట్టి జేడీ అతనికి షాక్‌ ఇస్తుంది. దీంతో ఈ కేసులో జడ్జి మరోవాయిదా ఇస్తాడు.బయటకు వచ్చిన తర్వాత పై అధికారిపై జేడీ ఛాలెంజ్‌ చేయడంతో ఈరోజు ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా సాగుతుంది.
కోర్టుకు బయలుదేరిన జేడీ
                               గణేశ్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు వివేక్‌మిశ్రా గణేశ్‌ను తీసుకుని వెళ్తాడు.ఈవిషయం తెలిసిన జేడీ...ఖచ్చితంగా ఇవాళ గణేశ్‌కు శిక్షపడేలా మినిస్టర్‌ ఈ మిశ్రాతో కలిసి కుట్రపన్నాడని అంటుంది.డిఫెన్స్‌ లాయర్‌ను కూడా కొనేశారని సాధు చెబుతాడు. కళ్లముందే ఓ అమాయకుడిని బలిచేస్తున్నా చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం చేయలేకపోతున్నానని సాధు బాధపడతాడు.ఇంతకు ముందులా మీకు నేను అన్ని పవర్స్‌ ఇవ్వలేకపోతున్నానని అంటాడు. కావాలనే ఈ వివేక్‌మిశ్రాను మినిస్టర్‌ ఇక్కడికి తీసుకొచ్చాడని చెబుతాడు. ఏదీ ఏమైనా నేను మాత్రం దోషులు తప్పించుకునిపోతుంటే చూస్తూ ఉరుకోలేనని జేడీ అంటుంది. వివేక్‌కు ఎదురెళ్తే మీ ఉద్యోగాలకే ప్రమాదమని సాధు హెచ్చరిస్తాడు. ఓ నిరపరాధిని కాపాడలేకపోయినప్పుడు ఈ ఉద్యోగం ఉన్నా ఉపయోగం లేదని చెబుతుంది. మేం కోర్టుకు వెళ్తామని మా శాయశక్తులా న్యాయాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తామని జేడీ చెబుతుంది.

సింధూసాయం
                    కోర్టు దగ్గర మినిష్టర్‌ను కలిసిన మిశ్రా.. ఆ గణేశ్‌ను ఎన్‌కౌంటర్‌ చేద్దామని తీసుకొస్తుంటే ఆ సాధూ అడ్డుపడి నాతో లాగ్‌బుక్‌లో ఎంట్రీ రాయించాడని లేకపోతే ఈపాటికి వాడి ఎన్‌కౌంటర్‌ జరిగిపోయేదని అంటాడు. అయినా మీరు ఏం భయపడొద్దని అన్నీ మనం సెట్‌చేశామని చెబుతాడు. డిఫెన్స్‌ లాయర్‌ కూడా మన మాటే వింటాడని....ఆ జేడీ కోర్టులో నోరుతెరవకుండా నేను చూసుకుంటానని అంటాడు. ఇంతలో జేడీ తన టీమ్‌తో అక్కడికి వస్తుంది. మిశ్రా కావాలనే జేడీని రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తాడు. తన షూ లేస్‌ ఊడిపోయిందని కేదార్‌ను కట్టమని అంటాడు. దీంతో జేడీకి కోపం వస్తుంది. ఇప్పుడు వీడు కావాలనే చేస్తున్నాడని కేడీ అంటాడు. షూ లేస్‌ కట్టేందుకు ప్రయత్నించగా సింధూ విభూది తీసుకుని వచ్చి పెట్టుకోమని మిశ్రాకు ఇస్తుంది. అతను విభూది తీసుకుంటుండగా కళ్లల్లోకి ఊదుతుంది. దీంతో మిశ్రా కళ్లునలుపుకునే టైంలో సింధూ షూలేస్‌ కట్టేస్తుంది. ఇదంతా మీరు ఆడిన నాటకమేనా అని మిశ్రా గణేశ్‌ను తీసుకుని లోపలికి వెళ్తాడు

కోర్టులో అదరగొట్టిన జేడీ
                       కోర్టులో వాదోపవాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి గణేశ్‌ను నేరం నువ్వే చేశావా అని అడుగుతాడు. దీంతో తానే ఈ నేరానికి పాల్పడినట్లు గణేశ్‌ ఒప్పుకుంటాడు. దీంతో జడ్జి కోర్టు తీర్పు ఇచ్చే సమయంలో జేడీలేచి నేను మాట్లాడొచ్చా అని అంటుంది.వెంటనే మిశ్రా కలుగజేసుకుని నువ్వు నోరుమూసుకుని కూర్చోమని అంటాడు.అయినా జేడీ కోర్టులో మాట్లాడే అవకాశం లేదని అంటాడు. ఈకేసు విచారణ అధికారిగా నాకు ఆ హక్కు ఉందని జేడీ చెప్పడంతో...జడ్జి సరేనంటాడు. వెంటనే జేడీ బోనులోకి వెళ్లి ఈ గణేశ్‌ అసలు నేరం చేయలేదని అంటుంది. నిందితుడే ఒప్పుకుంటున్నాడు కదమ్మా అని అంటుంది. దీంతో జేడీ ఓ పెన్‌డ్రైవ్‌ తీసి ఇస్తుంది.అది చూసిన జడ్జిగారు....ఆశ్చర్యపోతారు. ఈ గణేశ్‌ తండ్రికి ఇటీవలే కిడ్ని ఆపరేషన్ జరిగిందని 20లక్షలు బిల్లు కట్టాడని చూపిస్తుంది. నెలజీతానికి పనిచేసే గణేశ్‌ 20లక్షలు ఎలా తెచ్చాడని అడుగుతుంది. అలాగే పద్మ ఆత్మహత్య చేసుకునే సమయంలో గణేశ్‌ ఆస్పత్రిలోనే ఉన్నాడని నిరూపించడంతో జడ్జి కేసు వాయిదా వేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత మిశ్రా, జేడీ ఢీ అంటే ఢీ అన్నట్లు ఢీకొట్టుకుంటారు. ఈ కేసు ఓడిపోతే యూనిఫారం తీసివేసి రాజీనామా చేస్తానని జేడీ ఛాలెంజ్ చేస్తుంది.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 17th:కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌
జగద్ధాత్రి సీరియల్: కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌
Karthika Deepam 2 Serial Today August 18th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి మనసులో మాట చెప్పేస్తుందా! సూరజ్ భర్త్‌డేకి మాలిని సందడేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి మనసులో మాట చెప్పేస్తుందా! సూరజ్ భర్త్‌డేకి మాలిని సందడేంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget