Brahmamudi Serial Today May June 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: పెళ్లి వద్దన్న రాజ్ - యామిని సూసైడ్ అటెంప్ట్
Brahmamudi Today Episode: యామినిని దోషిగా ప్రూవ్ చేయాలనుకున్న అప్పు దగ్గర ఏ ఎవిడెన్స్ లేకపోవడంతో సైలెంట్‌గా ఉండిపోతుంది. దీంతో వైదేహి కోపంగా అప్పును తిడుతుంది.

Brahmamudi Serial Today Episode: యామినిని దోషిగా ప్రూవ్ చేయాలనుకున్న అప్పు దగ్గర ఏ ఎవిడెన్స్ లేకపోవడంతో సైలెంట్‌గా ఉండిపోతుంది. దీంతో వైదేహి కోపంగా అప్పును తిడుతుంది.
వైదేహి: మీకు ఇంకా అర్థం కాలేదా అల్లుడుగారు. చేయని తప్పుకు నా కూతురుని ఇరికించి తనని అరెస్ట్ చేయించి ఈ పెళ్లి ఆపాలని చూసింది ఈ అప్పు
శేషు: మేడం మీరు అనవసరంగా అప్పు గారి మీద నిందలు వేయకండి
అప్పు: శేషు గారు పూర్తి సాక్ష్యాలు లేకుండా ఇతన్ని తీసుకుని ఇంతదూరం తీసుకురావడం మన తప్పు అతన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లండి
శేషు రౌడీని తీసుకుని వెళ్లిపోతాడు.
వైదేహి: వావ్ చాలా బాగా నటిస్తున్నావు అప్పు. అసలు నాకు మీ ఫ్యామిలీ మీదే అనుమానంగా ఉంది. పెళ్లి పనులు మొదలు పెట్టినప్పటి నుంచి అన్ని ఆటంకాలే వస్తుంటే.. ఎందుకిలా జరగుతుంది అనుకున్నాను. ఇప్పుడు నువ్వు చేసింది చూస్తుంటే.. అవి కూడా మీ వాళ్లే చేసి ఉంటారని అనిపిస్తుంది.
యామిని: నేను మీకేం ద్రోహం చేశాను.. ఇలా అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టి ఈ పెళ్లిని ఆపాలనుకున్నారు. చిన్నప్పటి నుంచి మా బావే నా ప్రాణం అని బతుకుతూ తననే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. అది తప్పా.. మాకు నిశ్చితార్థం అయ్యాక బావ యాక్సిడెంట్‌లో కోమాలోకి వెళితే ఆరు నెలలు తన దగ్గరే ఉంటూ సేవ చేస్తూ తన కోసం ఎదురుచూశాను అది నా తప్పా..? నా ప్రేమనంతా తనకు ఇవ్వాలనుకున్నాను అది నా తప్పా..?
రుద్రాణి: ఫర్మామెన్స్ ఇరగదీస్తుంది కదా..? దీంతో రాజ్ పెళ్లి చేసుకోవడం ఖాయం.
రాహుల్: మనకు కావాల్సింది కూడా అదే కదా మమ్మీ
యామిని: ఇంకా నేను చేసిన తప్పేంటి నా మీద ఎందుకు ఇంత కక్ష్య కట్టారు.
కనకం: చాలు ఆపవే నువ్వేంటో మీ ఫ్యామిలీ ఏంటో మీరు ఆడుతున్న నాటకాలేంటో నాకు తెలియదు అనుకుంటున్నారా..? మా అల్లుడు గారి గురించి ఆలోచిస్తున్నాను కానీ లేకపోతే ఈ పాటికి మీకు ఇత్తడి అయిపోయేది.
కావ్య: ఆవేశంలో అమ్మ అన్ని నిజాలు చెప్పేసేలా ఉంది. ఆయనకు గతం గుర్తు చేస్తే ఇంకేమైనా ఉందా..? ( మనసులో అనుకుంటుంది) అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు ఇంకొక్క మాట నువ్వు మాట్లాడినా నా మీద ఒట్టు.. అప్పు అమ్మను ఇక్కడి నుంచి తీసుకెళ్లు
అప్పు, కనకాన్ని తీసుకుని బయటకు వెళ్లిపోతుంది.
వైదేహి: తెలివిగా నీ తల్లిని నీ చెల్లితో బయటకు పంపించేశావు. మరి ఆవిడ వేసిన నిందల సంగతి ఏంటి..?
కావ్య: వైదేహి గారు మీకు కావాల్సింది మీ కూతురు జీవితం నిలబడటమా..? లేక నా చెల్లి చెప్పే సమాధానాలా..? రామ్ గారు మీరు యామిని ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా..?
రాజ్: నమ్ముతున్నాను
కావ్య: విన్నావు కదా యామిని ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు సంతోషంగా పెళ్లి చేసుకో
ఇందిరాదేవి: ఓసేయ్ ఏం మాట్లాడుతున్నావే
కావ్య: అమ్మమ్మ గారు ఇప్పటి వరకు మీరందరూ చేసింది చాలు దయచేసి ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడకండి.. కూర్చో యామిని పెళ్లి పీటల మీద కూర్చో
యామిని: థాంక్యూ కళావతి గారు మీరైనా నా బావ మీద నాకున్న ప్రేమను అర్థం చేసుకున్నారు. చెప్పాను కదే జీవితంలో మొదటిసారి నువ్వు నా చేతిలో ఓడిపోతున్నావు.
కావ్య: నేను అదే చెప్తున్నాను యామిని ఈ పెళ్లి జరగదు
యామిని భయంతో వెళ్లి పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. పంతులు తాళిబోట్టు రాజ్‌కు ఇచ్చి మాంగళ్య దారణ చేయమని చెప్తాడు. రాజ్ తాళి తీసుకుని కట్టబోతూ కిందపడేసి యామినికి సారీ చెప్పి మండపంలోంచి వెళ్లిపోతాడు. అందరూ షాక్ అవుతారు. దుగ్గిరాల ఫ్యామిలీ మాత్రం హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత ఇంటికి వెళ్లి పార్టీ చేసుకుంటారు. పెళ్లి ఆగిపోవడంతో యామిని రూంలోకి వెళ్లి సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తుంది. దీంతో వైదేహి కోపంగా రాజ్‌ను తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















