Brahmamudi Serial Today July 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ, సుభాష్ లను కలిపిన కావ్య – అప్పుకు కళ్యాణ్ తో పెళ్లి చేయండన్న పంతులు
Brahmamudi Today Episode: అపర్ణ, సుభాష్ లను కలిపేందుకు కావ్య, రాజ్ ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కావ్య, రాజ్ ఇద్దరూ కలిసి కళ్యాణ్ గురించి ఆలోచిస్తుంటారు. కళ్యాణ్ బాధను ఎలా తగ్గించాలని ప్లాన్ చేస్తుంటారు. రేపు అపర్ణ, సుభాష్ ల పెళ్లి రోజు అని ఈ అకేషన్‌ను ఉపయోగించుకుని ఇంట్లో అందరిని హ్యాపీగా ఉంచాలని అనుకుంటారు. తర్వాత కనకం ఇంట్లో అప్పు గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. మూర్తి వచ్చి కనకాన్ని ఓదారుస్తాడు. బాధపడొద్దని చెప్తాడు. వెంటనే కనకం అప్పుకు పెళ్లి చేద్దామని అంటుంది. దీంతో మూర్తి ఆలోచిద్దామని చెప్తాడు. మరోవైపు సుభాష్‌కు రాజ్, కావ్య పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తారు.
సుభాష్: థ్యాంకూ సో మచ్ అసలు ఈరోజు పెళ్లి రోజు అనే విషయమే గుర్తు లేదు.
కావ్య: ఏంటి మామయ్యగారు ఇది మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మేము ఇంత చేస్తుంటే.. మీరు కనీసం పెళ్లి రోజు కూడా గుర్తు పెట్టుకుని అత్తయ్యగారికి విషెష్ కూడా చెప్పకపోతే ఎలా?
సుభాష్: సారీ అమ్మా కావ్య ఇప్పుడే వెళ్లి విష్ చేస్తాను.
రాజ్: ఎలా విష్ చేస్తారు డాడ్ వట్టి చేతులతో వెళ్లి షేక్ హ్యాండ్ ఇస్తారా?
సుభాష్: మరి ఏం చేయమంటావురా?
కావ్య: మీరు ఇలా ఉన్నారు కాబట్టే మీ అబ్బాయి కూడా అలాగే తయారయ్యారు.
రాజ్: ఇదిగో నువ్వు ఏదైనా అనాలనుకుంటే నన్ను అను అంతే కానీ మా డాడ్ ని మాత్రం ఏమీ అనకు.
కావ్య: పెళ్లి రోజును.. కట్టుకున్న భార్యని నెగ్లెక్ట్ చేస్తే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు.
రాజ్: అవకాశం దొరికింది కదా అని ఆడుకోకు
కావ్య: మీరు మాత్రం అవకాశం దొరక్కపోయినా ఆడుకుంటారు కదా?
సుభాష్: అబ్బా మీరు ముందు కొట్టుకోవడం మానేసి నన్ను ఏం చేయమంటారో చెప్పండ్రా
రాజ్: అంత అమాయకంగా అడుగుతారేంటి డాడ్. ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వండి.
సుభాష్: ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడి నుంచి వస్తుందిరా?
అనగానే మీరు మర్చిపోతారని ఊహించి ముందే మేము శారీ తెచ్చామని ఇది అత్తయ్యగారికి వచ్చి ఇంప్రెస్ చేయండి అని కావ్య చెప్పగానే శారీ తీసుకుని సుభాష్ లోపలికి వెళ్తాడు. సుభాష్ చేతిలో గిఫ్ట్ చూసి అపర్ణ షాక్ అవుతుంది. ఈరోజు మన పెళ్లి రోజు అని విష్ చేసి శారీ ఇస్తాడు. అపర్ణ కోపంగా చూస్తూనే శారీ తీసుకుంటుంది. దీంతో సుభాష్ హ్యాపీగా థాంక్యూ అంటూ బయటకు వెళ్లి రాజ్‌ను గట్టిగా హగ్ చేసుకుంటాడు.
సుభాష్: ఈరోజు నువ్వు ఆ బహుమతి తీసుకొచ్చి నాకు ఎంత మేలు చేశావో నీకు కూడా తెలియదు రాజ్. చాలా థాంక్స్ రా..
రాజ్: అదేంటి డాడ్ అంత ఎమోషనల్ అయిపోతున్నారు. అంతా ఓకేనా?
సుభాష్: ఇప్పటి వరకు ఎక్కడో చిన్న అనుమానం రా.. కానీ ఇప్పుడది తీరిపోయింది. నా మనసులో ఉన్న భారం మొత్తం కరిగిపోయింది.
అని సుభాష్ హ్యాపీగా చెప్పడంతో రాజ్ అయితే ఈరోజు ఫ్యామిలీ మొత్తం పండగ చేసుకుందామని చెప్తాడు. మరోవైపు కనకం, మూర్తి ఆలోచిస్తూ కూర్చుని ఉండగా పంతులు ధనుంజయను తీసుకుని వస్తాడు. ఎందుకొచ్చారని అడగ్గా ఏదైనా సంబంధం ఉంటే చెప్పండి అన్నారుగా అని పంతులు చెప్పగానే మీకు ఇంతకన్నా మంచి సంబంధం దొరకలేదా? అని కనకం పంతులుని తిడుతుంది. అలాగే ధనుంజయను కూడా తిట్టి చెంప పగులగొట్టి మెడ పట్టి బయటకు గెంటివేస్తుంది. తర్వాత పంతులును తిడతారు. మరోవైపు బాధగా ఆలోచిస్తూ కూర్చున్న కళ్యాణ్‌ను చూసి ధాన్యలక్ష్మీ, ప్రకాశ్ బాధపడతారు. దగ్గరకు వెళ్లి ఓదారుస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టిన అఖిల్ అక్కినేని - హోమ్ బ్యానర్లో 'AKHIL 7' - డైరెక్టర్ ఎవరంటే?