Ind vs Eng in 5th Test Day 4 Updates : ఉత్కంఠభరితంగా ఐదో టెస్టు.. విజయం కోసం ఇరుజట్ల పోరాటం.. నిప్పులు చెరుగుతున్న భారత బౌలర్లు.. ఇంగ్లాండ్ విజయానికి 35 రన్స్ అవసరం.. బ్రూక్, రూట్ సెంచరీలు
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఐదో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఒక దశలో సులువుగా గెలుస్తుందనుకున్న ఇంగ్లాండ్.. భారత బౌలర్ల ధాటికి వెనుకంజ వేసింది. రేపు ఫలితం తేలనుంది.

Brook, Root Super Centuries: ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించేందుకు ఒక అడుగు దూరంలో ఉండగా, భారత్ విజయానికి మరో 4 వికెట్లు కావాలి. . రికార్డు ఛేజింగ్ స్కోరుతో ఐదో టెస్టులో ఘన విజయం సాధించేందుకు ఇంగ్లాండ్ తీవ్రంగా ప్రయత్నించగా, చివర్లో ఇంగ్లీష్ జోరుకు బ్రేక్ వేశాడు. ఆదివారం ఆట నాలుగో రోజు 374 పరుగుల టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లాండ్.. వర్షం కారణంగా ఆట ముగిసే సరికి 76.2 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. /జట్టు విజయానికి ఇంగ్లాండ్ కు 35 పరుగులు కావాల్సి ఉండగా, ఇండియాకు 4 వికెట్లు కావాలి. వెటరన్ బ్యాటర్ జో రూట్ (152 బతుల్లో 105, 12 ఫోర్లు), హేరీ బ్రూక్ (98 బంతుల్లో 111, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో సత్తా చాటారు. కీలక సమయంలో సంయమనంతో వీరిద్దరూ ఆడి, జట్టును విజయతీరాలకు చేర్చేందుకు ప్రయత్నించారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ కు 3 వికెట్లు దక్కాయి. ఆటకు సోమవారం ఆఖరు రోజు. రేపు ఫలితం తేలనుంది. దీంతో ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని ఇంగ్లాండ్ దక్కించుకుంటుందో, లేదా డ్రాగా ముగస్తుందో తెలుస్తంఓది. ఈ సిరీస్ లో తొలి, మూడు టెస్టులను ఇంగ్లాండ్ గెలవగా, రెండో టెస్టులో మాత్రం ఇండియా విజయం సాధించింది. నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది.
All eyes on the final day of the final Test 🏟️
— BCCI (@BCCI) August 3, 2025
England 339/6, need 35 more runs to win#TeamIndia 4⃣ wickets away from victory
Scorecard ▶️ https://t.co/Tc2xpWNayE#ENGvIND pic.twitter.com/ib6QgGqBnt
ఆరంభంలోనే వికెట్ల వేట..
ఓవర్ నైట్ స్కోరు 50/1 తో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లాండ్ విజయబావుటా ఎగురవేసింది. ఆట ఆరంభంలోనే దూకుడుగా ఆడిన బెన్ డకెట్ (54) అర్ధ సెంచరీని పూర్తి చేసుకోగా, అతడిని ప్రసిధ్ కృష్ణ ఔట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ ఒల్లీ పోప్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని, సిరాజ్ మరోసారి ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ కాస్త ఒత్తిడిలో పడింది. అయితే ఈ దశలో రూట్.. హేరీ బ్రూక్తో కలిసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ను ఆడాడు. వీరిద్దరూ పర్యాటక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జంట కీలక పరుగులను నమోదు చేసింది. ఆట మధ్యలో ప్రసిధ్ బౌలింగ్ లో19 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ ను బౌండరీ వద్ద క్యాచ్ సిరాజ్ సిక్సర్ గా మలచడంతో బ్రూక్ కు లైఫ్ లభించింది.
బ్రూక్ వీర బాదుడు..
తనకు లైఫ్ లభించాక బ్రూక్ రెచ్చి పోయాడు. భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. చాన్సెస్ తీసుకుని, బౌండరీలు సాధించాడు. దీంతో భారత బౌలర్లు ఒత్తిడిలో పడిపోయారు. ఈ క్రమంలో వీరిద్దరూ సంయమనంతో ఆడి. నాలుగో వికెట్ కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో ముందుగా బ్రూక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఎట్టకేలక సిరాజే ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. టీ విరామానికి ముందు ఆకాశ్ దీప్ బౌలింగ్ లో బ్రూక్ ని క్యాచ్ తో బలిగొన్నాడు. అయితే టీ విరామం తర్వాత కథ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారిగా జాకబ్ బెతెల్ (5), రూట్ ను ఔట్ చేసి, ఇంగ్లాండ్ కు షాకిచ్చాడు. ఆ తర్వాత మ్యాచ్ లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలగడంతో నిర్ణీత సమయానికి ముందే కాల్ ఆఫ్ చేశారు. మిగతా బౌలర్లలో సిరాజ్ కు రెండు వికెట్లు దక్కాయి.




















