Brahmamudi Serial Today June 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: మాయ కోసం రంగంలోకి దిగిన రాజ్, కావ్య - అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి
Brahmamudi Today Episode: కళ్యాణ్, అనామిక కాపురంలో చిచ్చుపెట్టేందుకు రుద్రాణి ప్లాన్ వేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: అనామిక మాటలను గుర్తు చేసుకుంటూ అపర్ణ బాధపడుతుంది. సుభాష్ వచ్చి చిన్న పిల్ల తెలియదు అంటూ ఓదారుస్తాడు. అయితే ఇదంతా ఎవరి వల్ల జరిగింది అంటూ నిలదీస్తుంది అపర్ణ. తప్పు చేసింది నేను శిక్ష కూడా నేనే అనుభవిస్తాను అని సుభాష్ అంటే మీతో తాళి కట్టించుకున్నందుకు నేను కూడా భరించాల్సిందేనని అపర్ణ వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్ కోపంగా కావ్య మీద అరుస్తుంటాడు.
రాజ్: మాయ మాయ అంటూ తిరిగి లంకకు నిప్పు పెట్టినట్టు నా ఇంటికి నిప్పు పెట్టావు కదే..
కావ్య: నిప్పంటే గుర్తొచ్చిందండి నేను నిప్పు లాంటి దాన్ని ఇప్పుడు మీరు నా జీవితంలో నిప్పులు పోస్తారా? నా శీలాన్ని దోచుకుంటారా?
రాజ్: మా నాన్నని అందరి ముందు దోషిలా నిలబెట్టావు. మా అమ్మను హాస్పిటల్ పాలు చేశావు. ఇంకా నీ ప్రయత్నాలు ఆపవా?
కావ్య: నీ ప్రయత్నాలు మధ్యలోనే ఆపకండి. రండి..
అంటూ కావ్య రొమాంటిక్‌గా దగ్గరకు తీసుకుంటుంటే రాజ్ కంగారుపడతాడు. కావ్య నుంచి తప్పించుకుని దూరంగా జరుగుతాడు. అంతా నీవల్లే జరిగిందని కోప్పడతాడు. అదంతా కాదు మనిద్దరం వెళ్లి నిజమైన మాయను పట్టుకుందామని కావ్య చెప్పగానే సరే వెళ్దాం పద అంటాడు రాజ్. మరోవైపు అనామికను రుద్రాణి మెచ్చుకుంటుంది.
రుద్రాణి: కంగ్రాచ్చులేషన్స్ అనామిక మొత్తానికి అప్పు, కళ్యాణ్ లను పర్మినెంట్‌గా విడగొట్టావు.
అనామిక: ఇది నేను ఒక్కదాన్నే సాధించలేదు కదా ఆంటీ. మీ సాయం కూడా ఉంది కదా? వాళ్లు అక్కడికి వెళ్తున్నారని మీరు చెప్పకపోతే నాకు తెలిసేది కాదు కదా?
రుద్రాణి: ఈ కాలంలో ఇన్మర్మేషన్ ఎవరైనా ఇస్తారు. కానీ అనుకున్నది అనుకున్నట్లు చేయడం గ్రేట్..
అనామిక: ఇక వీళ్లు కలవాలనుకున్నా సరే ఈ రెండు కుటుంబాలు వీళ్లను కలవనివ్వవు.
రాహుల్: మా మమ్మీనే అనుకున్నాను కానీ మా మమ్మీ కంటే మించిపోయావు అనామిక నువ్వు.
అనామిక: ఇప్పుడేం చూశావు రాహుల్ ఇక మీదట చూడు ఏం చేస్తానో..
ALSO READ: మీడియాపై హీరో సిద్దార్థ్ ఫైర్ - అలా సౌండ్ చేయకు.. నాకు నచ్చదు
అనగానే రుద్రాణి నువ్వు ఏమైనా చేసుకో కానీ కళ్యాణ్‌తో గొడవ పెట్టుకోకు అంటుంది. నువ్వు కళ్యాణ్ హ్యాపీగా ఉండాలి అనగానే కళ్యాణ్, అప్పును కలవడు కాబట్టి ఇక నాగుప్పిట్లో ఉండేలా చేస్తాను అని వెళ్లిపోతుంది. ఏంటి మమ్మీ నీతులు చెప్తూ మంచిగా ఉండమని చెప్తున్నావు అని రాహుల్ అడగ్గానే వాళ్లిద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకే ఇలా మాట్లాడానని రుద్రాణి చెప్తుంది. మరోవైపు కనకం అప్పును ఇంటికి తీసుకెళ్లి వారిస్తుంది. డబ్బులున్న వారితో తిరిగితే ఎప్పుడు ఏమౌతుందోనని భయపడుతుంది. మూర్తి కనకాన్ని ఓదారుస్తాడు. జరిగిపోయిన దాని గురించి బాధపడటం కన్నా జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం అంటాడు. కనకం ఆలోచిస్తూ ఉండిపోతుంది. మరోవైపు ఆందోళనగా ఆలోచిస్తుంటే కళ్యాణ్ వస్తాడు.
అనామిక: కళ్యాణ్ నేను నీకోసమే ఎదురుచూస్తున్నాను.
కళ్యాణ్: ఇందాకా చేసిన గొడవ సరిపోలేదా?
అనామిక: నీకు అది గొడవలా అనిపించిందా?
కళ్యాణ్: బుద్ది ఉన్నవాడెవడైనా దాన్ని గొడవే అంటాడు.
అనామిక: కానీ నేను ఇప్పుడు నీతో గొడవ పడాలనుకోవడం లేదు.
కళ్యాణ్: అసలు నేను నీతో మాట్లాడాలని అనుకోవడం లేదు.
అనగానే అనామిక ఇలా మాట్లాడే ఇంతదూరం తీసుకొచ్చావు. జరిగిందేదో జరిగిపోయింది. అంతా మర్చిపోదాం. అప్పు గురించి నేను మాట్లాడను..ఇక నువ్వు మాట్లాడకు అంటుంది. నేను నిన్ను నమ్మను నేను తప్పు చేయలేదని నిజం నిరూపిస్తానని.. మేము హోటల్ కు వెళ్లిన విషయం నాకు అప్పుకు మాత్రమే తెలుసు కానీ మీకు, మీడియాకు ఎవరు చెప్పారు. ఇదంతా ఎవరో కావాలనే చేశారు. వాళ్లందర్ని బటయకు లాగుతానని కళ్యాణ్ వెళ్లిపోతాడు. మరోవైపు రాజ్, కావ్య కలిసి మాయ కోసం వెతుకుతుంటారు. మరోవైపు రౌడీలు రుద్రాణికి ఫోన్ చేసి మాయ తప్పించుకుందని ఫోన్ చేస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.