Ind vs Eng Joe Root Record : డబ్ల్యూటీసీలో రూట్ మరో రికార్డు.. ఐదో టెస్టులో నమోదు.. కీలక మైలురాయిని చేరిన వెటరన్ ప్లేయర్
టెస్టుల్లో రికార్డులు కొల్లగొట్టడమే తన ధ్యేయంగా ముందుగా సాగుతున్న రూట్.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. డబ్ల్యూటీసీ మ్యాచ్ ల్లో ఎవరికీ అందని రీతిలో మరో రికార్డును నెలకొల్పాడు.

Englands Joe Root Super Century: ఇంగ్లాండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లండన్ లోని ద ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదో టెస్టులో అద్భుతమైన సెంచరీ (152 బంతుల్లో 105, 12 ఫోర్లు) ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఫార్మాట్ లో 39వ సెంచరీని జో రూట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (51), జాక్ కలిస్ (45), రికీ పాంటింగ్ (41) ల తర్వాత స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో ఆరు వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. దీంతో 6 ఏళ్ల డబ్ల్యూటీసీ చరిత్రలో రూట్ అరుదైన ఘనతను సాధించినట్లు అయ్యింది.
Joe Root walks into his 39th Test in style 🙌✨
— Sports Today (@SportsTodayofc) August 3, 2025
A phenomenal player, delivering some of the best cricket of his career right now!#JoeRoot #INDvsENG #ENGvIND pic.twitter.com/rBLHLRtNAR
శిఖర స్థానంలో..
2019లో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ప్రారంభమైనప్పటి నుంచి రూట్ తన మార్కును చూపిస్తున్నాడు. వేరే ఏ బ్యాటర్ కు అందనంత దూరంగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ డబ్ల్యూటీసీలో 69వ మ్యాచ్ ఆడుతున్న రూట్.. 6 వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. ఇందులో 20 సెంచరీలు, 23 ఫిఫ్టీలు ఉన్నాయి. అతని తర్వాత స్థానంలో స్టీవ్ స్మింగ్ (4,278), మార్నస్ లబుషేన్ (4,225), బెన్ స్టోక్స్ (3,616), ట్రావిస్ హెడ్ (3,300) ఉన్నారు. అలాగే ఈ సిరీస్ లోనే రూట్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు) తర్వాత స్థానంలోకి రూట్ చేరుకున్నాడు. చాలా వేగంగా పరుగులు సాధిస్తూ, సచిన్ స్కోరును అందుకోవాలని తను తహ తహ లాడుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
WTC King Joe Root! 👑
— CricketGully (@thecricketgully) August 3, 2025
The first ever to smash 6000 runs in World Test Championship history — a true maestro of the red ball! 🔥
What. A. Player. 💯👏 pic.twitter.com/OhPyMtnk1X
బ్రాడ్ మన్ రికార్డుకు ఎసరు..!
ఇక ఈ మ్యాచ్ లో ఫిఫ్టీ ప్లస్ స్కోరు చేసిన జో రూట్.. మరో రికార్డుపై కన్నేశాడు. సొంతగడ్డపై ఒక ప్రత్యర్థిపై అత్యధిక 50+ స్కోర్లు చేసిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానానికి రూట్ ఎగబాకాడు. భారత్ పై సొంతగడ్డపై తనకిదో 16వ 50+ స్కోరు కావడం విశేషం. దీంతో ఈ జాబితాలో సౌతాఫ్రికాకు చెందిన వైల్ టైలర్.. ఇంగ్లాండ్ పై సరిగ్గా 16 సార్లు.. 50+ స్కోర్లు చేశాడు. అందరికంటే మిన్నగా డాన్ బ్రాడ్ మన్.. ఇంగ్లాండ్ పై 17 సార్లు.. 50+ స్కోర్లు చేసి, రికార్డులకెక్కాడు. ఏదేమైనా పలు రికార్డులను తన పేరిట లిఖించుకోవడమే టార్గెట్ గా ముందుకు సాగుతున్నాడు.




















