Brahmamudi Serial Today May 4th: బ్రహ్మముడి సీరియల్: రాహుల్, రుద్రాణిల ప్లాన్ తిప్పి కొట్టిన స్వప్న.. రాజ్ గురించి షాకింగ్ నిజం తెలుసుకున్న కావ్య!
Brahmamudi Serial Today Episode రాహుల్, రుద్రాణిలకు మత్తు మందు ఇచ్చి కోటి రూపాయలను స్వప్న తీసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Brahmamudi Today Episode స్వప్న తన తల్లి కనకం సాయంతో తన డాక్యూమెంట్స్ తాకట్టు పెట్టి కోటి రూపాయల అప్పు తీసుకుంది భర్త, అత్తలే అని తెలుసుకుంటుంది. వాళ్ల పని పట్టాలి అనుకొని రుద్రాణి, రాహుల్ మందు పార్టీ చేసుకుంటుంటే అక్కడికి వెళ్తుంది. ఇద్దరితో డ్యాన్స్ చేయిస్తుంది.
ఇద్దరూ డ్యాన్స్ వేస్తుండగా తాను తెచ్చిన మత్తు మందుని ఇద్దరూ తాగే మందులో కలిపేస్తుంది. ఇద్దరికీ ఆ మందు ఇస్తుంది ఇద్దరూ తాగేస్తారు. మత్తులో ఉన్న రుద్రాణి, రాహుల్ స్వప్నతో నిజం చెప్తేస్తారు. ఇక మత్తులో రుద్రాణి మొత్తం డబ్బు తన లాకర్‌లో సేప్‌గా ఉంచానని చెప్పేస్తుంది. లాకర్ తాళాలు కూడా స్వప్నకి చూపిస్తుంది. తాగినట్లు నటించి స్వప్న తాళాలు కొట్టేస్తుంది. ఇక రాహుల్, రుద్రాణి ఇద్దరూ మత్తు వల్ల పడుకుండిపోతారు. స్వప్న డబ్బులు తీసుకొని వెళ్లిపోతుంది. తర్వాత తాళాలు అత్త జేబులో పెట్టేసి వెళ్లిపోతుంది.
కావ్య అప్పు పెట్టిన లోకేషన్‌కి బయల్దేరుతుంది. కావ్య తన తల్లికి విషయం చెప్పొద్దని చెప్తే పెద్ద గొడవ చేస్తుందని అంటుంది. మరోవైపు ఇంట్లో అందరూ హాల్‌లో కూర్చొని ఉంటారు. సేటు వచ్చు పెద్దల కాలి మీద పడతాడు. రాహుల్, రుద్రాణిలు కంగారు పడతారు. సేటు రాహుల్‌ని తిడతాడు. స్వప్నని పిలవమని అంటాడు.
సేటు: ఆ స్వప్నని పిలవండి నా పాపం కడిగేసుకుంటా. తప్పు ఒప్పుకొని మీ ఆస్తి కాగితాలు మీకు ఇచ్చి పోదామని వచ్చాను. స్వప్న గారి పేపర్స్ స్వప్న గారు తీసుకుంటే నేను వెళ్లిపోతా అని పేపర్స్ స్వప్నకు ఇస్తాడు.
స్వప్న: నాకు ఏం అవసరం లేదు. నిన్ను నువ్వే వచ్చావ్. ఆస్తి పేపర్లు నీ దగ్గర తాకట్టు పెట్టి కోటి తీసుకున్నా అన్నావు. ఇప్పుడు నువ్వు నీ పాటి వచ్చి పేపర్లు ఇస్తే నా మీద పడ్డ నింద ఎలా పోతుంది. అసలు నా ఇంట్లో ఉండాల్సిన ఆస్తి పత్రాలు నీ దగ్గరకు ఎలా వచ్చాయి. నేను అప్పు తీసుకున్నట్లు నా సంతకంతో ఉన్న పేపర్లు నీ దగ్గరకు ఎలా వచ్చాయి.
రుద్రాణి: మనసులో అయిపోయింది మా గురించి చెప్పేస్తాడేమో.
సేటు: రాహుల్ చెప్పద్దని సైగ చేయడంతో.. అమ్మా నా దగ్గరకి చాలా మంది దొంగలు ఆస్తి పేపర్లు కొట్టేసి వచ్చి ఇస్తారు. నేను ఆస్తి కొట్టేయడానికి ఇలాంటి దరిద్రపు పనులు చేస్తాను. నీ పేపర్లు నీ చేతిలో పెడుతున్నాను. నువ్వు కాదు అంటే ఆ అమ్మ వారు నన్ను చంపేస్తుంది.
రుద్రాణి: చెప్తున్నాడు కదా. నీ ఆస్తి పేపర్లు నీ దగ్గరకు వచ్చాయ్. అప్పు కూడా కట్టొద్దు అంటున్నాడు కదా. బెట్టు చేయకు.
రాహుల్: అవును స్వప్న క్షమించి తీసుకో. కానీ నేను మాత్రం ఇలాంటి వాడిని క్షమించను. వెళ్లి పోలీసులకు అప్పగిస్తాను.
ప్రకాశం: దానికంటే ముందు ఇంటి దొంగ ఎవరో తెలియాలి కదా. వీడిని పట్టుకొని నాలుగు తగిలిస్తే చెప్తాడు.
రాహుల్: వద్దు మామయ్య నేను చూసుకుంటా.
రాహుల్ సేటుని తిడతాడు. దీంతో సేటు రివర్స్ అవుతాడు. కోటి రూపాయలు కట్టమని చెప్తాడు. మరోవైపు కావ్య అప్పు చెప్పిన అడ్రస్‌కు వస్తుంది.
కావ్య: అప్పు చెప్పిన అడ్రస్ ఇదే కానీ ఆ డబ్బు తీసుకున్న వాడు ఉన్నాడో లేదు. (ఇంతలో అప్పు ఇద్దరు పోలీసుల్ని తీసుకొని వస్తుంది. ) అప్పు పోలీసుల్ని తీసుకొని వస్తావా. ఇది ఎవరికీ తెలీకూడదు అన్నాను కదా. నీకు ఏం చెప్పినా ఇంతే.
అప్పు: ఆపుతావా ఇంక వాళ్లు నిజమైన పోలీసులు కాదు. అవును అక్క సినిమాలో పనిచేసే ఆర్టిస్ట్‌లు బిల్డప్ కోసం తీసుకొని వచ్చాను.
కావ్య: వీళ్లిద్దరూ చెడగొట్టేలా ఉన్నారే నేను ఒక్కదాన్నే వెళ్తా.
అప్పు: అక్క నువ్వేం కంగారు పడకు లోపల ఉన్న వాళ్లని భయపెట్టాలి అంటే ఈ మాత్రం ఉండాలి.
రాజ్ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి దగ్గరకు కావ్య వెళ్తుంది. పోలీసుల గెటప్‌లో ఉన్న వారు అరెస్ట్ చేస్తామని లేదంటే మేడం అడిగిన దానికి చెప్పమని అంటారు. అప్పు నిజం చెప్పమని అడుగుతుంది.
కావ్య: నీకు రాజ్ సార్ తెలుసు కదా. ఆయన నీకు డబ్బులు ఎందుకు ఇచ్చారు అని అడుగుతుంది. దీంతో ఆ వ్యక్తి తెలుసు మేడం కానీ చెప్పను చెప్తే రాజ్ సార్ చంపేస్తారు అంటాడు. దీంతో పోలీసులు చెప్పకపోతే మేం చంపేస్తాం అంటారు. దీంతో కావ్య నిజం చెప్పి ప్రాణాలు కాపాడుకోమని అంటుంది.
రాజ్‌డబ్బిచ్చిన వ్యక్తి.. ఫిబ్రవరి 18న అంటే కావ్య రాజ్‌ల పెళ్లి రోజున రాజ్ వచ్చారని.. మాయ అనే ఆవిడ తన బాబుని రోజుకి రెండు రోజులు తమ డే కేర్ సెంటర్‌లో పెట్టేదని ఆరోజు లేటుగా వచ్చిందని రాజ్ సార్, మాయ మేడం మాట్లాడుకోవడం అనుమానం వచ్చి చాటుగా విన్నాను అని చెప్తాడు. ఏం విన్నావని కావ్య అంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.