Family Star Movie : 'ఫ్యామిలీ స్టార్'లో రష్మిక క్యామియో - 'గీతా గోవిందం' మ్యాజిక్ రిపీట్!
Rashmika Mandanna : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీలో రష్మిక మందన క్యామియో రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Rashmika Cameo In Family Star : టాలీవుడ్ లో 'గీతాగోవిందం' కాంబో మళ్లీ రిపీట్ కాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. కాకపోతే అది పూర్తిస్థాయిలో కాదట. గీతా గోవిందం జోడి విజయ్ దేవరకొండ, రష్మిక బిగ్ స్క్రీన్ పై కొద్ది నిమిషాల పాటు ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం 'ఫ్యామిలీ స్టార్'(Family Star) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ కి 'గీతాగోవిందం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పరశురామ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
వచ్చే సంక్రాంతికి రిలీజ్ కావలసిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా సమ్మర్ కి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెంట్ గా ఫారిన్లో ఓ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. వీసా సమస్యలతో ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం ముంబైలో సాంగ్ షూటింగ్ జరగడం జరుగుతుంది. కథకి ఫారిన్ లొకేషన్ డిమాండ్ చేయకపోవడంతో పరశురాం ఇక్కడే లేటెస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి రేస్ నుంచి తప్పుకున్న 'ఫ్యామిలీ స్టార్'(Family Star) కొత్త రిలీజ్ డేట్ కోసం వెతుకులాటలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది.
అదేంటంటే, ఫ్యామిలీ స్టార్(Family Star) మూవీలో నేషనల్ రష్మిక మందన(Rashmika Mandann) క్యామియో రోల్ చేస్తోందట. లాంగ్ గ్యాప్ తర్వాత విజయ్, రష్మిక ల జోడి 'ఫ్యామిలీ స్టార్' మూవీలో కొద్ది నిమిషాల పాటు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ జోడిగా మొదటిసారి 'గీతా గోవిందం' మూవీలో నటించారు. బిగ్ స్క్రీన్ పై వీళ్ళ కెమిస్ట్రీకి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గీత గోవిందం తర్వాత 'డియర్ కామ్రేడ్' తో మరోసారి ఈ జోడి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ లో రష్మిక క్యామియో ఉండబోతుందనే విషయం బయటికి రావడంతో ఫ్యాన్స్ ఈ న్యూస్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు.
ప్రస్తుతానికి దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యామిలీ స్టార్ కి రష్మిక కామియో స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. త్వరలోనే మేకర్స్ నుంచి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి నెలాఖరికి అప్పుడూ కూడా కుదరకపోతే మార్చ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శిరీష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : ఈ ఇయర్ బెస్ట్ మూవీ ఇదే, మమ్ముట్టి చిత్రంపై సమంత ప్రశంసలు
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply