Chinni Serial Today June 23rd: చిన్ని సీరియల్: అడవి నుంచి తప్పించుకున్న కావేరి, బాలరాజు, చిన్ని.. లోహితకు చందు స్ట్రాంగ్ వార్నింగ్!
Chinni Today Episode కానిస్టేబుల్ శంకరం సాయంతో చిన్నిని తీసుకొని బాలరాజు, కావేరి అడవి నుంచి బయటకు వెళ్లడం దేవా రౌడీలను తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode బాలరాజు, కావేరి, చిన్నిలు అడవిలో రాత్రంతా తిరుగుతూ ఉంటారు. ఎటు వైపు వెళ్లాలో అర్థం కాక ఓ చోట ఆగుతారు. కానిస్టేబుల్ శంకరానికి కాల్ చేద్దామన్నా సిగ్నల్ లేదు అని కావేరి అంటుంది. చిన్ని నడిచి నడిచి అలసిపోవడంతో ఓ చోట ఆగుతారు. పోలీసులు బాలరాజు కోసం వెతుకుతూ ఉంటారు.
పోలీసుల టార్చి లైటింగ్ చూసి పోలీసులు వచ్చేస్తున్నారని దాక్కుంటారు. బాలరాజు వాళ్లు దాక్కున్న దగ్గరికి పోలీసులు వచ్చి చూసి ఎవరూ కనిపించకపోవడంతో వెళ్లిపోతారు. తర్వాత బాలరాజు వాళ్లు మళ్లీ వెళ్తుంటారు. లోహిత తన తల్లికి అత్తకి మధ్య జరిగిన విషయం గుర్తు చేసుకొని ఉంటుంది. చందు చెల్లి కోసం తినడానికి అన్నం తీసుకొస్తాడు. లోహితకు అవసరం లేదు అని అన్నాన్ని విసిరేస్తుంది. అన్నాన్ని నేలపాలు చేశావేంటి అని చందు కోప్పడితే నేను అన్నమే నేలపాలు చేశా.. కానీ ఆ చిన్ని మన జీవితం నాశనం చేసేసింది అంటుంది. చిన్నిని ఎందుకు అంటావేంటి అంటాడు. దాంతో లోహిత ఆ చిన్ని వల్లే ఇదంతా జరిగింది అమ్మానాన్నలకు గొడవలు అయ్యాయి. నాన్న మనకు దూరం అయ్యారు. రాజమండ్రిలో ఉండాల్సిన మనం ఈ పల్లెటూరికి వచ్చాం.. మంచి స్కూల్ వదులుకున్నాం. ఇంకా నాన్నలా దాన్నే వెనకేసుకొస్తావేంటి అని లోహిత చందుని అడుగుతుంది.
చందు చెల్లితో నేను చిన్నినే వెనకేసుకొస్తా ఎందుకంటే జరిగిన దాంట్లో చిన్ని తప్పు ఏంలేదు. నా ముందు ఇంకోసారి చిన్ని గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని చెల్లికి వార్నింగ్ ఇచ్చి లోపలికి పంపేస్తాడు. చందు చిన్నిని గుర్తు చేసుకుంటాడు. ఎందుకు చిన్ని ఇలా మనం విడిపోయాం. ఎప్పటికైనా కలుస్తామా.. నిన్ను అత్తయ్యని చూడాలి అనిపిస్తుంది చిన్ని అనుకుంటాడు.
అడవిలో నడుస్తున్న చిన్ని ఇక తన వల్ల కాదు అని తల్లితో చెప్తుంది. ముగ్గురు ఓ చోట ఆగుతారు. చిన్ని ఉదయం నుంచి తిండితిప్పలు లేకుండా తిరుగుతుందని కాసేపు పడుకోమని కావేరి అంటుంది. బాలరాజు చిన్ని కోసం ఊయల కడతాడు. చిన్నిని ఇద్దరూ అందులో పడుకోపెట్టి ఊయల ఊపుతారు, చిన్ని పడుకుంటుంది. తర్వాత బాలరాజు పక్కనే కూర్చొంటే కావేరి వెళ్లి బాలరాజు పక్కన కూర్చొంటుంది. బాలరాజు భుజం మీద చేయి వాళ్చి ఏంటి బాల మన జీవితాలు ఇలా అయిపోయావి. నువ్వు నేను నిర్దోషిలా బయటకు వస్తాం.. చిన్నితో సంతోషంగా ఉంటాం అనుకుంటే ఇలా అయింది ఏంటి అని అడుగుతుంది.
బాల కావేరితో ఇదంతా దేవా వల్లే వాడి నిజస్వరూపం బయట పెట్టే వరకు మనకు తప్పదు అని అంటాడు. కావేరి మెమోరీ కార్డు గురించి అడుగుతుంది. గొడవ గురించి బాల చెప్పి అక్కడే మిస్ అయింటుందని అంటాడు. అక్కడికి వెళ్లి వెతుకుతానని కావేరి చెప్తుంది. ఇంతలో చిన్ని నాన్న నాన్న అని అరుస్తూ లేచి కంగారు పడుతుంది. ఇక బాలరాజు, కావేరి చిన్ని దగ్గరకు వెళ్తే నిన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు కల వచ్చిందని చెప్తుంది. మనం చాలా దూరం వచ్చాం పోలీసులు వచ్చి వెళ్లిపోయారు కదా ఇక రారు అని అంటాడు. ఇంతలో ఓ ఫ్యామిలీ ట్రక్కింగ్‌కి వచ్చామని బాలరాజు వాళ్లతో మాట్లాడుతారు. వాళ్ల టెంట్‌ల దగ్గరకు రమ్మని చెప్తారు. బాల వద్దు అనేస్తాడు. ముగ్గురిని చూసి ఏం తినలేదు అని అర్థమైంది అని తినడానికి స్నాక్స్ ఇస్తారు.
కావేరి బాలరాజు వాళ్లతో ఆ దేవుడే ఇలా వీళ్ల రూపంలో ఆహారం పంపినట్లు ఉన్నాడు అని ముగ్గురూ ఒకరికి ఒకరు తినిపించుకొని తింటారు. తర్వాత చిన్నిని ఊయలలో పడుకోపెడతారు. దేవా పంపిన రౌడీలు వెతుకుతూ ఉంటారు. వాళ్లకి దేవా కాల్ చేస్తాడు. ఇంకా కనిపించలేదు అనగానే రౌడీలను దేవా తిడతాడు. వాళ్లని మీరు వెతికి చంపకపోతే నేను మిమల్ని చంపేస్తా అని బెదిరిస్తాడు. బాలరాజు టైం చూసి 4 అయింది ఎలా అయినా ఉదయానికి మనం ఈ అడవి నుంచి బయట పడాలి అంటాడు. చిన్నిని కావేరి నిద్ర లేపుతుంది. ముగ్గురు బయల్దేరుతారు. దేవా పోలీసులకు ఫోన్ చేస్తాడు. అడవి మొత్తం వెతకమని కంగారు పెడతాడు.
బాలరాజు ఫోన్‌కి సిగ్నల్ రావడంతో కానిస్టేబుల్‌కి కాల్ చేస్తాడు. శంకరం వాళ్లు అడవి ప్రారంభంలో ఉన్నామని చెప్పాగానే వస్తున్నాం అని చెప్పి బాలరాజు వాళ్లని తీసుకొని బయల్దేరుతాడు. రౌడీలు వచ్చి చూసి మిస్ అయిపోయారు అనుకొని దేవాకి కాల్ చేసి ఏదో బంటి వెక్కి అడవి నుంచి బయటకు వెళ్లిపోయారు అని చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: కోర్టులో ఉత్కంఠ.. లక్ష్మీకి శిక్ష గ్యారెంటీ.. విహారి ఏం చేయనున్నాడు!





















