Brahmamudi Serial Today May June 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రంగంలోకి దిగిన కనకం – పంతులుకు స్పాట్ పెట్టిన కనకం
Brahmamudi Today Episode: పెళ్లి ఎలాగైనా చేసి తీరతాన్న పంతులును కట్టడి చేసేందుకు అపర్ణ, కనకాన్ని పిలుస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: పెళ్లి పనులు మొదలు పెడతారు. పంతులు పూజలు చేయిస్తుంటాడు. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం బాధగా చూస్తుంటుంది. కావ్య మాత్రం పెళ్లి ఆగిపోతుందన్న ధైర్యంతోనే ఉంటుంది.
పంతులు: అమ్మా హారతి ఇచ్చి వినాయకుడిని మనసులో మొక్కుకుని పెళ్లిలో ఏలాంటి విగ్నాలు జరగకుండా చూడమని వేడుకోండి
ఇందిరాదేవి: ఏర్పాట్లన్నీ సక్రమంగా చేస్తే విఘ్నాలు ఎందుకు వస్తాయి శాస్త్రి గారు
పంతులు: వస్తాయని కాదమ్మా.. రాకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. అయినా పెద్దవారు అయ్యుండి మీరు ఇలాంటి ప్రశ్న అడగడం విడ్డూరంగా ఉంది
ఇందిరాదేవి: పెద్దవారైనంత మాత్రాన సందేహాలు రావా ఏంటి..?
పంతులు: మీ సందేహాలు అన్ని పక్కన పెట్టి ముందు హారతి ఇవ్వండి
యామిని: కళావతి గారు మీరు వచ్చి హారతి ఇవ్వండి. మీ ఫ్రెండ్ పెళ్లిని దగ్గరుండి జరిపిస్తానని మాటిచ్చారు కదా
కావ్య: ఎందుకంత కంగారు పడతావు యామిని పెళ్లి దగ్గరుండే జరిపిస్తాను.. ముందు హారతి పెద్దవాళ్ల చేత ఇప్పించాలి. అది మీ అమ్మతో ఇప్పించు
ఇందిరాదేవి: అవును హారతి పెద్దవాళ్లు ఇస్తేనే బాగుంటుంది
పంతులు వైదేహిని పిలిచి హారతి ఇవ్వమంటాడు. వైదేహి దంపతులు వచ్చి హారతి ఇస్తుంటే.. అప్పు, కళ్యాణ్ తాము అరెంజ్ చేసిన మనుషులకు సైగ చేస్తారు. వాళ్లు వైరు లాగగానే కర్ర విరిగిపోతుంది.
ఇందిరాదేవి: అపశకునం ఇక్కడ ఇంత జరుగుతుంటే ముత్తయిదువులు మీరేం అనరేంటి
ముత్తయిదువులు: అయ్యయ్యో అపశకునం.. ఇక ఈ పెళ్లి జరగకూడదు జరిగితే మంచిది కాదు
ధాన్యలక్ష్మీ: అవును నాకు తెలిసిన వాళ్ల పెళ్లిలో ఇలాగే జరిగితే వినకుండా అలాగే పెళ్లి చేశారు. కానీ సంవత్సరం తిరిగే లోపు వాళ్లు విడిపోయారు
అపర్ణ: ఇవన్నీ వింటుంటే నాకు అనుమానం వస్తుంది అత్తయ్యా యామిని చెప్పినట్టు వాళ్లకు నిశ్చితార్థం అవ్వగానే రామ్‌కు యాక్సిడెంట్ అవ్వడం. కోమాలోకి వెళ్లి ఆరు నెలల తర్వాత రావడం. మళ్లీ ఇప్పుడు పెళ్లి అని ఏర్పాట్లు చేయగానే ఇలా పెళ్లి నాటు విరిగిపోవడం ఇదంతా చూస్తుంటే అసలు ఈ పెళ్లి చేయడం కరెక్టేనా అనిపిస్తుంది
యామిని: శాస్త్రి గారు వాళ్లు అలా చెప్తుంటే మీరేమీ మాట్లాడరేంటి ఇదంతా నిజమేనా..?
పంతులు: అమ్మా నేను ఒకసారి పంచాంగం చూసి ముహూర్తం పెట్టానంటే అలాంటివేం జరగవు
ఇందిరాదేవి: అయితే ఇలా ఎందుకు జరిగింది
పంతులు: ఏవో దుష్ట శక్తులు ఈ పెళ్లిని ఆపాలని చూస్తున్నాయి
ప్రకాష్: దుష్టశక్తులు ఆపుతున్నాయో లేక ఈ పెళ్లి జరగడమే దురదృష్టమో సరిగ్గా ఆలోచించి చెప్పండి పంతులు గారు ఎందుకంటే రెండు జీవితాలు ముడిపడ్డాక మనం ఏమీ చేయలేం కదా పంతులు గారు
ధాన్యలక్ష్మీ: అవును పంతులు గారు వీళ్ల జాతకంలో ఏదైనా దోషం ఉందేమో ఒకసారి చూస్తే మంచిది కదా
పంతులు: చూడండి కర్ర అన్నాక విరుగుతుంది. పడవ అన్నాక మునుగుతుంది. దానికే మీరింతలా రాదాంతం చేయడం ఎందుకమ్మా
ఇందిరాదేవి: పడవ మునిగితే పర్వాలేదు శాస్త్రి గారు అందులో మనుషులు ఉంటేనే ప్రమాదం కదా అసలే నా మనవడు యాక్సిడెంట్ అయి చావు వరకు వెల్లి వచ్చాడు. ఏ కీడు లేకుండానే.. ఈ కర్ర ఎందుకు విరిగింది.
పంతులు: అయితే మీరు ఇంత భయపడుతున్నారు కాబట్టి ఆ దుర్గా మాతకు కుంకుమార్చన చేస్తే ఎటుంటి దోషాలు ఉన్నా పోతాయి
అని పంతులు చెప్పగానే యామిని, వైదేహి వెంటనే కుంకుమార్చన చేద్దాం అంటారు. సరే అంటూ పూజ చేయడానికి వెళ్తారు. అపర్ణ, ఇంద్రాదేవి పెళ్లిని ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ కనకం రావాలి అంటారు. వెంటనే కనకం ప్రత్యక్షమవుతుంది. అందరి మీద అరుస్తుంది. ఇంత జరుగుతున్నా నాకెందకు చెప్పలేదని కోప్పడుతుంది. యామినిని చంపేస్తా.. పొడిచేస్తా అంటుంది. అంత వద్దు కానీ మేము చెప్పి నట్టు చేయి చాలు అంటారు అపర్ణ, ఇందిరాదేవి. సరే అంటుంది కనకం. లోపలికి వెళ్లి పంతులును చూసి ఈయనది మా కాలనీయే ఈయన వీక్‌నెస్ నాకు తెలుసు అంటుంది కనకం. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















