Brahmamudi November 29th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కళ్యాణ్‌ను తిట్టి వెళ్లిపోయిన అనామిక - రాజ్‌ను అందరి ముందు ఫూల్‌ను చేసిన కావ్య
Brahmamudi Serial Today Episode: కళ్యాణ్ ను తిట్టి వెళ్లిపోయిన అనామిక. మరోవైపు రాజ్ ను అందరి ముందు పూల్ ను చేసి తనను బయటికి తీసుకెళ్లేలా చేస్తుంది కావ్య. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Telugu Serial Today Episode: అనామిక లోపలికి వచ్చి కళ్యాణ్ మీద కోప్పడుతుంది. పిచ్చిదానిలా నన్ను కారులో కూర్చోబెట్టడం ఏం బాగాలేదని.. ఇప్పటివరకు నేను ఎవ్వరి కోసం వెయిట్ చేయలేదని సీరియస్ అవుతుంది. అప్పు ఫీలవుతుందని కళ్యాణ్ అంటాడు. అయితే నువ్వు అప్పుతోనే ఉండు అంటూ అనామిక అలిగి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కనకం పెళ్లి చేసుకునే అనామికను ఎందుకు అలా బాధపెడతావు బాబు అని చెప్తుంది. అనామికను ఎలాగైనా కన్వీన్స్ చేయగలను కానీ అప్పును సంతోషంగా చూసే వరకు ఇక్కడి నుంచి నేను కదలను అంటాడు కళ్యాణ్.
అప్పు: నువ్వు ఎంత సేపు కూర్చున్నా నీకు సమాధానం దొరకదు. ఎందుకంటే నేను ఏ విషయంలోనూ బాధపడటంలేదు. కాబట్టి నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు.
కళ్యాణ్ : నీ దగ్గర నుంచే మొండితనం నేర్చుకున్నాను. నువ్వు మారి నువ్వు నోరి తెరిచి నిజం చెప్పేంత వరకు నేను ఎక్కడికి వెళ్లను. చూసుకుందాం నువ్వో నేనో.
రాజ్ బెడ్‌రూంలో రెడీ అవుతుంటాడు. కావ్య అక్కడికి వచ్చి..
కావ్య: తొందరగా రెడీ అవ్వమని చెబుదామని వచ్చా కానీ మీరే రెడీ అయ్యారు.
రాజ్: రోజూ నువ్వు చెప్తేనే రెడీ అవుతున్నానా? ఈరోజు వచ్చి కొత్తగా చెప్తున్నావు.
కావ్య: రోజూ మీరు ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అయ్యేవారు. ఈరోజు మాత్రం నాకోసం రెడీ అయ్యారు.
రాజ్: నీ కోసమా?
కావ్య: అవును ఈరోజు మీరే నన్ను బయటికి తీసుకెళ్తున్నారు.
స్వర్గానికైనా సరే నీతో నేను రాను అంటాడు రాజ్.. అయితే మన ఫ్యామిలీ కోసమైనా రావా అని అడుగుతుంది కావ్య. ఫ్యామిలీ కోసమా అంటే అని రాజ్ ప్రశ్నిస్తాడు. ఎలాగైనా మీరు వచ్చేలా చేస్తానని చాలెంజ్ చేసి బయటికి వెళ్తుంది కావ్య. హాల్లో అందరూ కూర్చుని ఉంటారు. కావ్య సిగ్గుపడుతూ రావడం చూసి..
ధాన్యలక్ష్మీ: ఏంటి కోడలు పిల్లా ఇవాళ కొత్తగా కనిపిస్తుంది.
కావ్య: అది మీ అబ్బాయి బయటికి వెళ్దామని చెప్పారు.
ధాన్యలక్ష్మీ: బయటికి అంటే ఎక్కడికి
కావ్య: అది ఎవ్వరికీ చెప్పొద్దన్నారు. సర్‌ప్రైజ్ అట
అంటూ కావ్య చెప్తుండగానే రాజ్ వస్తాడు. మాటల గారడీతో రాజ్‌ను అందరి ముందు ఇరికించి తనను బయటికి తీసుకెళ్లేలా చేస్తుంది కావ్య.
అప్పు ఒక్కతే కూర్చుని అన్నం తినడం చూసిన కనకం సంతోషపడుతుంది. కళ్యాణ్ చెప్పగానే అన్నం తింటుందని వాళ్ల అక్కతో చెప్తుంది కనకం. అవును నేను చూస్తున్నాను అనామిక వచ్చి కోప్పడినా అప్పు కోసం ఇక్కడే ఉండి పోయాడు అంటుంది కనకం వాళ్ల అక్క. అప్పులాగే కళ్యాణ్ కూడా తనకు తెలియకుండా అప్పును ప్రేమిస్తున్నాడని అర్థం అయింది. కళ్యాణ్ కళ్లల్లో అప్పుపై ఉన్న ప్రేమ కనిపిస్తుంది. అది కళ్యాణ్‌కు తెలిసేలా చేయాలంటే నేను కొద్ది రోజులు ఆ ఇంట్లో ఉండాలి. దేవుడు ఒక్కచాన్స్ ఇస్తే బాగుండు. నేను ఆ ఇంట్లో అడుగుపెడతా.. కళ్యాణ్‌తో అప్పు పెళ్లి జరిపిస్తా అని కనకం చెప్తుండగానే స్వప్న కనకానికి ఫోన్ చేస్తుంది.
కనకం: చెప్పమ్మా ఈసారి ఏం పని చేశావు.
స్వప్న: నేను ఏదో ఒకటి చేయాలని ఎదురుచూస్తున్నావా? అమ్మ
కనకం: నువ్వు నా కూతురివి కదా ఆమాత్రం ఉంటుందిలే అమ్మ
అనగానే స్వప్న తనకు కడుపొచ్చిందని.. ఈసారి నిజమైన కడుపేనని చెప్తుంది. అయితే కనకం నమ్మదు. కావ్యను అడిగి తెలుసుకో..లేదంటే మా ఇంటికి వచ్చి అత్తయ్యను అడుగు అంటూ ఫోన్ కట్ చేస్తుంది స్వప్న. కావ్య, రాజ్ కారులో వెళ్తుంటారు. ఇంతలో కనకం కావ్యకు ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన కావ్య లౌడ్‌స్పీకర్ పెట్టి మాట్లాడుతుంది.
కావ్య: ఆ చెప్పమ్మా..
కనకం: ఏంటో ఆ దున్నపోతు కడుపుతో ఉందా?
కావ్య: దున్నపోతు కడుపుతో ఉండటమేంటమ్మా?
కనకం: అదేనే నీ అక్క
అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే రాజ్ పగలబడి నవ్వుతుంటాడు. మీ అమ్మే నమ్మడం లేదు. ఇక రాహుల్ ఎలా నమ్ముతాడు మా అత్తేం నమ్ముతుంది నేనేం నమ్ముతాను అంటాడు రాజ్. కనకం కూడా నమ్మనని అది మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టినట్టుందని అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: సోషల్ మీడియాలో ఆలియా డీప్‌ఫేక్ వీడియో హల్‌చల్ - స్పందించడానికి ఇష్టపడని నటి!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply