అన్వేషించండి

Brahmamudi Serial Today November 9th:  ‘బ్రహ్మముడి’ సీరియల్:    దుగ్గిరాల ఇంట్లో పేలిన బాంబ్‌ - అప్పుకు ఇంతో అంతో ఇచ్చి వదిలించుకోమన్న ధాన్యలక్ష్మీ  

Brahmamudi Today Episode:   అనామిక వేసిన బాంబు దగ్గిరాల ఇంట్లో పేలడంతో అందరి మధ్య గొడవలు మొదలవుతాయి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.     

Brahmamudi Serial Today Episode:  కావ్య, రాజ్‌ను పక్కకు తీసుకెళ్లి వీడియో చూపించి ఇప్పుడు మీరు ఆ హారం నా మెడలో వేయకపోతే అందరికీ ఈ వీడియో చూపిస్తానని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది. దీంతో రాజ్‌ ఏమైనా చేసుకోపో అని చెప్పగానే నిజంగానే అందరికీ చూపిస్తానని లోపలికి వెళ్తుంది. ఇది నిజంగానే నా పరువు తీసేలా ఉంది అని వెనకాలే పరుగెత్తుకొస్తాడు రాజ్‌. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. రుద్రాణి మాత్రం ఏంటి ఏదో సాధిస్తానని రాజ్‌ ను బయటకు తీసుకెళ్లి చేతకాక తల వంచుకుని లోపలికి వస్తున్నావు అంటుంది.

అపర్ణ: ఏరా.. హారం వేయడానికి ఒప్పుకోలేదా..? పండగ రోజు కావ్యను బాధపెడతావా..?

రాజ్‌: దీని నిజస్వరూపం ఏంటో తెలియక.. అందరూ జాలి చూపిస్తున్నారు ( మనసులో అనుకుంటాడు) పక్కకు తీసుకెళ్లి ఎంతో బతిమాలుతుంది. నాలో మానవత్వం పాలు ఎక్కువ కాబట్టి ఒప్పేసుకున్నాను.

కావ్య: అంతగా బతిమాలానా..?

రాజ్‌: అంతగా అంటే ఎంతో కొంత.. అంతేకదా..?

కావ్య: అవునా…

రాజ్‌: ఇప్పుడు హారం నీ మెడలో వేయాలి అంతేకదా…? నాన్నమ్మ హారం ఇటువ్వు..

అపర్ణ: పక్కకు బాగానే జ్ఞానోదయం కలిగించినట్టు ఉన్నావు కావ్య. పక్కకు తీసుకెళ్లి ఏం చెప్పావు.

అని అడగ్గానే కావ్య సిగ్గు పడుతుంది. ఇంతలో రాజ్‌ హారం కావ్య మెడలో వేయబోతుంటే.. ఇందిరాదేవి ముగ్గురు మెడలో వేయండి అని చెప్తుంది. ముగ్గురు వేస్తారు. తర్వాత కావ్య, కళ్యాణ్‌కు పెన్‌ గిఫ్టుగా ఇస్తుంది. కళ్యాణ్‌ సినిమాలకు పాటలు రాస్తున్నారు అని చెప్పడంతో అందరూ ఆనందంగా ఫీలవుతారు. నువ్వు రాసిన పాట వినిపించమని అడగ్గానే అమ్మ పాట వినిపిస్తాడు కళ్యాణ్‌.

ధాన్యలక్ష్మీ: నాన్న నిజంగా చాలా బాగుందిరా..

ప్రకాష్‌: తల్లి ప్రేమ ఎలా ఉంటుందో వాడికి బాగా తెలుసు. కానీ కొడుక్కి తల్లి మీద ఎంత ప్రేమ ఉంటుందో నువ్వు కూడా తెలుసుకుంటే బాగుంది ధాన్యం.

స్వప్న: ప్రకాషం అంకుల్‌ టాఫిక్‌ డైవర్ట్‌ అవుతుంది. అందరం బయటకు వెళ్లి క్రాకర్స్‌ కాల్చుకుంటే బాగుంటుంది కదా..

ప్రకాష్‌: అవునమ్మా వెళ్దాం పదండి.

అనగానే రాజ్‌ క్రాకర్సా..? నేను రాను నాకు భయం అంటూ పైకి వెళ్లిపోతుంటే.. అందరూ రాజ్‌ ను తీసుకుని బయటకు వెళ్తారు. సంతోషంగా క్రాకర్స్‌ కాలుస్తుంటారు. రాజ్‌ మాత్రం భయపడుతూ కావ్య వెనక్కి వెళ్తుంటాడు. క్రాకర్స్‌ సౌండ్స్‌ కు కావ్యను గట్టిగా హగ్‌ చేసుకుంటాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు.

ఇందిర: ఓరేయ్‌ అయిపోయిందిరా పేల్చడం.

రుద్రాణి: బయట బాంబులేం పేలుస్తారు కానీ లోపల టీవీలో ఇంకా పెద్ద బాంబు పేలుతుంది చూద్దురు కానీ రండి.. రండి చూడండి.

అని అందరినీ ఇంట్లోకి  పిలిచి టీవీ ఆన్‌ చేసి చూపిస్తుంది. అందులో అనామిక, కళ్యాణ్‌ మీద రెడీ చేయించిన డాక్యుమెంటరీ వస్తుంది. అది చూసిన ధాన్యలక్ష్మీ కోపంగా కళ్యాన్ కాలర్‌ పట్టుకుని తిడుతుంది.  

ధాన్యలక్ష్మీ: అరేయ్‌ ఇదా నువ్వు బతికే బతుకు. దీన్ని పోషించడానికి నువ్వు ఆటో నడుపుతున్నావా..?

కళ్యాణ్‌: ఆవేశపడకు అమ్మ నేనేం తప్పు చేయడం లేదు. నిజాయితీగా బతుకుతున్నాను.

ధాన్యలక్ష్మీ: నిజాయితీ గురించి నాకు చెప్తున్నావా..? ఇంట్లో ఇన్ని కార్లు పెట్టుకుని వాటిని  నడపడానికి డ్రైవర్లు పెట్టుకున్నాము. కానీ నువ్వు మాత్రం ఆటో నడుపుతున్నావా..?

కళ్యాణ్‌: ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు అమ్మా..

ధాన్యలక్ష్మీ: ఒరేయ్‌ నీకేం గతి లేదు అనుకున్నావా..? నీ తరపున అడిగే దిక్కు లేదనుకున్నావా..? దీనికోసం దీన్ని మేమేదో అందలం ఎక్కించం అన్నట్టు అగ్గిపెట్టె లాంటి రూంలో ఎంత పేదరికం  అనుభవిస్తున్నావో తెలుసా..? దరిద్రంలా పట్టుకుందేంటిరా నిన్ను ఇది.

స్వప్న: ధాన్యలక్ష్మీ ఆంటీ మర్యాదగా మాట్లాడండి.

ధాన్యలక్ష్మీ: మర్యాద గురించి మీ ముగ్గురు అక్కాచెళ్లేలే చెప్పాలి. టీవీలో ఎంత దరిద్రంగా చూపిస్తున్నారో చూశావా..?

అప్పు: ఏ నేరం చేశాడో చూపించారా.. ఆంటీ. ఒక కవి తన కాళ్ల మీద తను నిలబడటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు.

ధాన్యలక్ష్మీ: ఏయ్‌ నువ్వు ఆపవే.. నాతో మాట్లాడేంత బతుకా నీది.

కావ్య: ఏమైంది తన బతుక్కి. కోట్లు కావాలని ఏమీ కోరుకోలేదే.. మీ అబ్బాయి చెట్టుకింద ఉండమన్నా ఉంటానంది. ఒక్కపూట తిండి పెట్టి ఒక్కపూట పస్తులు ఉండమన్నా ఉంది. దాన్ని తక్కు వ చేసి మాట్లాడే అధికారం మీకు లేదు. ఇంత అహంకారం పనికిరాదు.

ధాన్యలక్ష్మీ: నువ్వు నోరు మూసుకో.. ఇది నాకు నా కొడుక్కి మధ్య జరిగే విషయం నీ సంగతి నీ వాళ్ల సంగతి అంతా ఎవరికి తెలియదు అనుకున్నావు.

అనగానే స్వప్న కోపంగా ధాన్యలక్ష్మిని తిడుతుంది. ఇద్దరిని రాజ్‌ వారించి కళ్యాణ్‌తో మాట్లాడతాడు. నువ్వెందుకు అంత కష్టపడటం. నీకేం తక్కువరా నాలాగే నువ్వు ఇంటి వారసుడివి. అప్పును తీసుకుని ఇంటికి రారా..? అని రాజ్‌ చెప్పగానే దేనికి రావాలని కోడలిని పట్టుకుని నువ్వెంత నీ బతుకెంత అని మాట్లాడుతుంది అంటూ కళ్యాణ్‌ చెప్పగానే.. దీంతో ధాన్యలక్ష్మీ మళ్లీ కళ్యాణ్‌ను తిడుతుంది. ధాన్యలక్ష్మీని ఇందిరాదేవి తిడుతుంది. నువ్వెందుకు నిప్పులు తొక్కిన కోతిలా అరుస్తున్నావు అంటూ నిలదీస్తుంది. దీంతో మరింత కోపంగా ధాన్యలక్ష్మీ దాని ముఖాన ఎంతో కొంత పడేస్తాను. దాన్ని వదిలేసి నువ్వు ఇక్కడే ఉండిపో అంటుంది. నేను సచ్చేదాకా దాన్ని కోడలుగా అంగీకరించను అనడంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Lava Blaze Duo 5G: రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Lava Blaze Duo 5G: రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
KTR: 'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్
'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Embed widget