Chinni Serial Today july 12th: చిన్ని సీరియల్: మహి దండ మధు మెడలో.. కళ్లు తెరిచిన బాల.. వల్లి, మధు శత్రువులైపోతారా?
Chinni Today Episode మహి మెడలో దండ మధు మెడలో పడటం నాగవల్లి, మధు తల్లి గొడవలో మధు నాగవల్లిని ఎదురించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode వసంత, శ్రేయలు మహిని తీసుకొని కోనేటి దగ్గర స్నానం కోసం తీసుకెళ్తారు. మధుమితని కూడా తల్లి, చంటి తీసుకొని వెళ్తారు. ఇద్దరూ ఒకే చోట స్నానాలు చేస్తారు. మహి మనసులో చిన్నిని కలవాలని కోరుకుంటాడు. ఇక మధు కూడా ఒక్కసారి అయినా చందు, లోహిత, మహిలను కలవాలి అని కోరుకుంటుంది. ఇద్దరూ స్నానాలు చేస్తారు. మహి మెడలో దండ మధు మెడలోకి చేరుతుంది.
శ్రేయ మహితో బావ మెడలో దండ ఏది అని అడుగుతుంది. వసంత వాళ్లతో గంగమ్మ తీసుకొని ఉంటుందని అంటుంది. ఇక మధు మెడలో దండ చూసి తల్లి, తమ్ముడు సంతోషపడతారు. మధు కూడా హ్యాపీగా ఫీలవుతుంది. తర్వా త మహితో వసంత, శ్రేయ ప్రదక్షిణలు చేయిస్తారు. మధుతో కూడా తన వాళ్లు ప్రదక్షిణ చేయిస్తారు. మహి అడుగుల మీద మధు అడుగులు వేస్తుంది. సీన్ చూస్తే దేవుడు ఇద్దరినీ ముడి వేసినట్లు ఇద్దరినీ దివించినట్లు ఉంటుంది. చిన్నిని చిన్నప్పుడు మహి చేయి పట్టుకొని తీసుకెళ్లడం పక్కనే కూర్చొపెట్టుకోవడం ఇద్దరూ బొమ్మల పెళ్లి చేసుకోవడం అన్నీ చూపిస్తారు.
మహి గుడిలో తిరుగుతూ గుండె మీద చేయి వేసి ఏదో తెలియని ఫీలింగ్‌కి లోనవుతాడు. ఏమైందని శ్రేయ అడిగితే ఏం లేదని అనేస్తాడు. తర్వాత మొత్తం వెతుకుతాడు. ఇక మధుని తల్లి ప్రదక్షిణలు పూర్తి చేసి రమ్మని చెప్తుంది. మధు అమ్మవారి దగ్గరకు వెళ్లి ఏడుస్తూ అమ్మ చిన్నప్పుడే దూరం అయిపోతుంది. నాన్న ఎక్కడున్నాడో తెలీదు.. ఎలా ఉన్నాడో తెలీదు.. నాన్న ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా ఆశీర్వదించు తల్లి.. నా కళ్ల ముందుకు తీసుకురా తల్లి అని చిన్ని కోరుకుంటుంది. చిన్ని కోరుకున్న తర్వాత దేవా మనుషులు బాంబ్ పెట్టి చనిపోయాడు అనుకున్న బాలరాజు కళ్లు తెరుస్తాడు.
బాలరాజు కళ్లు తెరిచి మొత్తం చూస్తాడు. బాలరాజుకి మొత్తం గాయాలు అయి ఉంటాయి. బాల లేచి నడుచుకుంటూ వెళ్లి ఓ చోట నీరు కనిపించి తాగడానికి వెళ్తే ఓ మహిళ అలా మురికిగా ఉన్నావని బాలరాజుని తిడుతుంది. బాలరాజు నీరు తాగకుండా ఒంట్లో ఓపిక లేకుండా ఇబ్బంది పడుతూ నడిచి వెళ్లి ఓ చోట కూర్చొంటాడు. చిన్ని ఎక్కడున్నా త్వరగా కలవాలి అని కోరుకుంటాడు. దేవేంద్ర వర్మ నాగవల్లికి కాల్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాను అక్కడ అంతా సక్రమంగా జరిగిందా అని అడుగుతాడు. నాగవల్లి మహితో సంతోషంగా మాట్లాడుతుంది. బావ నువ్వు హోం మినిస్టర్ అయినా నేను నీకు హోం మినిస్టర్ అని అంటుంది. ఇక దేవా సారీ చెప్తే అవసరం లేదు అర్థం చేసుకున్నా అని నాగవల్లి అంటుంది. మహికి కూడా అర్థమయ్యేలా చెప్పమని దేవా అంటాడు.
నాగవల్లి దేవాతో మాట్లాడి వస్తుంటే మధుమిత తల్లి పసుపు కుంకుమ తీసుకొని వస్తూ అరటి తొక్క మీద కాలు వేసి జారి నాగవల్లి చీర మీద పడేస్తుంది. దాంతో నాగవల్లి ఆమెను కొట్టి నా చీర పాడు చేస్తావా ఈ చీర ఖరీదు అంత కూడా మీ బతుకులు ఉండవు అంటుంది. చంటీ తన తల్లిని అలా అనొద్దని తప్పయిపోయిందని చెప్పని అంటాడు. నేను సారీ చెప్పాలా అని నాగవల్లి చంటిని కొట్టడానికి చేయి ఎత్తితే మధు చూసి వచ్చి నాగవల్లి చేయి పట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!





















