Brahmamudi Serial Today May 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణికి స్వప్న వార్నింగ్ – రిసార్ట్ లో అన్ని రెడీ చే సిన కళ్యాణ్
Brahmamudi Today Episode: కావ్య ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని ప్రయత్ని స్తున్న రాహుల్, రుద్రాణిలకు స్వప్న వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రిసార్ట్ కు వెళ్లడానికి కావ్య రెడీ అయి కిందకు వస్తుంది. కళ్యాణ్‌కు ఫోన్ చేసి నేను ఇంట్లో బయలుదేరాను మీ అన్నయ్యను తీసుకుని వస్తాను అక్కడ అంతా రెడీగా ఉంది కదా అని అడుగుతుంది. కళ్యాణ్ అంతా రెడీగానే ఉందని చెప్తాడు. హాల్లోకి వచ్చిన కావ్య అందరికీ వెళ్తున్నాను అని చెప్తుంది.
అపర్ణ: సరేమ్మా జాగ్రత్తగా వెళ్లిరా
రుద్రాణి: వాహ్ అద్బుతం మహా అద్బుతం.. మొగుడు కనిపించకపోతే బాధపడాలి. చచ్చిపోయాడని తెలిస్తే ఏడవాలి. కానీ ఈ ఇంట్లో మాత్రం మొత్తం రివర్స్ గా ఉంది. కోడలేమో అసలు దిగులు లేకుండా పార్టీలు, ఫంక్షన్లు అని తిరుగుతుంది. ఇంట్లో వాళ్లేమో ఈజీగా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు
ఇందిరాదేవి: అది వెళ్తే నీకు వచ్చే ప్రాబ్లమ్ ఏంటి?
రుద్రాణి: ఫంక్షన్లు, పార్టీలు అని వెళ్తే.. అక్కడ మొగుడు ఏమయ్యాడు అని అడిగితే అప్పుడు నిజం చెప్పాలి కదా..? నిజం చెబితే పోయేది మన కుటుంబం పరువే కదా లేదంటే ఏదైనా గోల్డ్ మెడల్ సాధించడానికి వెళ్తుందా..?
ఇందిరాదేవి: అవునే అది గోల్డ్ మెడల్ సాధించడానికే వెళ్తుంది.
అపర్ణ: కావ్య నువ్వు అవేవీ పట్టించుకోకు హ్యాపీగా వెళ్లిరా
ఇంతలో కావ్యకు రాజ్ ఫోన్ చేస్తుంటాడు. సరే అత్తయ్యా మామయ్య, బామ్మ వెళ్లి వస్తాను అని చెప్పి కావ్య బయటకు వెళ్లి లాన్‌లో నిలబడి రాజ్‌తో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఇంతలో రుద్రాణి, రాహుల్ వస్తారు.
కావ్య: వీళ్లేంటి ఇలా చూస్తున్నారు. నా మాటలు విన్నట్టా.. విననట్టా..? (మనసులో అనుకుని) ఎంటి అలా చూస్తున్నారు..?
రుద్రాణి: నువ్వేంటి అలా అనుమానాస్పదంగా మాట్లాడుతున్నావు
కావ్య: నాకేం అంత కర్మ పట్టలేదు. నా ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నా..
రాహుల్: అదేంటి కావ్యకు పార్టీ కల్చర్ పడదు కదా
కావ్య: చీరలు కట్టిన వారు చీర్స్ కొట్టకూడదని ఎక్కడైనా ఉందా..? ఏదో దుగ్గిరాల కుటుంబానికి కోడలిగా వచ్చాను కదాని నాలో వెస్ట్రన్ కావ్యను దాచేసి లోకల్ కావ్యను చూపించాను. ఇక ఈరోజు నుంచి అలా ఉండకూడదని నా ఫ్రెండ్స్‌తో గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ఫుల్ ఎంజాయ్ చేసి వస్తాను.
అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. కావ్య ఎక్కడిక వెళ్తుందో మొత్తం తెలుసుకోమని రాహుల్‌కు చెప్తుంది రుద్రాణి. రాజ్, కావ్య కారులో వెళ్తుంటారు. రిసార్ట్ నుంచి తిరిగి వచ్చే లోపు కళావతి మనసులో ఏముందో తెలుసుకోవాలి అని రాజ్, రిసార్ట్ నుంచి తిరిగి వచ్చే లోపు ఏ ప్రమాదం జరగకుండా రాజ్‌కు గతం గుర్తు రావాలని కావ్య మనసులో అనుకుంటారు. రాహుల్, రుద్రాణి కావ్య గురించి ఆలోచిస్తుంటారు. స్వప్న వచ్చి పాపను రుద్రాణి చేతిలో పెడుతుంది.
స్వప్న: అత్తయ్యా మీరు పాపకు తలంటు స్నానం చేయించండి. ఏవండి మీరు బట్టలు వేయండి.
రాహుల్: మరి నువ్వేం చేస్తావు
స్వప్న: నాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా..? అప్పుడప్నుడు మీరు నాన్నమ్మ అయ్యారని గుర్తు చేసుకోండి అత్తయ్యా
స్వప్న వెళ్లిపోతుంది. పాప ఏడుస్తుంది.
రుద్రాణి: ఏయ్ ఏడుపు ఆపవే.. నేనే నలుగురిని ఏడిపిస్తాను.. నువ్వు నన్ను ఏడిపిస్తున్నావా..?
రాహుల్: మమ్మీ కావ్య ఎక్కడికి వెళ్లిందో తెలుసుకునే ప్లాన్ దొరికిం
రుద్రాణి: ఎలా తెలుసుకుంటావు.
రాహుల్: ఇదిగో స్వప్న ఫోన్.. ఇందాక పాపను నీకు ఇస్తున్నప్పుడు చేతిలోంచి కొట్టేశాను. ఇందులో ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ నెంబర్ ఉంటుంది కదా వాళ్లకు ఫోన్ చేస్తే తెలిసిపోతుంది.
అని రాహుల్ అందులోని నందిని అనే అమ్మాయికి ఫోన్ చేస్తే వాళ్లాయన ఫోన్ లిఫ్ట్ చేసి రాహుల్ తిడతాడు. ఎన్నాళ్ల నుంచి మీ మధ్య ఈ యవ్వారం సాగుతుంది నువ్వు ఎక్కడుంటావు చెప్పు అంటూ బెదిరించడంతో రాహుల్ భయంతో కాల్ కట్ చేస్తాడు. మరోవైపు రిసార్ట్ దగ్గర ఉన్న రాజ్ ఫ్రెండ్స్‌కు కళ్యాణ్ నిజం చెప్తాడు. రాజ్‌కు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పి ఎవరెవరు ఎలా యాక్ట్ చేయాలో వివరిస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















