Brahmamudi Serial Today May July 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేవతిని చూసిన రుద్రాణి – ఎమోషనల్ అయిన రేవతి
Brahmamudi Today Episode: జగదీష్ ను ఫాలో అయిన రాహుల్, రుద్రాణిలు రేవతిని చూస్తుండగానే.. రేవతికి అపర్ణ ఫోన్ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: రేవతి గురించి అపర్ణకు ఎలా చెప్పాలా అని కావ్య ఆలోచిస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన రాజ్ ఆశ్చర్యంగా చూస్తూ కళావతి గారు మీకో మాట చెప్తాను ఏమీ అనుకోరు కదా అని అడుగుతాడు. ఏంటో చెప్పండి రామ్ గారు అంటుంది కావ్య.
రాజ్: మీకు కొంచెం కూడా బుద్ది లేదండి
కావ్య: ఏంటండి రామ్‌గారు అంత మాట అనేశారు
రాజ్: అవునండి అప్పు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. రేపు మీ అక్క కూతురు బర్తుడే ఉంది. ఇలాంటి టైంలో ఎలా ఉండాలి..
కావ్య: నేను ఆలోచిస్తుంది అత్తయ్య గురించి
రాజ్: అమ్మ గురించా..? అమ్మకు ఏమైంది..?
ఏం లేదండి అంటూ రేవతి గురించి మొత్తం చెప్తుంది కావ్య.
రాజ్: ఏంటి కలావతి గారు మీరు చెప్పేది. రేవతి అక్కా అమ్మ కూతురా..? వాళ్లిద్దరి మధ్య ఇంత ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఉందా..? అది తెలియకుండానే నేను వరుసలు కలిపేసుకుని అక్కా అంటున్నానా..? చూశారా కళావతి గారు దేవుడు ఎన్ని విచిత్రాలు చేస్తున్నాడు
కావ్య: అందుకే రామ్ గారు మనం ఇప్పుడు ఒక పని చేయాలి. విడిపోయిన వాళ్లిద్దరిని మనమే కలపాలి
రాజ్: కానీ కలవడం అమ్మ ఇష్టం లేదు కదా
కావ్య: కానీ రేవతి గారికి ఇష్టం ఉంది
రాజ్: ఓ అదొకటి ఉందా..? అయితే ఇంకేం ఎలాగూ ఇంట్లో ఫంక్షన్ ఉంది.. రేవతి అక్కా కూడా సిటీలోనే ఉంది. వెళ్లి పిలిచేద్దాం.. దాంతో అక్క ఇంటికి వచ్చేస్తుంది. ఫంక్షన్ ఆనందంలో ఉన్న అమ్మకు కూతురు కనిపించగానే ఆ ఆనందం డబుల్ అయిపోతుంది. కూతురుతో కలిసిపోతుంది
కావ్య: అంత సింపుల్ అయితే నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తాను రామ్‌గారు. ఇందులో ఒక చిక్కు ఉంది. రేవతి గారు అత్తయ్యను కలవాలని ఎంత ఆరాట పడుతున్నారో అంతకన్న మొండిగా అమ్మ పిలిస్తేనే వస్తానని ఉన్నారు. నేను పిలిచినా రానంటున్నారు
రాజ్: మీ ఆడవాళ్లతో వచ్చిన ప్రాబ్లమే ఇది కళావతి గారు.. అవ్వ కావాలి బువ్వ కావాలి అంటారు. ఎలా సాధ్యం చెప్పండి
కావ్య: అదే కదండి నా బాధ
రాజ్: మీరు బాధ పడితే నేను బాధపడతాను. అమ్మే అక్కను పిలిచేలా ప్లాన్ చేద్దాం
అంటూ రాజ్ ఒక ప్లాన్ చెప్తాడు. ప్లాన్ బాగుందని కావ్య మెచ్చుకుంటుంది. రాజ్ సిగ్గుతో వెళ్లిపోతాడు. మరోవైపు జగదీష్‌ను ఫాలో అవుతున్న రాహుల్, రుద్రాణి రేవతిని చూస్తారు. షాక్ అవుతారు. ఇది ఇదే ఊళ్లో ఉంటే ఆ ఇంటికి ఎప్పుటికైనా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఈ ఊళ్లో లేకుండా చేయాలి అని రుద్రాణి రాహుల్‌కు చెప్తుంది. తమ ప్లాన్ ప్రకారం రాజ్, కావ్య కలిసి రేవతికి అపర్ణ చేత ఫోన్ చేయిస్తారు. మరోవైపు జగదీష్… కావ్య కాల్ చేస్తుందని ఫోన్ తీసుకొస్తాడు. ఆ మాటలు విన్న రుద్రాణి మరింత షాక్ అవుతుంది. ఇదేంటి దీనికి కాల్ చేయడం ఏంటని భయపడుతుంది. ఇంతలో రేవతి కాల్ లిప్ట్ చేసి హలో కళావతి అనగానే.. నేను కళావతి కాదు వాళ్ల అత్తయ్య అపర్ణను అని చెప్తుంది. దీంతో రేవతి షాకింగ్ గా చూస్తుండి పోతుంది. లౌడ్ స్పీకర్‌లో మాట్లాడటంతో ఆ విషయం రుద్రాణి కూడా విని మరింత షాక్ అవుతుంది. అపర్ణ మాత్రం రేవతిని బర్తుడే పార్టీకి రమ్మని పిలుస్తుంది. అలాగేనని రేవతి కాల్ కట్ చేస్తుంది. అంతా గమనించిన రుద్రాణి వెంటనే దీన్ని ఊర్లో లేకుండా వీళ్లకు టచ్‌లో లేకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!



















