Chinni Serial Today August 4th: చిన్ని సీరియల్: మహి చేసిన పనికి వల్లి సీరియస్! మధుకి రక్తం ఇచ్చిన మ్యాడీ.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Chinni Serial Today Episode August 4th మహి మధుకి రక్తం ఇచ్చాడని తెలుసుకున్న నాగవల్లి తన శత్రువుకి కొడుకు రక్తం ఇవ్వడం ఏంటి అని రగిలిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధుమిత తలకు గాయం కావడంతో మహి మధుని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు. రక్తం కూడా ఇస్తాడు. మధుమిత తల్లిదండ్రులు చాలా ఏడుస్తుంటారు. మరోవైపు నాగవల్లి హాస్పిటల్‌కి మహికి ఏమైందా అని కంగారుగా వస్తుంది. డాక్టర్‌ని కలిసి మహి కోసం అడుగుతుంది. ఇంతలో రాహుల్ నాగవల్లిని చూసి వెళ్తాడు.
మహికి ఏమైంది అని నాగవల్లి కంగారు పడుతుంటే మ్యాడీకి ఏం కాలేదు అంటీ మీరు కంగారు పడొద్దు. అని జరిగిన విషయం మొత్తం చెప్పి మ్యాడీ ఆ అమ్మాయికి రక్తం ఇస్తున్నాడని చెప్తాడు. నాగవల్లి తీసుకెళ్లమని చెప్పి వాడు కాపాడిన అమ్మాయి ఎవరు అని మధుమితని చూసి గతంలో జరిగిన గొడవ గుర్తు చేసుకొని షాక్ అయిపోతుంది. నాతో గొడవ పడిన నా శత్రువుకి మ్యాడీ కాపాటమే కాకుండా బ్లడ్ కూడా ఇస్తున్నాడా ఛా అని వల్లి అనుకుంటుంది. వల్లి రాహుల్‌లో నేను డాక్టర్ గదిలో ఉంటా మ్యాడీని అక్కడికి రమ్మని చెప్పు అని అంటుంది.
బాలరాజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ కళ్లు తిరిగిపడిపోబోతే ఓకాయ పట్టుకొని దగ్గర్లో హాస్పిటల్‌కి వెళ్లమని ఆటోని పిలిచి ఎక్కి పంపిస్తాడు. మరోవైపు మహి మధు పక్కన కూర్చొని మధుని చూస్తూ బాధ పడతాడు. నర్సు వచ్చి మహికి జ్యూస్ తాగమని చెప్పి బ్లడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉండకూడదు సార్ వెళ్లిపోండి అని చెప్తుంది. మహి వెళ్తూ మధుని చూసి బాధ పడతాడు. నాగవల్లి మనసులో నా శత్రువుకి నా కొడుకు బ్లడ్ ఇవ్వడంఏంటి అని అనుకుంటాడు.
మరోవైపు మహి వాళ్లతో మధుకి పెద్ద గండం తప్పింది ప్రాణాలతో బయట పడిందని చెప్తుంది. మధుని రూమ్‌కి మార్చడంతో సుబ్బు, స్వరూప, చంటి, పద్దులు కలిసి మాట్లాడుతారు. నలుగురు బాధ పడతారు. మధు మ్యాడీ గురించి అడుగుతుంది. ఇంతలో మ్యాడీ మందులు తీసుకొని వస్తాడు. మధు మ్యాడీని చూసి నవ్వుతుంది. థ్యాంక్యూ మ్యాడీ సమయానికి నువ్వు నన్ను కాపాడకపోయి ఉంటే నా డెడ్ బాడీ మా ఇంట్లో ఉండేది అని అంటుంది. చంటి మధుతో మీ ఫ్రెండ్ హనుమంతుడిలాంటి వాడు అక్క సంజీవని తీసుకొచ్చినట్లు నీకు రక్తం ఇచ్చి కాపాడాడని అంటాడు. మళ్లీ మధు థ్యాంక్స్ చెప్పి చేతులు జోడించి దండం పెడతుంది. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని అంటుంది. సుబ్బు కూడా దండం పెడతాడు.
మరోవైపు నాగవల్లి మహి మధుకి రక్తం ఇవ్వడం గుర్తు చేసుకొని రగిలిపోతూ ఉంటుంది. ఇంకా మహి రావడం లేదేంటి ఇంత సేపు బ్లడ్ ఇవ్వడం ఏంటి ఎన్ని లీటర్లు ఇస్తున్నాడో ఏంటో అని బయటకు వెళ్తుంది. ఇక మహి కూడా అందరికీ చెప్పేసి బయటకు వెళ్తాడు. మహి మధు వాళ్లతో మాట్లాడటం చూసి నా శత్రువుకి నా బిడ్డ బ్లెడ్ ఇచ్చాడంటే నా బ్లడ్ బాయిల్ అయిపోతుందని అనుకుంటుంది.
మహి బయటకు రాగానే మహి తలకు గాయం చూసి నాగవల్లి తల్లడిల్లిపోతుంది. కంగారుగా డాక్టర్‌ని పిలిచి ట్రీట్మెంట్ చేయమని అంటుంది. డాక్టర్ మ్యాడీని తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తుంది. మహి తల్లితో మమ్మీ నీకు రోజు రోజుకి నా మీద ప్రేమ పెరిగిపోతుంది అని అంటాడు. డాక్టర్‌తో మహి మధు మీద స్పెషల్ కేర్ తీసుకోమని అంటాడు. ఇక వల్లి మహిని తీసుకెళ్తుంటే బాలరాజు అప్పుడే వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















