అన్వేషించండి

Chinni Serial Today August 16th: చిన్ని సీరియల్: చిన్ని, మధులకు 3 నెలల గడువు.. ఏం జరగనుంది? తండ్రీకూతుళ్లని ఇలా కలిపిన గాజులు!!

Chinni Serial Today Episode August 16th మహి, మధులు 3 నెలల్లో ఒకరిని ఒకరు కనిపెట్టుకోవాలని టార్గెట్ పెట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode బాలరాజు అమ్మవారి దగ్గరకు వెళ్లి గాజులు సమర్పించి తన భార్యాపిల్లల కోసమే బతుకుతున్నా నా కూతురు చిన్ని అంటే నాకు ప్రాణం.. నా ప్రాణాలు కాపాడిన దేవత నా కూతురు.. రాక్షసుడి లాంటి నన్ను నా కూతురు మార్చేసింది..  నా కూతురు, భార్య ఎక్కడున్నారో తెలీక అసలు ఉన్నారో లేదో తెలీక నరకం అనుభవిస్తున్నా.. ఈ నరకం నుంచి నన్ను కాపాడు..  కావేరి, చిన్నిల జాడ తెలిసేలా చేయమని కోరుకుంటాడు. 

బాలరాజుకి అమ్మవారి దగ్గర గాజులు ఒకామె ఇస్తే మా ఇంట్లో ఆడవాళ్లు లేరు నువ్వే వేరే ఎవరికైనా ఇచ్చేయమ్మా అని చెప్తాడు. మధు కూడా బాలరాజు పక్కనే ఉంటుంది. పక్కపక్కనే నడుస్తూ ఉంటారు కానీ ఎవరూ ఒకర్ని ఒకరు చూసుకోరు. చిన్ని కూడా అదే అమ్మవారి దగ్గరకు వచ్చి పదేళ్ల క్రితం అమ్మని పోగొట్టుకున్నాను.. నాన్న కూడా దూరం అయిపోయాడు అన్న భ్రమలో బతికాను.. నాన్న జైలు నుంచి రిలీజ్ అయ్యాడని తెలిసింది నాన్న ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకు తెలిసేలా ఆశీర్వదించు తల్లి అని కోరుకుంటుంది. ఇక అక్కడున్న అమ్మ బాలరాజు పెట్టిన గాజులు మధుకి ఇచ్చి అమ్మవారి గాజులు తల్లీ అంతా మంచే జరుగుతుంది తీసుకో అని చెప్తుంది. మధు మహా ప్రసాదంలా తీసుకుంటుంది. పక్కనే తండ్రి వెళ్లినా చూడదు. 

మరోవైపు దేవేంద్రవర్మ, నాగవల్లి గతంలో కావేరి, చిన్ని చనిపోయారు అని చెప్పిన రౌడీల దగ్గరకు వస్తారు. నిజంగా ఆ రోజు చిన్ని చనిపోయిందా అని అడుగుతాడు. వాళ్లు తడబడటంతో చితక్కొడతాడు. దాంతో రౌడీలు కావేరి ఒక్కర్తే చనిపోయిందని చిన్ని తప్పించుకుంది విషయం తెలిస్తే మీరు చంపేస్తారని అలా చెప్పానని అంటారు. చిన్ని ఎక్కడున్నా తెలుసుకొని చంపేయాలని దేవా వల్లితో చెప్తాడు. ఇక రాత్రి వర్షం పడుతుంది మధు ఇంకా రాలేదని సుబ్బారావు బయట ఎదురు చూస్తుంటాడు. ఇంతలో మధు, పద్దూ వస్తారు. మధు స్కూటీ ఆపి దిగకుండా తండ్రి గురించి ఆలోచించి వాకిట్లో పడిపోతుంది. సుబ్బు, పద్దూ, స్వరూప చాలా భయపడిపోతారు. మధుని ఇంట్లోకి తీసుకెళ్లి డాక్టర్‌కి పిలుస్తారు. డాక్టర్ చూసి ఏం కాలేదని చెప్పి సుబ్బుతో మందులు ఇస్తాను రా అని పిలుస్తాడు. 

డాక్టర్ సుబ్బుతో మధు మనసులో ఏదో బెంగ పెట్టుకొని ఎక్కువ దాని గురించి ఆలోచిస్తూ ఇలా అయిపోతుంది తన బాధ తెలిస్తే మనం అలా మందులు ఇవ్వొచ్చు లేదంటే తన ప్రాణాలకే ప్రమాదం ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతాడు. దాంతో సుబ్బు మధు గతం మొత్తం చెప్తారు. తను మళ్లీ రాజమండ్రి వెళ్లడం వల్ల గతం జ్ఞాపకాలు వచ్చాయి. తన తండ్రిని కలిస్తే తప్ప తన బాధ పోదని అనుకుంటుంది. 24 గంటలు అదే ఆలోచిస్తుందని చెప్తారు డాక్టర్. భవిష్యత్‌లో ప్రాబ్లమ్ అవుతుందని చెప్తారు. 

మధు పద్దూతో పదేళ్ల నుంచి బాధ మనసులో ఉందని నాకు తెలీదు. నా వాళ్లు అందర్ని మర్చిపోయాను. వాళ్ల ముఖాలు కూడా గుర్తు లేవు. ఎదురుపడినా గుర్తు పట్టలేని పరిస్థితి.. మళ్లీ రాజమండ్రి వెళ్లడంతో వాళ్లు గుర్తొచ్చారు. అందరూ ఎక్కడున్నారో ఎలా ఉన్నారో. నాన్న గురించి తెలిసింది.. మా నాన్నని కలిస్తే మిగతా వాళ్లు గురించి తెలుస్తుందేమో అని అంటుంది. దాంతో పద్దూ నువ్వు దూరం అయిన వాళ్లని త్వరలోనే కలుస్తావ్ అని ధైర్యం చెప్తుంది. మరోవైపు మహి కూడా శ్రేయతో తనకు పెళ్లి చేయాలి అనుకోవడం 3 నెలల గడువు గురించి ఆలోచిస్తాడు. ఎలా అయినా 3 నెలల్లో చిన్నిని పట్టుకోవాలి లేదంటే నా జీవితం నాశనం అయిపోతుంది అనుకుంటాడు. మరోవైపు చిన్ని కూడా 3 నెలల్లో మహి, చందు వాళ్లని కనుక్కోవాలని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today October 22nd: 'గోదావరి' సీరియల్: సూర్య, జానుల లవ్‌ వీడియో వేసి పరువు తీసేసిన సింహాద్రి! జానుకి అండగా సంజయ్!
'గోదావరి' సీరియల్: సూర్య, జానుల లవ్‌ వీడియో వేసి పరువు తీసేసిన సింహాద్రి! జానుకి అండగా సంజయ్!
Nindu Manasulu Serial Today October 22nd: నిండు మనసులు: ప్రేరణకు నిజం చెప్పిన గణ! పశ్చాత్తాపంతో కులిమిపోయిన ప్రేరణ! సిద్ధూ క్షమిస్తాడా!
నిండు మనసులు: ప్రేరణకు నిజం చెప్పిన గణ! పశ్చాత్తాపంతో కులిమిపోయిన ప్రేరణ! సిద్ధూ క్షమిస్తాడా!
Illu Illalu Pillalu Serial Today October 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమని రెచ్చగొట్టిని భద్రావతి! 30 లక్షలకు వేలం పాట పాడిన పొట్టి మిరపకాయ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమని రెచ్చగొట్టిని భద్రావతి! 30 లక్షలకు వేలం పాట పాడిన పొట్టి మిరపకాయ్!
Gundeninda Gudigantalu Oct 22: స్టేషన్‌కు వెళ్లి నిజం నిరూపించుకున్న బాలు,మీనా..అరుణ్‌ తప్పుచేశాడని నమ్మిన అధికారులు
గుండెనిండా గుడిగంటలు: స్టేషన్‌కు వెళ్లి నిజం నిరూపించుకున్న బాలు,మీనా..అరుణ్‌ తప్పుచేశాడని నమ్మిన అధికారులు

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Embed widget