Alia Bhatt: సోషల్ మీడియాలో ఆలియా డీప్‌ఫేక్ వీడియో హల్‌చల్ - స్పందించడానికి ఇష్టపడని నటి!
Alia Bhatt Deep Fake Video: ఇప్పటికే డీప్‌ఫేక్ టెక్నాలజీ వల్ల పలువురు హీరోయిన్లు ఇబ్బంది పడగా.. ఆ లిస్ట్‌లో ఆలియా భట్ కూడా జాయిన్ అయ్యింది.
Alia Bhatt Deep Fake : టెక్నాలజీ అనేది మానవాళికి చేస్తున్న మంచికంటే చెడే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీలు, పబ్లిక్‌కు తెలిసిన వ్యక్తులకు ఈ టెక్నాలజీ ముప్పుగా మారింది. ఏఐ టెక్నాలజీ అనేది వచ్చిన తర్వాత.. ఇది టెక్ ప్రపంచంలో మరో సంచలనాన్ని సృష్టిస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఈ ఏఐ టెక్నాలజీతో తయారైన డీప్‌ఫేక్ టెక్నాలజీ.. ప్రస్తుతం సెలబ్రిటీలకు.. ముఖ్యంగా సినీ పరిశ్రమలో పనిచేసే హీరోయిన్లకు పీడకలలాగా మారింది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు.. ఈ డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా ఇబ్బందులను ఎదుర్కోగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ఆలియా భట్ కూడా యాడ్ అయ్యింది.
అలర్ట్ అవుతున్న సెలబ్రిటీలు..
డీప్‌ఫేక్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయిన హీరోయిన్ల లిస్ట్‌తలోకి తాజాగా ఆలియా భట్ పేరు కూడా యాడ్ అయ్యింది. ముందుగా కన్నడ బ్యూటీ రష్మిక మందనా డీప్‌ఫేక్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారగా.. అది చాలామంది సెలబ్రిటీలను అలర్ట్ చేసింది. రష్మికకు న్యాయం జరగాలంటూ.. ఇలాంటి టెక్నాలజీ వల్ల ఇంకా ఏ హీరోయిన్లు ఇబ్బందిపడకూడదు అంటూ చాలామంది దీనిని ఖండించారు. కానీ ఒకరి తర్వాత ఒకరుగా హీరోయిన్లు.. ఈ డీప్‌ఫేక్ టెక్నాలజీకి బలవ్వక తప్పలేదు. రష్మిక తర్వాత కాజోల్.. డీప్‌ఫేక్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కత్రినా కైఫ్ కూడా డీప్‌ఫేక్ వల్ల ఇబ్బందులు పడింది. ఇప్పుడు ఆలియా కూడా ఈ లిస్ట్‌లో చేరగా.. మిగతా హీరోయిన్స్‌లో కలవరం మొదలయ్యింది.
ఆలియా డీప్‌ఫేక్ వీడియో..
తాజాగా విడుదలయిన ఆలియా భట్ డీప్‌ఫేక్ వీడియోలో వేరే అమ్మాయి శరీరానికి ఆలియా ఫేస్‌ను టెక్నాలజీ ద్వారా అటాచ్ చేసినట్టు తెలుస్తోంది. కొద్దిసమయంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినా.. దీనిపై ఆలియా ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ వీడియోలో ఆలియా.. బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని కెమెరాను చూస్తూ సైగలు చేస్తున్నట్టుగా ఉంది. దీంతో ఫేస్ స్వాప్ టెక్నాలజీ వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది మరోసారి నిరూపణ అయ్యింది. అందుకే ఇలాంటి టెక్నాలజీని తప్పుగా ఉపయోగించేవారిని శిక్షించాలని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇన్‌ఫ్లుయెన్సర్ శరీరానికి కాజోల్ ఫేస్..
ఆలియా కంటే ముందుగా సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ రోజీ బ్రీన్ శరీరానికి కాజోల్ ఫేస్‌ను అటాచ్ చేసి తను కెమెరా ముందే బట్టలు మార్చుకుంటున్నట్టుగా వీడియోను వైరల్ చేశారు. ఇదంతా చూసిన తర్వాత ప్రజల్లో ఆందోళన మొదలయ్యింది. ఎప్పుడు, ఎవరిని ఫేస్‌ను ఇలా తప్పుగా ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోను తయారు చేస్తారో.. తరువాతి ఎవరి వీడియోలు ఇలా వైరల్ అవుతాయో అని హీరోయిన్స్‌లో సైతం టెన్షన్ పెరిగిపోతోంది. దీంతో కొందరు నెటిజన్లు ఈ డీప్‌ఫేక్ టెక్నాలజీపై సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా టెక్నాలజీలను తప్పుగా ఉపయోగిస్తున్న వారిని శిక్షించడం కోసం కొత్త చట్టాలు రావాలని భావిస్తున్నారు. ఆలియా ఫ్యాన్స్ అయితే తాము ఆలియాకు సపోర్ట్ చేస్తామని సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నారు.
Also Read: 'ఫ్యామిలీ స్టార్'లో రష్మిక క్యామియో - 'గీతా గోవిందం' మ్యాజిక్ రిపీట్!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply