అన్వేషించండి

Brahmamudi Serial Today November 4th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: కళ్యాణ్‌ను అవమానించిన అనామిక – బిజినెస్‌ లో రాజ్‌ తనకు గురువు అన్న కావ్య

Brahmamudi Today Episode:  ఆటో నడుపుతూ వెళ్లున్న కళ్యాణ్‌ దగ్గరకు అనామిక వెళ్లి ఘోరంగా అవమానిస్తుంది. ఫోటో తీసుకుని వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  కావ్య అపాయింట్‌ కొరకు అందరూ రాజ్‌కు ఫోన్‌ చేస్తుంటే.. రాజ్ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతాడు. ఫోన్‌ చేసిన వాళ్లకు తిక్కతిక్క సమాధానం చెప్తాడు. శృతి వచ్చి రాజ్‌ను చూసి పొద్దుపొద్దునే ఎవరో ఆడుకున్నట్టు ఉన్నారు. నూనెలోంచి తీసిన గారెలా వేడి మీద ఉన్నారు అనుకుంటూ దగ్గరకు వెళ్లి గుడ్‌ మార్నింగ్‌ మేనేజర్‌ గారు అంటుంది.

రాజ్‌: నేను మేనేజర్‌ ను అని గుర్తు చేస్తున్నావా..?

శృతి: అయ్యో నేను ఆ ఉద్దేశంతో అనలేదు. సార్‌ పాత మేనేజర్‌ ను పిలిచి పిలిచి అలవాటై పోయింది.

రాజ్‌: నువ్వు ఏ ఉద్దేశంతో పిలిచావో.. మీ మేడం ఏ ఉద్దేశంతో పిలిపిస్తుందో అర్థం కానంత పిచ్చోన్ని అనుకున్నావా..? అయినా మీ మేడం అపాయింట్‌ కోసం ఎవరెవరో నాకు కాల్‌ చేస్తున్నారేంటి?

శృతి: అంటే సార్‌ .. మేడం అపాయింట్స్‌ మెంట్స్‌ అన్ని మేనేజర్‌ గా చూసుకోవడం మీ బాధ్యత కదా సార్‌.

అని శృతి చెప్పగానే రాజ్‌ కోపంగా నేను ఈ కంపెనీకి మేనేజర్‌ నా..? ఆవిడ అసిస్టెంట్‌ నా..? అంటాడు. దీంతో శృతి కోపంలో మీరు మేనేజర్‌ ను అని ఒప్పుకున్నారు సార్‌ అంటూ వెళ్లిపోతుంది. రాజ్‌ కోపంగా తాతయ్యా అనుకుంటూ కావ్య చాంబర్‌లోకి వెళ్తాడు.

రాజ్‌: నేను వచ్చింది కనబడలేదా..?

కావ్య: అందుకే తల ఎత్తి చూశాను కదా? కూర్చోండి.

రాజ్‌: అక్కర్లేదులే… ఎందుకు వచ్చానో అడగవా..?

కావ్య: వచ్చింది మీరే కదా..? ఎందుకు వచ్చారో తెలియదా..?

   అనగానే రాజ్‌ కోపంగా కావ్యను పొగరు అంటూ అనగానే.. ఏంటి అన్నారు అని కావ్య అడిగితే ఇది మీ ఊరిలో ఆత్మాభిమానం అంటారు కదా? అంటాడు. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. దీంతో రాజ్‌ చాలా మంది క్లయింట్స్‌ ఫోన్‌ చేస్తున్నారు. అపాయింట్‌ ఫిక్స్‌ చేయమంటావా..? అని అడుగుతాడు. సరే అంటుంది కావ్య. మరోవైపు కళ్యాణ్‌ ఆటో నడపడం చూసిన అనామిక దగ్గరకు వెళ్లి ఘోరంగా అవమానిస్తుంది. కళ్యాణ్‌ ఆటో నడపుకుంటూ వెళ్లడం ఫోటో తీస్తుంది. ఎందుకు ఫోటో తీశావని సామంత్‌ అడిగితే దుగ్గిరాల పరవు ప్రతిష్టలు దిగజార్చడానికి ఇది చాలు అంటుంది. మరోవైపు క్లయింట్స్‌ తో మీటింగ్‌ కు కావ్య వెళ్తుంది.

కావ్య: నన్ను కలవాలని.. నా అపాయింట్‌ మెంట్‌ కావాలని మీరందరూ చాలా ట్రై చేశారని చెప్పారు. దేనికోసం.

రాజ్‌: ఏయ్‌ మేడంతో మాట్లాడాలని నా బుర్ర తిన్నారు కదయ్యా.. మరి ఇక్కడకు వచ్చి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారేంటయ్యా..?

క్లయింట్‌: ఫోన్‌ లోనే మీకు అంతా చెప్పాము కదా సార్‌.

రాజ్‌: ఏంటి నేను మీకు మీడియేటర్‌ లాగా కనిపిస్తున్నానా..? ఏం చెప్పాలో ఆవిడతోనే చెప్పండి.

కావ్య: మా కంపెనీతో బిజినెస్‌ వద్దు అనుకుని వెళ్లిపోయారు కదా? మరి నన్ను ఎందుకు కలవాలనుకున్నారు.

క్లయింట్‌: అలా అనుకుని వెళ్లడం ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాం మేడం.

కావ్య: నిన్నటి వరకు ఈ కంపెనీ మీకు నష్టాలు తెచ్చిపెడుతుంది అనుకున్న మీరు సడెన్‌ గా ఇప్పుడు ఇలా ఎందుకు అనుకుంటున్నారు.

క్లయింట్‌: దానికి కారణం అనామిక మేడం. ఆవిడ తన కంపెనీలో జాయిన్‌ అయితే ఎక్కువ లాభాలు తీసుకొస్తానని నమ్మించారు. అదే సమయానికి ఇక్కడ రాహుల్‌ మాతో సరిగ్గా డీల్‌ చేయకపోతే అదే సరైన నిర్ణయం అనుకున్నాము.

కావ్య: మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు.

క్లయింట్‌: అనామిక బిజినెస్‌ ఉమెన్‌ కాదు. ఒక తింగరి బుచ్చి అని అర్థం అయింది మేడం.  

   అని చెప్పగానే కావ్య అయ్యో ఆవిడను అంత తేలిగ్గా తీసిపారేస్తారేంటి అంటుంది. అవును మేడం అంటూ అనామికను తిడతారు. దీంతో అగ్రిమెంట్‌ పేపర్స్‌ తో అందరి దగ్గర సైన్‌ తీసుకోమని శృతికి చెప్తుంది కావ్య. సరేనని అందరూ సైన్‌ చేస్తారు. తర్వాత రాజ్‌ ముందర కావ్యను పొగడ్తలతో ముంచెత్తుతారు. దీంతో రాజ్‌ లోపల ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంటాడు. ఇంతలో కావ్య నన్ను ఇలా మార్చింది ఆయనే నాకు మొదట్లో కంపెనీ గురించి ఏమీ తెలియదు కానీ ఆయనే నాకు అన్ని నేర్పించారు అంటుంది. దీంతో రాజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు అనామిక యాడ్‌ డైరెక్టర్‌ ను పిలిచి కళ్యాణ్‌ మీద డ్యాకుమెంటరీ తీయాలని చెప్తుంది.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BC Census: తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Kurnool News: నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
AP Investments: ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
East Godavari: తూర్పుగోదావరి జిల్లా తాడిపర్రులో ప్రమాదం- ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్‌ షాక్‌- నలుగురు యువకులు మృతి
తూర్పుగోదావరి జిల్లా తాడిపర్రులో ప్రమాదం- ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్‌ షాక్‌- నలుగురు యువకులు మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Failures |  హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP DesamIndia Strategical Failures vs NZ Test Series | గంభీర్ సారు గారి దయతో అప్పన్నంగా అప్పచెప్పాం | ABP DesamRishabh pant out Controversy | రిషభ్ పంత్ అవుటా..నాట్ అవుటా..వివాదం మొదలైంది | ABP DesamInd vs NZ 3rd Test Highlights | భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా వైట్ వాష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Census: తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Kurnool News: నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
AP Investments: ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
East Godavari: తూర్పుగోదావరి జిల్లా తాడిపర్రులో ప్రమాదం- ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్‌ షాక్‌- నలుగురు యువకులు మృతి
తూర్పుగోదావరి జిల్లా తాడిపర్రులో ప్రమాదం- ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్‌ షాక్‌- నలుగురు యువకులు మృతి
Narne Nithin Engagement: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం - సైలెంట్‌గా చేసుకున్న ‘ఆయ్’ హీరో!
ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం - సైలెంట్‌గా చేసుకున్న ‘ఆయ్’ హీరో!
Canada News: కెనడాలో దారుణం- ఆలయంలో హిందువులపై దాడి- ఖలిస్తానీలు గీత దాటారంటూ ఎంపీ వార్నింగ్
కెనడాలో దారుణం- ఆలయంలో హిందువులపై దాడి- ఖలిస్తానీలు గీత దాటారంటూ ఎంపీ వార్నింగ్
APTET Results: ఏపీ టెట్‌ అభ్యర్థులకు బిగ్ అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి, ఇలా చూసుకోండి
ఏపీ టెట్‌ అభ్యర్థులకు బిగ్ అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి, ఇలా చూసుకోండి
Mahindra Thar Roxx: సేల్స్‌లో దూసుకుపోతున్న థార్ - మార్కెట్లో విపరీతమైన డిమాండ్!
సేల్స్‌లో దూసుకుపోతున్న థార్ - మార్కెట్లో విపరీతమైన డిమాండ్!
Embed widget