అన్వేషించండి

Ind vs Eng 5th Test: ఓవల్ స్టేడియంలో హయ్యస్ట్ ఛేజ్ ఎంత? రికార్డులు తెలిస్తే భారత ఫ్యాన్స్ ఫుల్ జోష్

చివరిదైన ఓవల్ టెస్ట్ లో భారత్ 374 రన్స్ టార్గెట్ ఇచ్చింది. ఇంగ్లాండ్ అంత పెద్ద టార్గెట్ ఛేజ్ చేస్తుందా? అని క్రిెకెట్ ప్రేమికులు వివరాలు చెక్ చేస్తున్నారు.

ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియాకు నేడు చాలా కీలకం. అ టెస్టులో కనుక భారత్ నెగ్గితే 2-2తో ఐదు టెస్టుల సిరీస్ సమం అవుతుంది. భారత్ కనుక ఓటమిపాలైతే 3-1తో సిరీస్ చేజారుతుంది. ఓవల్ టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులు చేసి ఆలౌట్ అయినప్పుడు, చివరి టెస్ట్ చేజారిందని అంతా అనుకున్నారు. భారత బౌలర్లు ఇంగ్లండ్‌ను కేవలం 23 పరుగులు మాత్రమే ఆధిక్యంలో ఆలౌట్ చేయడంతో భారత్ రేసులోకి వచ్చింది.

రెండో ఇన్నింగ్స్ లో భారత్ సమష్టిగా రాణించింది. ఈ టెస్టులో ఇంగ్లీష్ జట్టుకు 374 పరుగుల లక్ష్యం నిర్ధేశించగా, బెన్ డకెట్, జాక్ క్రాలీ 50 పరుగుల భాగస్వామ్యంతో  ఆతిథ్య జట్టుకు మంచి ప్రారంభం అందించారు. అయితే, ఇంగ్లండ్ ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించగలదా? వాస్తవానికి, ఓవల్ మైదానంలో 300 పరుగుల లక్ష్యాన్ని ఏ జట్టైనా ఛేదించిందా అని గణాంకాలు చెక్ చేసిన భారత అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ స్టేడియంలో ఒక్కసారి కూడా 300 టార్గెట్ ఏ జట్టు కూడా ఛేదించలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇంగ్లండ్ ఛేజ్ చేస్తే కనుక, అది చారిత్రాత్మక విజయం అవుతుంది.

ఓవల్ మైదానంలో అత్యధిక పరుగుల రికార్డు

టెస్ట్ క్రికెట్‌లో ఓవల్ మైదానంలో ఛేజింగ్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు 263 పరుగులు.  1902లో ఆస్ట్రేలియాపై ఆతిథ్య ఇంగ్లాండ్ ఈ స్కోరు సాధించింది. ఆ మ్యాచ్ 123 సంవత్సరాల కిందట జరిగింది. ఆ తరువాత 1963లో వెస్టిండీస్ ఇంగ్లండ్‌పై 252 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఓవల్ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 జాబితాలో నాలుగు స్కోర్‌లు 20వ శతాబ్దంలో నమోదయ్యాయి. 21వ శతాబ్దంలో, ఓవల్ మైదానంలో అత్యధిక పరుగులు 2024లో నమోదయ్యాయి. శ్రీలంక 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌ను ఓడించింది.

  • 263 పరుగులు - ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా - 1902
  • 252 పరుగులు - వెస్టిండీస్ vs ఇంగ్లండ్ - 1963
  • 242 పరుగులు - ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్ - 1972
  • 225 పరుగులు - వెస్టిండీస్ vs ఇంగ్లండ్ - 1988
  • 219 పరుగులు - శ్రీలంక vs ఇంగ్లండ్ - 2024

 టెస్ట్ క్రికెట్‌లో ఓవల్ మైదానంలో 263 కంటే ఎక్కువ పరుగులు ఎప్పుడూ ఛేదించలేదని గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో, భారత జట్టు ఇంగ్లాండ్ ముందు అంతకంటే 111 పరుగులు ఎక్కువ (374 రన్స్) లక్ష్యాన్ని ఉంచింది. గత రికార్డులను పరిశీలిస్తే ఈ టెస్టులో ఇంగ్లాండ్ నెగ్గాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. నేడు 4వ రోజు కావడంతో పర్యాటక జట్టు భారత్ టెన్షన్ పడుతోంది. అందులోనూ ఇంగ్లాండ్  బ్యాజ్‌బాల్ శైలి సమస్యగా మారే అవకాశం లేకపోలేదు.

24 ఏళ్ల కిందట చివరి విజయం..

ఓవల్ మైదానంలో ఇది భారత్ ఆడుతున్న 16వ టెస్ట్ మ్యాచ్ ఇది. ఒకవేళ వారు ఇంగ్లండ్‌ను ఓడిస్తే, ఇది టీమ్ ఇండియాకు ఈ వేదికలో 3వ టెస్ట్ మ్యాచ్ విజయం అవుతుంది. ఇంతకుముందు భారత్ 1971, 2021లో విజయాలు సాధించింది. భారత్ ఇక్కడ నెగ్గి 24 ఏళ్లు కావొస్తుంది. అయితే ఓవల్ స్టేడియంలో హయ్యస్ట్ ఛేజింగ్ కంటే వంద పరుగుల కంటే ఎక్కువ టార్గెట్ ఇవ్వడంతో భారత్ శిబిరంలో ఆశలు చిగురించాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
IND vs AUS Test Series Schedule: 5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
BCCI Injury Crisis: సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget