అన్వేషించండి

Chinni Serial Today August 15th: చిన్ని సీరియల్: మహి, శ్రేయల పెళ్లిపై సస్పెన్స్.. 3 నెలల గడువు.. నాగవల్లి మాస్టర్ ప్లాన్.. ఏడ్చేసిన మహి!

Chinni Serial Today Episode August 15th మహి శ్రేయని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పడం నాగవల్లి మహిని కొట్టి గడువు ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహి ఇంటికి వచ్చి సందడి చూసి ఏంటి అని వరుణ్‌ని అడుగుతాడు. పార్టీ ఉందని అత్తయ్య చెప్పారు కదా అని లోపలికి తీసుకెళ్తాడు. నాగవల్లి మహితో త్వరగా వెళ్లి రెడీ అయిరా పార్టీ మొదలు పెడదాం అని అనుకుంటుంది. 

వరుణ్‌ మహిని తీసుకెళ్లి ఏంటి ఈ పార్టీ అని అడుగుతాడు. వరుణ్ తడబడి నాకు తెలీదు అనేస్తాడు. వసంత నాగవల్లి దగ్గరకు వెళ్లి మనం చేస్తుంది కరెక్టేనా అని అడుగుతుంది. కరెక్ట్ నీ కూతురు నా కోడలు అది ఫిక్స్ అని అంటుంది. మహి రెడీ అవుతుంటే నాగవల్లి వెళ్తుంది. పార్టీ ఏంటి మమ్మీ అని మహి అడగగానే ఏం లేదు నాన్న చిన్న గెట్‌ టు గెదర్ అని అనేస్తుంది. వరుణ్‌ మనసులో ఇప్పుడు పార్టీలో ఏం జరుగుతుందో మహి మనసు నిండా చిన్నినే ఉంది ఇప్పుడు శ్రేయతో పెళ్లి అంటే ఎలా రియాక్ట్ అవుతాడో అని అనుకుంటుంది. 

చిన్ని తన నెమలి పింఛం ఇచ్చినందుకు తనలో తాను చిన్నప్పుడు మహి నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఈ మ్యాడీకి ఇచ్చేశాను అనుకుంటుంది. ఇంతలో చంటి వచ్చి నేను చిన్నప్పుడు నుంచి అడిగితే ఇవ్వని ఆ పింఛం ఇప్పుడు ఆ అమెరికా అబ్బాయి అడిగితే ఎందుకు ఇచ్చావు అని అడుగుతాడు. ఏమోరా ఇచ్చేశాను అయినా ఎందుకు ఇచ్చాను అని మధు ఆలోచిస్తుంది. పద్దూ అక్క చెప్పినట్లు సంథింగ్ సంథింగ్ ఉందేమో అక్క అని చంటి అనగానే ఏంట్రా నువ్వు కూడా మొదలు పెట్టావా అని మధు చెవి మెలేస్తుంది. ఇక చంటి మధుకి వాచ్ ఇచ్చి అమెరికా అబ్బాయి మర్చిపోయాడని మధుకి ఇస్తాడు. నేను మ్యాడీని ఫ్రెండ్‌నే అనుకున్నా పద్దూ, చంటి ఇలా అంటున్నారేంటి అనుకుంటుంది. వాచ్ చూస్తూ ఎవరు ఎలా అనుకుంటే ఏంటి మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటుంది. 

మహి రెడీ అయి వెళ్తాడు. మహిని దేవా దగ్గరకు తీసుకొని మా ఏకైక వారసుడు మహేంద్ర వర్మ అని చెప్తాడు. మినిస్టర్లు ఇతర పొలిటికల్ లీడర్స్ అందరూ మహికి బొకే ఇచ్చి కంగ్రాట్స్ చెప్తారు. మహి అనుమానంగా చూస్తాడు. అందరూ నాకు కంగ్రాట్స్ చెప్తున్నారు ఏంటి మమ్మీ అని అడుగుతాడు. ఇంతలో శ్రేయని వసంత తీసుకొస్తుంది. శ్రేయని చూసిస్తుంది నాగవల్లి. మహికి ఏం అర్థం కాదు. శ్రేయని తీసుకొచ్చి మహి పక్కనే నిల్చోపెడతారు. ఇద్దరి చేతికి రింగులు ఇస్తారు. ఏంటి ఇది అని మహి అడుగుతాడు. దాంతో నాగవల్లి నిశ్చితార్థం కాదు నాన్న జస్ట్ ఫార్మల్‌గా ఉంగరాలు మార్చుకుంటారు అంతే అంటుంది. మహి షాక్ అయిపోతాడు. 

దేవా మహితో ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా ఉంటుంది ఇప్పటికి ఉంగరాలు మార్చుకోండి అని అంటాడు. దానికి మహి ఉంగరాలు మార్చుకోవడం ఏంటి అని అడుగుతాడు. చిన్నప్పటి నుంచి శ్రేయని నీ భార్య అని అనుకున్నాం అని కదా అందుకే ఇలా అనౌన్స్ చేస్తున్నాం అని అంటారు. శ్రేయ మహితో బావ నేను పుట్టగానే నీ భార్య అన్నారు. ఇప్పుడు నీ భార్య అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. మహి కోపం మొత్తం అణుచుకొని అందరితో ఇది ఇక్కడితో ఈ ఫంక్షన్ ఆపేస్తున్నాం. ఇది మాఫ్యామిలీ మేటర్ మీ ముందు మాట్లాడుకోలేం. ఎవరూ మా మమల్ని మా పేరెంట్స్‌ని తప్పుగా అనుకోకుండా పార్టీని వదిలేసి వెళ్లిపోండి అంటాడు. అందరూ వెళ్లిపోతారు.

వల్లి మహితో ఇలా పార్టీ ఆపేయడం తప్పు కదా నాన్న అంటే నాకు తెలీకుండా పార్టీ ఏర్పాటు చేయడం కూడా తప్పే కదా అంటాడు. ఏంట్రా తప్పు చిన్నప్పటి నుంచి నీకు ఏం కావాలో మాకు తెలుసు కదా అదే ఇస్తున్నాం కాదా ఏదీ నీకు అడిగి ఇవ్వడం లేదు కదా అని అంటాడు. దానికి మహి తప్పే డాడీ చిన్నప్పటి నుంచి నాకు చిన్ని అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. చిన్ని నా ప్రాణం అని నేను చిన్నిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని తనే నా సర్వస్వం అని తన కోసం వెతుకుతున్నాను అని తెలిసి కూడా ఇలా పెళ్లి ప్లాన్ చేయడం తప్పే కదా అని మహి అడుగుతాడు.  అందరూ షాక్ అయిపోతారు. శ్రేయ ఏడుస్తుంది. ఆ చిన్ని ఎక్కడుందో తెలీదు.. దానికి పెళ్లి అయిందో లేదో కూడా తెలీదు అది లైఫ్‌లో కనిపించకపోతే ఇలాగే పెళ్లి లేకుండా ఉండిపోతావా అని వల్లి కోప్పడుతుంది. ఇలాగే ఉంటాను మమ్మీ జీవితాంతం పెళ్లి లేకుండా ఉంటాను కావాలి అంటే చనిపోతా కానీ ఇలా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోను అని అంటాడు. 

దేవా మహి కాలర్ పట్టుకుంటాడు. నీకు మా కంటే అదే ఇష్టమా అంటే అవును నాకు అందరి కంటే చిన్నినే ఎక్కువ అంటాడు. నాగవల్లి మహిని లాగి పెట్టి కొట్టి ఫ్యామిలీ కంటే అది ఎక్కువ ఏంట్రా ఎవరూ ఫ్యామిలీ కంటే ఎక్కువ కాదు. నేను ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చా కాబట్టే నా  జీవితం వదిలేసి మీ కోసం బతుకుతున్నా మనం ఇలా సంతోషంగా ఉన్నాం నువ్వు కూడా అలాగే ఉండాలి. చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూనే ఉన్నావ్ కదా ఇక చాలు.. దాన్ని ప్రేమించింది చాలు.. అని వల్లి కోప్పడుతుంది. ప్లీజ్ మమ్మీ అలా మాట్లాడొద్దు నీకు ఇంకొక్క అవకాశం ఇవ్వు మమ్మీ అని మహి బతిమాలుతాడు. దాంతో వల్లి సరే ఇస్తున్నా నీకు ఒక్క అవకాశం ఇస్తున్నా 3 నెలలు నీకు టైం ఇస్తున్నా.. ఈ లోపు ఆ చిన్ని నీకు కనిపిస్తే ఒకే లేదంటే 91 రోజు నువ్వు శ్రేయ మెడలో తాళి కట్టాలి.. ఇది హెచ్చరిక కాదు శాసనం అని వల్లి అంటుంది. మహి ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు. శ్రేయ ఏడుస్తూ వెళ్లిపోతుంది. వల్లి దేవాతో ఈ గడువు వాడికి కాదు మనకి ఈ 90 రోజుల్లో ఆ చిన్ని ఎక్కడుందో తెలుసుకొని దాని శవం గోదారిలో పడేలా చేయాలి అంటుంది. మరోవైపు బాలరాజు అమ్మవారి దగ్గరకు గాజులు తీసుకొని వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadatri Serial Today october 22: మురళిని పట్టుకుని దివ్యాంకకు  బుద్ధి చెప్పిన జగధాత్రి..కేదార్‌ గురించి పార్టీలో కమలాకర్ చెప్పకుండా అడ్డుపడిన యువరాజు
జగధాత్రి : మురళిని పట్టుకుని దివ్యాంకకు  బుద్ధి చెప్పిన జగధాత్రి..కేదార్‌ గురించి పార్టీలో కమలాకర్ చెప్పకుండా అడ్డుపడిన యువరాజు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: భక్తవత్సలంలో మార్పు! తండ్రిని చంపడానికి సుభాష్‌ని రప్పించిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: భక్తవత్సలంలో మార్పు! తండ్రిని చంపడానికి సుభాష్‌ని రప్పించిన అంబిక!
Godavari Serial Today October 22nd: 'గోదావరి' సీరియల్: సూర్య, జానుల లవ్‌ వీడియో వేసి పరువు తీసేసిన సింహాద్రి! జానుకి అండగా సంజయ్!
'గోదావరి' సీరియల్: సూర్య, జానుల లవ్‌ వీడియో వేసి పరువు తీసేసిన సింహాద్రి! జానుకి అండగా సంజయ్!
Nindu Manasulu Serial Today October 22nd: నిండు మనసులు: ప్రేరణకు నిజం చెప్పిన గణ! పశ్చాత్తాపంతో కులిమిపోయిన ప్రేరణ! సిద్ధూ క్షమిస్తాడా!
నిండు మనసులు: ప్రేరణకు నిజం చెప్పిన గణ! పశ్చాత్తాపంతో కులిమిపోయిన ప్రేరణ! సిద్ధూ క్షమిస్తాడా!

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Embed widget