Brahmamudi Serial Today January 9Th: రాజ్ పై స్వీట్ రివెంజ్ తీర్చుకున్న కావ్య – కళ్యాణ్ ను మార్చిన అనామిక
Brahmamudi Today Episode: రాజ్, శ్వేతల గురించి కావ్య ఆలోచిస్తూ.. రాజ్ పై స్వీట్ రివెంజ్ తీర్చుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ కొంచెం ఫన్నీగానూ కొంచెం సీరియస్ గానూ జరిగింది.
Brahmamudi Serial Today Episode: బెడ్‌రూంలో ఒంటరిగా కూర్చున్న కావ్య ముబావంగా రాజ్, శ్వేతల గురించి ఆలోచిస్తుంది. ఇంతలో రాజ్ వస్తాడు. టిఫిన్ బాక్స్ తీసుకురాలేదని అడుగుతుంది. కాఫీ తాగుతారా? లేక అది కూడా బయట తాగొచ్చారా? అంటూ కోపంగా చూస్తూ బయటకు వెళ్తుంది. అసలైమైంది దీనికి అనుకుంటూ రాజ్ స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తాడు. మరోవైపు కళ్యాణ్ రెడీ అవుతుంటే అనామిక వస్తుంది. ఎలా ఉన్నానని కళ్యాణ్ అడుగుతాడు. నువ్వు ఓల్డ్ మాన్‌లా తయారవుతున్నావు అంటుంది అనామిక. అప్పు ఇలాగే బాగుంటుంది అనేది అని కళ్యాణ్ చెప్పగానే అనామిక కోపంగా వెళ్లబోతుంటే కళ్యాణ్ చేయిపట్టి లాగి హగ్ ఇస్తాడు. దీంతో అనామిక కూల్ అవుతుంది. కళ్యాణ్ కూడా ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్లే వింటానులే అంటాడు. దీంతో అనామిక ఈరోజు నిన్ను నేను రెడీ చేస్తాను అంటుంది. మరోవైపు గార్డెన్‌లో కూర్చున్న రాజ్‌ను కావ్య కోపంగా చూస్తూ కాఫీ ముఖం మీద పెడుతుంది.
రాజ్: కాఫీ అని చెప్పొచ్చు కదా?
కావ్య: చెప్పకపోయినా కాఫీ కాఫీలానే ఉంటుంది. టీ లా ఉండదు. సూర్యుణ్ని చూపించి ఇతనే సూర్యుడు అని చెప్తారా? చంద్రుణ్ని చూపించి ఇతనే చంద్రుడు అని చెప్తారా? మనుషులు రోజుకో టేస్ట్ మార్చుకున్నట్లు కాఫీ రోజుకో టేస్ట్ మార్చుకోదు.
రాజ్: ఫిఫ్టీ గ్రామ్స్ ప్రశ్నకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ జవాబు అవసరమా? నీ క్లాసుకు ఇంకా తలనొప్పి పెరిగిపోయింది.
కావ్య: ఈ తలనొప్పి ఇంటికొచ్చాకే వచ్చిందా? బయట తగిలించుకుని వచ్చారా?
రాజ్: దారిలో ట్రాఫిక్ జాంలో తగులుకుంది చాలా?
కావ్య: చాలు ఇమ్మంటే ఇస్తా.. వద్దంటే ఊరుకుంటా?
రాజ్: ఇమ్మంటే ఇస్తావా? నువ్విప్పుడు తెమ్మంటే తెచ్చావా?
కావ్య: పొమ్మంటే పోతా ఉండమంటే ఉంటా..
అంటూ టేబుల్ మీద కాఫీ పెట్టి వెళ్లిపోతుంది. అసలు ఏమైంది దీనికి అని తలపట్టుకుంటాడు రాజ్. మరోవైపు అనామిక రాజ్‌ను మోడ్రన్‌గా రెడీ చేస్తుంది. తన హెయిర్ స్టైయిల్ చూసుకున్న కళ్యాణ్ ఏంటిది కోడి జుట్టులా లేపావ్ అంటూ మొత్తానికి నన్ను వైరల్ చేసేలా ఉన్నావ్ అంటాడు. తర్వాత స్టయిల్ గా ఎలా నడవాలో అనామిక, కళ్యాణ్‌కు చూపిస్తుంది. మరోవైపు అప్పు బ్యాగ్ సర్దుకుంటుంది. కనకం లోపలి నుంచి వాళ్ల అక్కను తీసుకొచ్చి ఇందాకట్నుంచి నేను అడుగుతే చెప్పడం లేదు ఎక్కడికి వెళ్తుందో నువ్వైనా అడుగు అంటుంది. ఇంతలో మూర్తి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. పిజ్జా డెలివరీ కోసం వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోతుంది. అప్పు వెళ్లిపోయాక మూర్తి, కనకం, అప్పుకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తుంటారు.
రాజ్: ఏంటి? రోజూ ఈ పప్పేనా వెరైటీగా ఏం లేవా?
కావ్య: బయటి వాళ్లను పిలిచి వడ్డించమని చెప్పనా? వెరైటీగా ఉంటుంది. అదే బయట తిరిగుతూ ఉంటారు కదా? కొత్తకొత్త రుచులకి.. కొత్తకొత్త మనుషులకు అలవాటు పడ్డారేమోనని చెప్తున్నా..
అపర్ణ: రాజ్ ఎక్కడికి వెళ్లినా ఇంటి ఫుడ్ తప్ప వేరే తినే అలవాటు లేదు.
అనగానే ఇన్నాళ్లు నేను అదే అనుకున్నా అని కావ్య మనసులో అనుకుంటుంది. రాజ్ వాళ్ల బాబాయి కూడా పప్పు గురించి పప్పు గొప్పదనం గురించి చెప్తాడు. ఇంతలో కళ్యాణ్ మోడ్రన్ లుక్‌లో అనామికతో కలిసి కిందకు వస్తాడు. అందరూ షాక్ అవుతారు. ఇంతలో రుద్రాణి సెటైర్లు వేస్తుంది.
రుద్రాణి: పెళ్లాం రాగానే లుక్ మార్చేసింది. ఇంకా ముందు ముందు ఏం మారుస్తుందో?
కావ్య: భార్య కోసం బట్టలు మార్చుకోవడంలో తప్పు లేదండి. క్యారెక్టర్ మారిపోతేనే ప్రాబ్లం. ఏమంటారండి.
అని రాజ్‌ను అడుగుతుంది కావ్య
రాజ్: అవును నిజమే కదా! క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్
కావ్య: ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అన్నట్లు భార్యని మోసం చేస్తే తప్పు.
రుద్రాణి: అంటే కళ్యాణ్ మారిపోతాడు అంటావా?
కావ్య: మీ అబ్బాయి మారిపోయాడు అని చెప్తున్నా..అందరూ అలా ఉండరు కదా?
అంటూ అందరూ చర్చింకుంటుంటే రుద్రాణి జోక్ వేశావా అంటుంది. జోక్ వేయడం కాదు. మా కవిగారి కవితలోనే కాదు క్యారెక్టర్ లో కూడా ఒక నిజం ఉంటుందని కావ్య అంటుంది. క్యారెక్టర్ గురించి చెప్పడం కాదు చేసి చూపించాలి అని ధాన్యలక్ష్మీ కావ్యపై సైటైర్లు వేస్తుంది. దీంతో కావ్య బాధపడుతుంది. తర్వాత బెడ్‌రూంలోకి వెళ్లిన రాజ్ ఆలోచిస్తూ అటూఇటూ తిరుగుతుంటాడు. ఇంతలో కావ్య వస్తుంది. ఈవెనింగ్ నుంచి చూస్తున్నాను ఏవేవో మాట్లాడుతున్నావు అంటూ అడుగుతాడు రాజ్. దీంతో ఇంకా క్లారిటీ రాలేదని అది వచ్చాక మొత్తం మిమ్మల్నే అడుగుతానని చెప్పి నిద్రపోతుంది కావ్య. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: Jagadhatri Serial January 9th: నిషికకి ఘోర అవమానం.. సాక్ష్యాలు దొంగలించడానికి ప్లాన్ చేసిన వైజయంతి!
Also Read: Trinayani Serial Today Episode అనాథ అయిన గాయత్రీ పాప గత జన్మలో ఏం చేసిందని సుమన డమ్మక్కని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.!