Chinni Serial Today August 19th: చిన్ని సీరియల్: మహి ఇంట్లో మధుకి అవమానం తప్పదా.. శ్రేయ, లోహిత కుట్ర! చిన్ని కోసం గుడ్‌న్యూస్ తెలుసుకున్న బాల!
Chinni Serial Today Episode August 19th మధు మహి వాళ్ల ఇంటికి రావడం, బాలరాజుకి చిన్ని తను ఉన్న ఊరిలో ఉందని తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode నాగవల్లి ఇంట్లో జరగనున్న వరలక్ష్మీ వ్రతానికి లోహితని శ్రేయ పిలుస్తుంది. శ్రేయ, లోహిత ఫొటోలు తీసుకుంటూ ఉంటారు. ఇంతలో మహి మధుని తీసుకొని వస్తాడు. లోహిత, శ్రేయ చూసి మధు ఏంటి వచ్చింది అని చిరాకు పడతారు. మహి, మధు ఇద్దరూ కుడికాలు లోపల పెట్టి వస్తారు.
మధు మహి వాళ్ల ఇళ్లు చూసి షాక్ అయిపోతుంది. నాగవల్లి కూడా మధుని చూసి గుడిలో తనకు జరిగిన అవమానం గుర్తు చేసుకొని కోపంగా చూస్తుంది. చిన్ని కూడా నాగవల్లిని చూసి షాక్ అయిపోతుంది. నువ్వు నువ్వు ఎందుకు వచ్చావ్ అని నాగవల్లి అడుగుతుంది. తను నీకు ముందే తెలుసా అని మహి అడిగితే గుడిలో కలిశాం అని మధు అంటుంది. ఇక మహి తన ఫ్యామిలీ మొత్తాన్ని మధుకి పరిచయం చేస్తాడు. మధు కంగారు పడటం చూసిన మహి ఫ్రీగా ఉండు ఇది నీ ఇళ్లు అనుకో అంటాడు. ఇక మహికి కాల్ వచ్చి వెళ్తాడు. మహి నాగవల్లి వెళ్లిపోతుంటే వెనకాలే వెళ్లి ఆ రోజు గొడవ పడ్డాను క్షమించమని అంటుంది. నువ్వు మా మ్యాడీ క్లాస్ మేట్ అయినా సరే నేను నిన్ను జీవితంలో క్షమించను.. ఆ రోజు గుడిలో జరిగింది నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను.. పిలవని పేరంటానికి వచ్చావ్ తాంబూలం తీసుకొని వెళ్లిపో అని వల్లి అంటుంది.
చిన్ని కోసం వెతుకుతున్న రౌడీల బైక్ పాడవటంతో మెకానిక్‌కి కాల్ చేస్తారు. అతను బాలరాజుని అక్కడికి పంపిస్తాడు. బాలరాజు వెళ్లి రిపేర్ చేస్తాడు. డబ్బులు తీసుకొని బాలరాజు వెళ్లిపోతుంటే రౌడీలు బాలరాజుని పిలిచి చిన్ని ఫొటో చూపించి పదేళ్ల క్రితం తప్పిపోయింది ఈ పోలికలు ఉన్న అమ్మాయిని చూశావా అని అడుగుతారు. బాలరాజు షాక్ అయిపోతాడు. పదేళ్ల క్రితం తప్పిపోయిన అమ్మాయి ఇప్పుడు ఎలా దొరుకుతుంది అని బాలరాజు అడిగితే ఆ అమ్మాయి ఈ ఊరిలోనే ఉంది. ఎక్కడో ఓ చోట కాలేజ్‌లో చదువుతుంటుంది అని అంటారు. రౌడీలు వెళ్లిపోయిన తర్వాత బాలరాజు తనతో తాను నా చిన్ని బతికే ఉంది.. నా చిన్ని బతికే ఉందన్నమాట అంటే కావేరి కూడా బతికే ఉంటుంది అనుకుంటాడు.
మధు తన సంచిలో ఫోన్ పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెడతుంది. మరోవైపు నాగవల్లి తనకు కాబోయే కోడలు శ్రేయ కోసం ఓ నగ తెప్పించి వసంతకి చూపిస్తుంది. నా కొడుకుని జీవితాంతం సంతోషంగా చూసుకోబోయే నా కోడలికి నేనే ఇస్తానని అంటుంది. శ్రేయ లోహితతో మా అత్తయ్య నాకు సర్‌ఫ్రైజ్ ఇస్తుందంట అని చెప్తుంది. ఇక పంతులు దీపాలు రెడీ చేయమని చెప్తే మహి విని మధు నువ్వు చేయొచ్చు కదా అని అంటాడు. మధు వెళ్లి చేస్తుంది. శ్రేయ, లోహిత చూసి ఉడికిపోతారు. మధు దీపాలలో నూనె వేస్తుంటే ఓ బాబు వచ్చి ఫొటోలు తీస్తాడు. మహిని కూడా పక్కనే నిల్చొమని ఇద్దరికీ ఫొటోలు తీస్తాడు.
లోహిత మధు బ్యాగ్ చూసి మధుని ఏడిపించే ఐడియా అని శ్రేయకి నగ అందులో పెట్టించేద్దామని అంటుంది. శ్రేయ ఐడియా సూపర్ అని పని మనిషికి పిలిచి నెక్లెస్ మధు బ్యాగ్‌లో పెట్టమని అంటుంది. ఇక పంతులు అమ్మవారికి చీర కట్టి రెడీ చేయమని చెప్తే నాగవల్లి తన కోడలు చేస్తుందని చెప్పి శ్రేయని పిలుస్తుంది. శ్రేయ లోహిత ఇద్దరూ ఫోన్‌లో చూసి చేసినా రెడీ చేయలేకపోతారు. ఇక పంతులు మధు బాగా చేస్తుంది అని అంటే మహి వెళ్లి చేయమని చెప్తాడు. మధు వెళ్లి అమ్మవారిని రెడీ చేస్తుంది. ఇక పనిమనిషి నగని మధు బ్యాగ్‌లో పడేస్తుంది.
బాలరాజు తన ఓనర్ దగ్గరకు వెళ్లి నీ వల్లే నా భార్యపిల్లల ఆచూకి తెలిసింది అన్న అని చిన్ని వాళ్లు ఈ ఊరిలోనే ఉన్నారని తెలిసింది అంతా నీ పుణ్యమే అన్న అని అంటాడు. నీ కూతుర్ని వెతకాల్సిన అవసరం వాళ్లకి ఏంటి అని అనుకుంటారు. ఇక బాలరాజు ఒకసారి వెతికి వస్తానని అంటే ఓనర్ బాలరాజు బైక్ ఇస్తాడు. ఇక పంతులు గంగా జలం ఇళ్లంతా చల్లమని అంటే నాగవల్లి శ్రేయకి చెప్తుంది. లోహిత వెళ్లి మధుని పంపు మన ప్లాన్‌కి హెల్ప్ అవుతుంది అని అంటుంది. శ్రేయ మధుని పిలిచి గంగా జలం చల్లమని చెప్తుంది. మధు వెళ్తుంది. మహి చూసి మధు తన గదిలోకి వెళ్లిపోతుందేమో అని ఆపడానికి వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















