Chinni Serial Today july 8th: చిన్ని సీరియల్: మత్తులో లోహిత చందుకి దొరికిపోతుందా.. బాలరాజు మీద దేవా పగ తీరలేదా!!
Chinni Today Episode చిన్ని గురించి మర్చిపో అని దేవా, వల్లి ఇన్‌డైరెక్ట్‌గా మహికి చెప్పడం బాలరాజుని విడుదలకు సిద్ధం కావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధుమిత, లోహిత అందరూ కాలేజ్‌లో పరిచయాలు చేసుకుంటారు. రాత్రి లోహిత తన ఫ్రెండ్స్‌తో కలిసి బీర్లు తాగుతుంది. మధుని గుర్తు చేసుకొని ఫస్ట్ డే ఎంతో సంతోషంగా ఉండాలని అనుకుంటే ఆ మధుమిత నన్నే ఎదిరించింది అని రగిలిపోతుంది. కరెక్ట్‌గా స్కెచ్ వేస్తా దాన్ని స్మాష్ చేస్తాను అనుకుంటుంది.
రాత్రి మహి ఇంట్లో అందరూ డిన్నర్‌కి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొంటారు. విక్కీ చెల్లిని ఏడిపిస్తాడు. శ్రియని నాగవల్లి ముద్దుల కోడలు అంటుంది. ఇక శ్రియ మహిని చూసి మ్యాడీ ఓ మై మ్యాడీ అని పాడుతుంది. మహి వచ్చి ఆపవే చెత్త పాటలు పాడుతున్నావ్ అంటాడు. శ్రియ తల్లితో పాటల పోటీకి పంపకు అత్త అందరూ పిచ్చి ఎక్కిపోతారు అంటాడు. అందరూ జోకులు వేసుకొని నవ్వుకుంటారు. ఇంతలో దేవా రావడంతో అందరూ సైలెంట్ అయిపోతారు. రోజూ కాలేజ్ నుంచి వచ్చాక బావకి దిష్టి తీయాలి మనకు ఎండు మిర్చి ఖర్చు పెరిగిపోతుందని అంటుంది. అందరూ నవ్వుతూ సంతోషంగా తింటారు.
నాగవల్లి, దేవా మహితో భోజనం తర్వాత మాట్లాడుతారు. చిన్నిని ఉద్దేశించి గతాన్ని మర్చిపోయి చక్కగా చదువుకోమని అంటారు. గతం గతంలోని జ్ఞాపకాలు గురించి ఆలోచించకుండా ఉండటం అంటే ఊపిరి పీల్చుకోకుండా ఉండటమే అని అంటాడు. తన గురించి ఎక్కువ టెన్షన్ పడుతున్నారు నా గురించి వదిలేయండి నేను హ్యాపీగా ఉంటా మిమల్ని హ్యాపీగా ఉంచుతా అంటాడు. దేవా వల్లితో మహి ఇలా మాట్లాడుతున్నాడేంటి అంటే వల్లి తాను హ్యాండిల్ చేస్తాను అంటుంది.
రౌడీలు దేవాకి కాల్ చేసి బాలరాజుకి స్పాట్ పెట్టామని అంటారు. దేవా కచ్చితంగా జైలు నుంచి వచ్చిన బాలరాజుని చంపేయమని అంటాడు. మరోవైపు లోహిత రాత్రి అయినా రాలేదని సరళ టెన్షన్ పడుతుంది. చందు వచ్చి నువ్వు ఇంకా తినలేదు అమ్మా లోహిత రాలేదా అంటే వచ్చేసింది బాత్‌రూమ్‌లో ఉందని అబద్దం చెప్తుంది. చందు వెళ్లిపోతాడు. లోహిత మత్తులో ఇంటికి వస్తుంది. అమ్మకి తెలిస్తే చంపేస్తుందని హాల్‌లో కునుకుపాట్లు పడుతున్న అమ్మకి తెలీకుండా అతి కష్టం మీద గదిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో సరళ చూసేస్తుంది. లోహిత అని పిలవగానే లోహిత దొరికిపోయాను మందు తాగినట్లు తెలిస్తే చంపేస్తుందని అనుకుంటుంది.
సరళ లోహితను ఎక్కడికి వెళ్లావ్ ఎందుకు లేటు అయిందని ప్రశ్నిస్తుంది. ఆ కేకలకు చందు బయటకు వస్తాడు. లోహిత ఇప్పుడే వచ్చిందా టైం ఎంత ఈ టైం వరకు ఎక్కడ ఉన్నావ్.. అని ప్రశ్నిస్తాడు. తల్లితో దీని ప్రవర్తన ఎలా మారిపోతుందో చూశావా అని ప్రశ్నిస్తాడు. లోహిత తండ్రిలా తనని అలా అనకు అని అలా అంటే నిన్ను నాన్న 2 అని పిలవాల్సి వస్తుందని నిద్ర వస్తుందని వెళ్లిపోతుంది. చందు తల్లితో లోహిత కంట్రోల్ తప్పిందని మొదట్లోనే సెట్ చేయాలి అంటాడు.
జైలులో ఉన్న బాలరాజు కావేరి, చిన్నిలను తలచుకొని ఏడుస్తాడు. జైలు నుంచి బయటకు వచ్చి ఏం చేయాలి అనుకుంటాడు. మధు తల్లి ముగ్గు వేస్తుంటే చూస్తుంటుంది. తమ్ముడు పాల ప్యాకెట్ తీసుకొస్తే టీ చేయడానికి స్వరూప వెళ్లడంతో మధు తండ్రి పేరున ఐలవ్‌యూ సుబ్బు అని రాస్తుంది. తండ్రిని పిలిచి అమ్మ రాసిందని అంటుంది. ఇక తమ్ముడిని ఆట పట్టిస్తుంది. మరోవైపు బాలరాజు దేవా మాటలు తలచుకొని చిన్ని కావేరి చనిపోయిందని ఏడుస్తాడు. ఇంతలో తనని తోటి ఖైది వచ్చి నీ భార్య పిల్లలు ఎక్కడో ఒక చోట బతికే ఉంటారు. కొన్ని సార్లు మన చెవులు కళ్లు మనల్ని మోసం చేస్తాయి. ఎవరినీ నమ్మొద్దు అని చెప్తాడు. ఇక మహి చిన్నిని తలచుకొని ఎప్పటికైనా నన్ను కలుస్తా అని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: మహి కారుని ఆటోలా వాడేసుకున్న మధుమిత.. దేవా హోంమంత్రి.. శ్రియ ఎవరో తెలుసా!





















