Chinni Serial Today June 13th: చిన్ని సీరియల్: నాగవల్లిని చంపేస్తానన్న దేవా! కావేరి ప్లాన్ ఫెయిల్, మాణిక్యం గురించి దేవాకి తెలిసిపోతుందా!
Chinni Today Episode బాలరాజు, కావేరి మాణిక్యం గురించి మాట్లాడుకోవడం దేవా వినేయడం కావేరి దేవాని నాగవల్లికి పట్టించాలని వీడియో తీయడం దేవాకి తెలిసిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవేంద్రవర్మ, నాగవల్లిల పెళ్లికి ఇంట్లోనే ఘనంగా ఏర్పాట్లు జరుగుతాయి. బాలరాజు ఇచ్చిన వార్నింగ్‌ని దేవా గుర్తు చేసుకొని నిజంగానే బాలరాజు దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా.. ఈ రెండు రోజులు వాడిని ఇంటి నుంచి కదలకుండా చేశా అది చాలు.. నాకు నాగవల్లికి పెళ్లి అయిపోతే తర్వాత ఏం చేయాలో ఆలోచించొచ్చని అనుకుంటాడు. ఇంతలో కావేరి అటుగా వెళ్తుంటే కావేరిని వెనకాలే వెళ్తాడు.
కావేరి దేవాని గుర్తించి నాతో ఏదో మాట్లాడటానికి నన్ను ఫాలో అవుతున్నాడు అదంతా రికార్డ్ చేసి నాగవల్లికి చూపిస్తే వీడి బండారం బయట పడుతుందని అనుకొని ఓ చోట తన ఫోన్ పెడుతుంది. దేవా వచ్చి మాట్లాడితే రేపో మాపో జైలుకి వెళ్తావ్ నువ్వు నాగవల్లిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటుంది. నేను జైలుకి వెళ్లడం ఏంటి నాన్‌సెన్స్ అని దేవా అంటాడు. పార్వతిని నువ్వే చంపావు అనడానికి తగిన సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అని కావేరి అంటుంది. నేను పార్వతిని చంపినప్పుడు ఉన్న వీడియో మీ దగ్గర ఉంటే ఆ సాక్ష్యంతో పాటు మిమల్ని ఎలా చంపేయాలో నాకు తెలుసు అని అంటాడు. దానికి కావేరి ఎంత మందిని చంపేస్తావురా తన అక్కని నువ్వే చంపావని నాగవల్లికి తెలిస్తే నిన్ను చంపేస్తుందని కావేరి అంటే దానికి ఎందుకు అంత ఛాన్స్ ఇస్తాను.
నాగవల్లిని చంపేస్తా అని దేవా అంటాడు. నా నిజస్వరూపం తెలిసినందుకు పార్వతిని చంపేశా మీ అన్నయ్యని చంపేశా ఇప్పుడు ఆ నాగవల్లిని చంపేయలేనా చంపేస్తా అని అంటాడు. ఇంతలో మహి మెహందీ ఫంక్షన్ కోసం తండ్రిని పిలుస్తే దేవా వెళ్లిపోతాడు. కావేరి ఫోన్ తీసుకొని నాగవల్లి దగ్గరకు పరుగులు పెడుతుంది. మీ బావ దుర్మార్గం నువ్వే ఈ వీడియోలో చూడు అని అంటుంది. నాగవల్లి ఫోన్ చూసి వీడియో ఏం లేదు కదా అంటుంది. కావేరి షాక్ అయిపోతుంది. రికార్డ్ బటన్ సరిగానే నొక్కా కానీ ఎందుకు రికార్డ్ అవ్వలేదు అనుకుంటుంది. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే చంపేస్తా అని నాగవల్లి అంటుంది.
దేవా కావేరి దగ్గరకు వచ్చి రికార్డ్ అవ్వలేదు అని బాధ పడుతున్నావా ఆ రికార్డ్ నేనే ఆపేశా నీ కన్నా నీ మొగుడు కన్నా నాకు ముందు చూపు ఎక్కువ అని అంటాడు. మెహందీ వేడుక మొదలవుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. పిల్లలు అయితే ఇంకా సంతోషంగా ఉంటారు. బాలరాజు కూడా అక్కడికి వచ్చి కావేరి కోసం వెతుకుతాడు. దేవా చూసి ఏంటి మిత్రమా దిక్కులు చూస్తున్నావ్ ఎవరి కోసం వెతుకుతున్నావ్ అంటే నీ కోసమే అని బాల అంటాడు. ఇక కావేరి వచ్చి బాల పక్కన కూర్చొంటాడు.
నాగవల్లికి ప్రమీల మెహందీ పెట్టించుకో అని అంటే మెహందీ పెట్టాల్సిన అమ్మాయి ఇంకా రాలేదని ప్రమీల అంటుంది. ప్రమీల మెహందీ అమ్మాయికి కాల్ చేసి ఇంకా రాలేదు ఎంత సేపు వెయిట్ చేయాలి అంటే ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని చెప్తుంది. నాగవల్లి డిసప్పాయింట్ అయిపోతుంది. కావేరి కావాలనే అయ్యో పాపం శుభమా అని వస్తుంటే యాక్సిడెంట్ అయిందా అని అంటుంది. దానికి బాల అయితే ఇది అశుభమే కదా ఇలా దుర్ముహూర్తంలో పెళ్లి చేస్తే దంపతులు కష్టాల పాలవుతారు ఆపేస్తే బెటర్ అంటాడు. దానికి నాగవల్లి పంతులు అన్నీ చూసే ఇది మంచి ముహూర్తం అన్నారు అని చెప్తుంది. దేవా కూడా అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాలి అని అంటాడు.
మెహందీ కార్యక్రమం ఎలా జరిపిస్తారు అని మహి అంటాడు. ఇప్పుడు మెహందీ ఎవరు పెడతారు అని అనుకుంటే మహి చిన్నికి వచ్చు చిన్ని పెడుతుందని అంటాడు. నాగవల్లి కోపంగా చూస్తుంది. నాగవల్లి సరే అనడంతో చిన్ని కోన్ పెడుతుంది. కావేరి బాల తనకు కోన్ పెడితున్నట్లు వాళ్లు ప్రేమగా గడపడం చిన్ని అంతా పక్కనుండి చూస్తున్నట్లు చిన్ని కల కంటుంది. ఇక బాలకి ఓ ఫోన్ వస్తుంది. బాల మాట్లాడటం చూసి దేవా చాలా ఏంటా అని కంగారుగా చూస్తాడు. చిన్ని నాగవల్లికి చక్కగా కోన్ పెడుతుంది. మహి నాగవల్లితో అంత బాగా కోన్ పెట్టింది కదా చిన్నికి ఏం గిఫ్ట్ ఇస్తావ్ అని మహి అడిగితే వంద రూపాయలు ఇస్తా అంటుంది.
ప్రమీల నాగవల్లితో అంత అందంగా మెహందీ పెడితే అలా అంటావ్ ఏంటే నీ స్థాయికి తగ్గట్టు ఇవ్వు అని చెప్పి మెడలో చైన్ ఇచ్చేయమని అంటుంది. మహి కూడా ఇచ్చేయమంటాడు. నాగవల్లి ఇస్తే ఇస్తే చిన్ని వద్దు అంటుంది. మహి ఇవ్వడంతో కావేరి, బాల తీసుకోమని అంటే చిన్ని తీసుకుంటుంది. ఇక చిన్ని నాగవల్లి ఫ్రండ్స్‌కి కూడా కోన్ పెడుతుంది. బాలరాజు కావేరిని చాటుగా తీసుకెళ్లి మాణిక్యం దొరికాడని కానీ నేను దేవా మనిషినే అని నాకు సాక్ష్యం ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు అని అంటాడు. నేనే హైదరాబాద్ వెళ్లి మాణిక్యాన్ని ఒప్పించి సాక్ష్యం తీసుకొని వస్తా అని మాట్లాకుంటారు. ఇంతలో దేవా వచ్చి ఇద్దరి ఎదురుగా నిల్చొంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, కీర్తిలకు పెళ్లి చేస్తానని మాటిచ్చేసిన సీఎం.. భర్తపై విరూపాక్షి ఫైర్!





















