Brahmamudi Serial Today May July 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాహుల్‌కు చుక్కలు చూపించిన స్వప్న – ఆస్థి కోసం రుద్రాణి కొత్త ప్లాన్
Brahmamudi Today Episode: ఇంట్లో పనోడిగా మారిపోయిన రాహుల్‌కు స్వప్న చుక్కలు చూపించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: రాజ్ తనలో తాను హ్యాపీగా ఫీలవుతుంటాడు. కావ్యే స్వయంగా రాత్రికి ఇంట్లో ఉండమన్నందుకు దేవుడికి థాంక్స్ చెప్పుకుంటాడు. ఇంతలో కావ్య వచ్చి రాజ్‌ను తీసుకుని రూంలోకి వెళ్లి ఫైల్స్ చూపిస్తుంది. ఇవన్నీ ఇవాళ ఒక్కరోజే నువ్వు స్టడీ చేయాల్సిన ఫైల్స్ అని చెప్తుంది. రాజ్ మొదట ఇరిటేటింగ్‌గా ఫీలయినా కావ్య దగ్గరే కూర్చుని చెప్పడంతో రాజ్ ఫైల్స్ చూస్తుంటాడు. ఇంతలో కావ్య నిద్రపోతుంది. కొద్దిసేపటికి రాజ్ కూడా నిద్రపోతాడు. తెల్లారేసరికి అపర్ణ, ఇందిరాదేవి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే కావ్య, రాజ్ ఒకరి మీద ఒకరు పడుకుని నిద్ర పోతుంటారు.
ఇందిరాదేవి: కళావతి, ఓరేయ్ మనవడా లేవరా..? ట్రైనింగ్ అన్నారు ఇద్దరు ఏం చేస్తున్నారు
కావ్య: అమ్మమ్మ నాకు ఆఫీసకు టైం అవుతుంది వెళ్లాలి
రాజ్: నాకు కూడా ఆఫీసకు టైం అవుతుంది బై
అంటూ వెళ్లిపోతారు. అపర్ణ, ఇందిరాదేవి నవ్వుకుంటారు. మరోవైపు అప్పు ఆఫీసుకు రెడీ అవుతుంది. ఇంతలో కళ్యాణ్ వస్తాడు.
కళ్యాణ్: ఏంటి పొట్టి పొద్దునే అంత చిరాకుగా మాట్లాడుతున్నావు
అప్పు: ఏం లేదు కూచి మొన్న స్టేషన్ ముందు ఇద్దరు డబ్బుల గురించి గొడవ పడ్డారు. ఆ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేశాను. ఇప్పుడు వాడు డబ్బులు ఇస్తాను అది నా చేతుల మీదుగానే ఇవ్వాలని అడిగాడు
కళ్యాణ్: మీ పోలీసులు అందరూ ఇలాగే ఉంటారో.. నువ్వు మాత్రమే ఇలాగే ఉంటావో నాకు మాత్రం అర్థం కావడ లేదు పొట్టి
అప్పు: ఇప్పుడు ఏమైంది కూచి
కళ్యాణ్: ఏం లేదు పొట్టి నువ్వు అందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు కానీ నా ప్రాబ్లమ్ మాత్రం సాల్వ్ చేయడం లేదు
అప్పు: ఇప్పుడు నీకొచ్చిన ప్లాబ్లమ్ ఏంటి కూచి
కళ్యాణ్: ఏంటి నాకు ఏం ప్రాబ్లమ్ ఉందా..? కొత్తగా పెళ్లైన మొగుడు భార్యకు దూరంగా ఉండటం ఎంత నరకమో నీకేం తెలుసు పొట్టి ఒకసారి నా ప్లేస్‌లో ఉండి చూడు నా బాధేంటో తెలుస్తుంది
నీ ఇష్టం కూచి నువ్వు ఎన్నైనా చెప్పు నాకైతే ఆఫీసుకు టైం అవుతుంది నేను వెళ్తున్నాను బై అంటూ అప్పు వెల్లిపోతుంది. మరోవైపు రాహుల్‌ను గార్డెన్ లో దగ్గరుండి మరీ పని చేయిస్తుంది స్వప్న. ఇంతలో రుద్రాణి వస్తుంది.
రాహుల్: మమ్మీ అది మరీ బ్రహ్మ రాక్షసిలా ఉంది మమ్మీ నా చేత పనులన్నీ చేయించి నన్న చంపేసేలా ఉంది మమ్మీ
రుద్రాణి: కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. నువ్వు చేతులారా చేసుకున్నది నిన్ను వదిలిపెట్టదు
రాహుల్: మమ్మీ నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి..? నేనేమన్నా ఇలా అడ్డంగా దొరికిపోతానని ఎక్స్‌ఫెక్ట్ చేశానా..?
రుద్రాణి: దొరక్కపోతే ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నావా..? ఇడియట్.. మనలాగా ఆస్థి పిచ్చి ఉన్నవాళ్లకు ఆడదాని పిచ్చి ఉండకూడదురా ఉంటే అడ్డంగా ముంచేస్తారు
రాహుల్: తప్పై పోయింది మమ్మీ ఈ ఒక్కసారికి నన్ను సేవ్ చేయ్ మమ్మీ
రుద్రాణి: సరే ఈ రోజు కంపెనీలో జరిగే మీటింగ్స్‌లో ఆ కావ్య పవర్స్ అన్ని పోతాయి. అప్పుడు వాళ్లు మనతో కాదు మనం వాళ్లతో ఆడుకోవచ్చు అంతవరకు ఓపిక పట్టు
అంటూ రుద్రాణి వెళ్ళిపోతుంది. సిద్దార్థకు ఫోన్ చేసిన యామిని రాజ్ ఆఫీసుకు వస్తున్నాడని చెప్తుంది. దీంతో సిద్దార్థ భయపడతాడు. రాజ్ అఫీసుకు వస్తే నేను ఆ కంపెనీ దక్కించుకోవడం కాదు. నా షేర్స్ మొత్తం వాడు లాగేసుకుంటాడు అనగానే యామిని కూల్‌గా రాజ్‌కు గతం గుర్తు లేదు. ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు రాజ్‌తో ఆడుకోవచ్చు అని చెప్తుంది. మరోవైపు ఇంట్లో కావ్య రెడీ అయి కిందకు వస్తుంది. తర్వాత రాజ్ కూడా రెడీ అయి కిందకు రాగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















