Brahmamudi Serial Today March 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : రాజ్‌పై విరుచుకుపడ్డ దుగ్గిరాల ఫ్యామిలీ, బాబుతో ఆఫీసుకు బయలుదేరిన రాజ్
Brahmamudi Today Episode: రాజ్ వల్ల కంపెనీకి కోటి రూపాయలు నష్టం వచ్చిందని దుగ్గిరాల ఫ్యామిలీ రాజ్ మీద విరుచుకుపడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: బాబుకు స్నానం చేయించడం ఎలాగో తాను చూపిస్తానని రాజ్‌ను, బాబును బయటకు తీసుకొస్తుంది కావ్య. స్నానం చేయించడానికి ముందు ఆయిల్ రుద్దాలని కావ్య చెప్పి ఎలా రుద్దాలో చూపిస్తే రాజ్ కు చేయడం రాదు. దీంతో కావ్యనే బాబును తీసుకుని ఆయిల్ రుద్దుతుంది. ఇది కానీ మీ అమ్మగారు చూశారంటే నా మీద శివాలెత్తుతుందని కావ్య చెప్తుంది. మరోవైపు ప్రకాష్ కు ఆఫీసు నుంచి మేనేజర్ ఫోన్ చేసి రాజ్ చేసిన తప్పుకు కోటి రూపాయలు నష్టం వచ్చిందని చెప్తాడు. దీంతో ప్రకాష్ అన్నయ్యకు చెప్పొద్దని నేనే మేనేజ్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇదంతా పై నుంచి విన్న అనామిక, రుద్రాణి వెంటనే ఈ విషయం మీ అత్తయ్యకు చెప్పాలని వెళ్లి ధాన్యలక్ష్మీకి మొత్తం చెప్తుంది రుద్రాణి. దీంతో కోపంగా దొరికింది మా అక్క.. ఆ రోజు మా ఆయన 50 లక్షలు లాస్ చేశారని భార్యాభర్తలు అంత గొడవ చేశారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో నేను చూస్తాను అని కోపంగా కిందకు వెళ్తుంది. కింద సుభాష్ ఫోన్ మాట్లాడి కట్ చేసి..
సుభాష్: ఒరే ప్రకాష్ ఆ అలంకృత జ్యూవెల్లర్స్ వారి ఆర్డర్స్ మధ్యలోనే ఆపేశారట ఎందుకు?
ప్రకాష్: వాళ్ల మొహం అన్నయ్యా అది కాకపోతే ఇంకో కంపెనీకి సప్లయ్ చేస్తాం..
సుభాష్: నేను అడిగింది వీళ్ల గురించి..
ప్రకాష్: అది నేను రేపు వెళ్లి చూసుకుంటానులే అన్నయ్యా..
ధాన్యలక్ష్మీ: రేపటిదాకా మీకు గుర్తుండాలి కదండి.. బావగారికి కారణం ఇప్పుడే చెప్పండి.
ప్రకాష్: ఏయ్ నువ్వు ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు.
ధాన్యలక్ష్మీ: మీరెందుకు ఈ విషయంలో నిజం దాస్తున్నారు. ఎవర్ని కాపాడటానికి
అనగానే ప్రకాష్ అది నీకు అనవసరం అనగానే సుభాష్ ఇంతకీ ఏం జరిగింది. ధాన్యలక్ష్మీ ఏం మాట్లాడుతుంది. అనగానే ప్రకాష్ ఏమీ లేదని చెప్తాడు. దీంతో ధాన్యలక్ష్మీ రాజ్ కంపెనీ విషయాలు పట్టించుకోకపోవడం వల్ల మన కంపెనీకి కోటి రూపాయలు లాస్ వచ్చింది అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. దీంతో అందరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఇంతలో రాజ్ పైనుంచి వస్తాడు. లాస్ నా వల్లే జరిగింది. ఈ సంవత్సరంలో నేను కంపెనీకి ఎన్నో లాభాలు తీసుకొచ్చాను. ఇప్పుడు కొంత లాస్ వచ్చింది అది ఒక్క నెలలో పూడ్చేస్తానని రాజ్ చెప్పి కుటుంబంలో వచ్చిన కలహాల గురించి బాధపడతాడు.
అపర్ణ: రాజ్ పాలకుండ లాంటి ఈ కుటుంబంలో విషపు చుక్క పడింది. అది లాభమా? నష్టమా? నీ వారసత్వంలోనే అపశృతి దొర్లింది ఈ ఇంటి పునాదులతో సహా పెకిలించుకుంటూ ఒక రావి మొక్క మొలిచింది. అది లాభమా? నష్టమా?
అంటూ రాజ్‌ను అడిగి అపర్ణ వెళ్లిపోతుంది. మరోవైపు పోలీస్ సెలెక్షన్స్ లో రిటన్ టెస్ట్, పిజికల్ టెస్ట్ లో పాసయ్యారని త్వరలోనే మీకు మెయిల్ వస్తుందని పోలీస్ ఆఫీసర్ అప్పుకు చెప్పగానే అప్పు హ్యాపీగా ఫీలవుతూ బయటకు వస్తుంది.
బ్రోకర్: ఏంటి మేడం చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు.
అప్పు: లంచం ఇవ్వకుండా ఏ పని జరగదు అన్నావు. అసలు నేను పోలీస్ అవ్వలేను అన్నావు చూశావా? నా కష్టంతో ఎంతదూరం వచ్చానో
బ్రోకర్: చాలా దూరం వచ్చారు కానీ చివరిలో ఆగిపోతారు. పర్సనల్ ఇంటర్వ్యూ అవ్వలేదుగా.. మెయిల్ వస్తుందని చెప్పారా? మీరు చెప్పింది నిజమే మీ లాంటి యంగ్ టాలెంట్ ను బాగానే ఎంకరేజ్ చేస్తారు. కానీ మధ్యలో కొంత మంది ఉంటారు. నాలాంటి నీచులు.. మీకు మెయిల్ రావాలి అంటే లోపల మావాడు ఉన్నాడు వాడికి లంచం ఇస్తేగానీ మీకు మెయిల్ రాదు.
అంటూ బ్రోకర్ మీరు పైసా ఖర్చు పెట్టకున్నా సరే జస్ట్ ఒక్క నైట్ మావాడిని శాటిఫై చేస్తే చాలు అనగానే బ్రోకర్ కాలర్ పట్టుకుని వార్నింగ్ ఇస్తుంది అప్పు. మరోవైపు రాజ్ బాబును తీసుకుని ఆఫీసుకు వెళ్తుంటే కావ్య వెళ్లి మీరు ఇలా ఆఫీసుకు వెళ్తే ఆఫీసులో మీకున్న రెస్పెక్ట్ పోతుందని ఇలా వెళ్లోద్దని చెప్తుంది. ఆ బిడ్డకు తల్లి ఎవరో చెప్పమని అడుగుతుంది. దీంతో రాజ్, కావ్యను ఆఫీసుకు రమ్మని అడుగుతాడు. అయితే ఏ హోదాలో రావాలని కావ్య అడుగుతుంది. డిజైనర్ గా రమ్మని రాజ్ చెప్తాడు. దీంతో సరే వస్తానని కావ్య అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: బ్లాక్ డ్రెస్‌లో దీప్తి సునయన సోకుల విందు - ఆమెను ఇలా చూసి మనసు పారేసుకుంటున్న కుర్రకారు