Chinni Serial Today June 27th: చిన్ని సీరియల్: కావేరి, చిన్నిల మరణవార్త విని గుండెపగిలేలా ఏడ్చిన బాల.. మరో కథకు సర్వం సిద్ధం!
Chinni Today Episode కావేరి, చిన్నిలు చనిపోయారని దేవా జైలుకి వెళ్లి బాలరాజుని మాటలతో ఇబ్బంది పెట్టడం గుండె పగిలేలా బాలరాజు ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవా రౌడీలకు కాల్ చేస్తే కావేరి, చిన్నిని ఇద్దరినీ చంపేశామని చెప్తారు. దేవా ఎగిరి గంతేసి గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరి శవాలను కాల్చేయని.. ఆ శవాలు కాల్చినప్పుడు వీడియో తీసి పెట్టమని అంటాడు. రౌడీలు తల పట్టుకుంటారు. ఇప్పుడే చిన్ని శవం ఎలా అనుకుంటారు. దాంతో మరో రౌడీ కావేరి శవం పక్కన మరో చితి పెట్టి చూపిద్దాం అని అంటాడు.
కావేరి శవం పక్కన మరో చితి పెట్టి దేవాకి వీడియో కాల్ చేస్తారు. దేవా చాలా హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు జైల్లో బాలరాజు చిన్ని కావేరి గురించి చాలా టెన్షన్ పడతాడు. దేవేంద్ర వర్మ బాలరాజు దగ్గరకు వెళ్తాడు. నీకు ఇక్కడ అంతా బాగుంది కదా అంటాడు. ఎందుకు వచ్చావ్ అని బాలరాజు చిరాకుపడతాడు. దాంతో దేవా నీకో శుభవార్త నీకు కాదు నాకు శుభవార్త నీకు అశుభవార్త.. నీ భార్య, కూతుర్ని ఒకేసారి చంపేసి చితి పేర్చుతా అన్నా కదా ఆ ప్రోగ్రాం పూర్తి అయింది అంటాడు. రేయ్ ఏం చెప్తున్నావ్‌రా అని బాలరాజు అరుస్తాడు. నేను చెప్తే నమ్మడం లేదు కదా ఆఫ్ టికెట్‌తో చెప్పిస్తా అని దేవా అని ఆఫ్ టికెట్‌కి కాల్ చేస్తాడు.
ఆఫ్ టికెట్ ఏడుస్తుంటాడు. దేవా కాల్ చేసి ఇద్దరూ చనిపోయారు అంటే బాలరాజు నమ్మడం లేదు ఏంట్రా నువ్వు చెప్పు అంటాడు. అయ్యో అని ఆఫ్ టికెట్ ఏడుస్తాడు. బాలరాజు మాట్లాడగానే అన్నా.. ఘోరం జరిగిపోయింది అన్నా వదినమ్మా.. చిన్ని ఇద్దరూ చనిపోయారు అన్నా అని ఏడుస్తాడు. ఏం చెప్తున్నావ్‌రా అని బాలరాజు షాక్ అయిపోతాడు. కుప్పకూలిపోయి కావేరి నా కావేరి.. చిన్ని అని కింద పడి చాలా ఏడుస్తాడు. దేవా బాలరాజు దగ్గరకు వచ్చి ఎలా ఉంది నేను ఇచ్చిన గిఫ్ట్ అని అంటాడు. బాలరాజు కోపంగో దేవా గొంతు పట్టుకుంటాడు. నిన్ను చంపేస్తారా అని అంటాడు.
జైలర్ చూసి బాలరాజుని కొడతాడు. దేవా ఏడుస్తున్న బాలతో మిత్రమా నిన్ను 14 ఏళ్ల తర్వాత వాళ్ల దగ్గరకే పంపిస్తా ఏం బాధ పడకు. ఈ 14 ఏళ్లు వాళ్లని తలచుకొని కుమిలి కుమిలి చచ్చిపో.. ఇక్కడ అందరూ మనవాళ్లు నీకు ఎలా నరకం చూపించాలో వీళ్లకి చెప్తా అని అంటాడు. బాలరాజు కావేరి, చిన్నిలను తలచుకొని గుండె పగిలేలా ఏడుస్తాడు. చిన్నిని గుడిలో కలిసిన ఆ దంపతులు చిన్నిని తమ ఇంటికి తీసుకెళ్తారు. చిన్ని ఇంటి పెరటిలో ఉన్న చెట్టు కింద కూర్చొని అమ్మని తలచుకొని ఏడుస్తుంది.
చిన్ని కోసం భోజనం తీసుకొస్తారు. దేవుడు మంచోడు కాదు మంచివాడు అయితే మంచి వాళ్లని చంపడు కదా.. మంచి వాడు అయిన మా మామయ్యని చంపేశాడు ఆ దేవుడు.. మా నాన్నని జైలు పాలు చేశాడు.. మంచిదైన మా అమ్మని చంపేశాడు ఆ దేవుడు.. అని తిట్టుకుంటుంది. చనిపోయిన అమ్మని వదిలేసి వచ్చాం కదా ఒక్కసారి వెళ్దాం అంటే వద్దని ఆ ఊరు వెళ్తే నిన్ను చంపేస్తారమ్మా అని చిన్నిని బుజ్జగిస్తారు. అక్కడ ఎవరో మీ అమ్మకి అంత్యక్రియలు చేశారు అని చెప్తారు. చిన్ని చాలా ఏడుస్తుంది. జరిగింది జరిగిపోయింది అంతా మర్చిపోయి నువ్వు కొత్త జీవితం మొదలు పెట్టమ్మా అని బతిమాలుతారు. తినమని చెప్తారు.
నాన్న దగ్గరకు రేపు మీరు తీసుకెళ్తా అంటే తింటాను అని చిన్ని అంటుంది. నువ్వు వెళ్లొద్దు ఈయన వెళ్లి జరిగింది అంతా చెప్పి వస్తారని చిన్నితో చెప్తారు. చిన్నిని ఆవిడ బుజ్జగించి తినిపిస్తుంది. చిన్ని వాళ్ల అమ్మ చిన్నిని తన తండ్రికి అప్పగించమని ఏం చెప్పలేదు మా కూతురిగా చూసుకోమని చెప్పింది ఇప్పుడేం చేయాలి అని అనుకుంటాడు. చిన్ని ఫొటో చూస్తూ మహి చాలా ఏడుస్తాడు. రేపటి నుంచి స్కూల్‌కి వస్తా అని ప్రామిస్ చేసి ఏమైపోయావ్ అని ఏడుస్తాడు. ప్రమీల భోజనం తీసుకొస్తుంది. తినమని చెప్తే వద్దు అంటాడు. నాగవల్లి, దేవా తినమని అంటే చిన్ని రాలేదు ఏదో ప్రాబ్లమ్‌లో ఉండి ఉంటుంది అని బాధ పడతాడు. అన్నం విసిరేస్తాడు. నాగవల్లిని పట్టుకొని చిన్నికి ఏదో జరిగుంటుందమ్మా అని ఏడుస్తాడు. చిన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయమ్మా అని ఏడుస్తాడు. దేవా తన మనుషుల్ని పిలిచి చిన్నీ గురించి ఎంక్వైరీ చేయండి అని యాక్టింగ్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి గ్రూప్ కంపెనీకి ఎదురుదెబ్బ! ఘోర అవమానం.. లక్ష్మీ రాజీనామా!





















