అన్వేషించండి

Mohammed siraj: ఇంగ్లాండ్ సిరీస్‌లో 1000 కంటే ఎక్కువ బాల్స్ వేసిన సిరాజ్.. లీడింగ్ వికెట్ టేకర్‌గా రికార్డ్

Ind vs Eng 5th Test | టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్లో చరిత్ర సృష్టించాడు. ఓవల్ టెస్ట్ లో 1000 బాల్స్ వేయడంతో పాటు సిరీస్ లో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు.  5వ టెస్ట్ నాల్గవ రోజున, మహ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన 2వ భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో 1000 కంటే ఎక్కువ బంతులు వేయడం ద్వారా అతను ప్రత్యేక జాబితాలో చేరాడు. మరో పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4 సంవత్సరాల కిందట ఒక టెస్ట్ సిరీస్‌లో 1000 కంటే ఎక్కువ బాల్స్ బౌలింగ్ చేసిన చివరి భారతీయ బౌలర్.

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ నాల్గవ రోజు ప్రారంభమైనప్పుడు, భారత్ మంచి స్థితిలో ఉంది. కానీ హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) సెంచరీలతో భారత జట్టుకు బిగ్ షాకిచ్చారు. వారి ఆటతో భారత్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా భారత బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీయడంతో మ్యాచ్ లో ఉత్కంఠ నెలకొంది. కాని మూడవ సెషన్‌లో వర్షం కారణంగా ఆట నిలిపివేశారు.  మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ దాటికి ఇంగ్లాండ్ చివరి 7 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేసింది. ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో రూట్, జాకబ్ బెథెల్ ఔటయ్యారు. 

తాజాగా జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచిన సిరాజ్ పై జో రూట్ ప్రశంసల జల్లులు కురిపించాడు. సిరాజ్ జట్టు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడని రూట్ వ్యాఖ్యానించాడు. 

1000 కంటే ఎక్కువ బంతులు వేసిన సిరాజ్

ఇప్పటివరకు మహ్మద్ సిరాజ్ టెస్ట్ సిరీస్ 5 మ్యాచ్‌లలో 1088 బంతులు వేశాడు. అతను 36.85 సగటుతో బౌలింగ్ చేస్తూ 737 పరుగులు ఇచ్చాడు.  సిరీస్ లో సిరాజ్ 20 వికెట్లు తీశాడు. నేడు 5వ టెస్ట్ చివరి రోజు ఆట మిగిలి ఉంది. సిరాజ్ ఒక టెస్ట్‌లో 1000 బంతులు వేసిన తొలి భారత బౌలర్ కాదు, అతని ముందు 27 సార్లు ఈ ఫీట్ నమోదైంది. చివరగా జస్ప్రీత్ బుమ్రా 2021లో ఇంగ్లాండ్‌తోనే ఈ ఫీట్ నమోదు చేశాడు. 

 చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్

మహ్మద్ సిరాజ్ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 20 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా తరువాత 2వ భారత బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్‌లో అత్యధిక వికెట్లు రికార్డ్ బుమ్రా పేరిట ఉంది. బుమ్రా 2021లో జరిగిన టెస్ట్ సిరీస్ లో 23 వికెట్లు తీశాడు.

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ 5వ టెస్ట్ నేడు చివరి రోజు

వర్షం అంతరాయం కలిగించకపోతే, భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ ఫలితం మొదటి సెషన్‌లో వస్తుంది. ఇంగ్లాండ్ గెలవడానికి కేవలం 35 పరుగులు మాత్రమే కావాలి, భారత్ నెగ్గాలంటే మరో 4 వికెట్లు పడగొట్టాలి. కాని ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి స్మిత్ ఒక్కడే బ్యాటర్ ఉన్నాడు. క్రిస్ వోక్స్ గాయపడి కట్టుతో ఉన్నాడు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ నాల్గవ రోజు చివరి సెషన్‌లో బాగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ మీద ఒత్తిడి పెంచారు. దాంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Jaiswal- Fernando Fight: ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన‌ జైస్వాల్.. త‌ర్వాత జైస్వాల్ ను ఔట్ చేసిన‌ ఫెర్నాండో.. ఇద్ద‌రి మధ్య మాట‌ల యుద్ధం.. ఒక‌రినొక‌రు నెట్టుకున్న వైనం..
ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన‌ జైస్వాల్.. త‌ర్వాత జైస్వాల్ ను ఔట్ చేసిన‌ ఫెర్నాండో.. ఇద్ద‌రి మధ్య మాట‌ల యుద్ధం.. ఒక‌రినొక‌రు నెట్టుకున్న వైనం..
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
IND VS SL 2nd Test Predicted XI: రేపటి నుంచి లంకతో రెండో టెస్ట్! సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తుదిజట్టులో మార్పు..!!
రేపటి నుంచి లంకతో రెండో టెస్ట్! సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తుదిజట్టులో మార్పు..!!
Shubman Gill Ignores Kuldeep Yadav: కుల్దీప్ పై నమ్మకం లేని గిల్..!! అతనో అద్భుతమైన ఆటగాడు, కివీస్ టూర్ లో చాలా యూజ్ అవుతాడని మాజీ క్రికెటర్ వ్యాఖ్య 
కుల్దీప్ పై నమ్మకం లేని గిల్..!! అతనో అద్భుతమైన ఆటగాడు, కివీస్ టూర్ లో చాలా యూజ్ అవుతాడని మాజీ క్రికెటర్ వ్యాఖ్య 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Embed widget