Guppedantha Manasu January 9th Episode: రిషికి మొత్తం చెప్పి అసలు విషయం దాచిన వసు, ధరణికి దొరికిపోయిన శైలేంద్ర!
Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. రిషి - వసుధార మళ్లీ ఒక్కటయ్యారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu January 9th Episode: (గుప్పెడంతమనసు జనవరి 09 ఎపిసోడ్)
చక్రపాణి ఇంట్లో రిషికి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తుంటుంది వసుధార. రిషి ఆచూకీ ఎవరికి చెప్పకుండా రహస్యంగా దాచిపెడుతుంది. అయినా శైలేంద్ర ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ ఇంటికి వెళతాడు. వసుధారకి ఏదో అనుమానం వస్తుంది. మహేంద్రకి కాల్ చేసి మొత్తం చెబుతుంది. ఆ తర్వాత భద్ర శైలేంద్ర మనిషి అని వసుధార కూడా అనుమానపడుతుంది. మన అడ్రెస్ తెలుసుకొని మరి వచ్చాడంటే...ఎవరో తెలిసిన వాళ్లే ఇక్కడికి పంపించి ఉంటారని తండ్రితో అంటుంది వసుధార. మా గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం శైలేంద్రకు తప్ప ఎవరికి లేదని అంటుంది. మన గురించిన సమాచారం మొత్తం తెలుసుకుని శైలేంద్రకు చెప్పడానికే భద్ర ఇక్కడికి వచ్చాడని తండ్రికి చెబుతుంది. ఎవరిని నమ్మడానికి వీలు లేదని, ఏ చిన్న పొరపాటు చేసినా రిషి ప్రాణాలకే ప్రమాదమని తండ్రితో అంటుంది. రిషి కి కాపలాగా తాను ఉంటానని, నా ప్రాణం అడ్డువేసి మీ ఇద్దరిని కాపాడుకుంటానని కూతురికి మాటిస్తాడు చక్రపాణి.
Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: చక్రపాణి ఇంటికి వచ్చిన భద్ర - ఫణీంద్రకు ఫోన్ చేసిన వసుధార
మహేంద్ర - భద్ర
వసుధార దగ్గర నుంచి వచ్చిన భద్రపై మహేంద్ర ఫైర్ అవుతాడు. వసుధార దగ్గరకు ఎందుకు వెళ్లావు. ఆమె అడ్రెస్ నీకు ఎవరిచ్చారని అడిగితే ... వసుధార మేడం ఫణీంద్రగారికి కాల్ చేసి చెప్పారు..కాలేజీలో మాట్లాడుకుంటుంటే విని అక్కడకు వెళ్లానంటాడు. తిరిగి మీరు నన్ను అనుమానిస్తే ఈ క్షణమే వెళ్లిపోతాను అంటాడు. ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియడం లేదంటాడు మహేంద్ర. మీరు ఇంతకుముందు కూడా ఇలానే అన్నారని రివర్సవుతాడు. మరోసారి అనుమానించకండి ఆ తర్వాత మీరే బాధపడతారని మహేంద్రని బోల్తా కొట్టిస్తాడు..
రిషి-వసుధార
ఇందాక ఎవరో వచ్చినట్టున్నారు..మళ్లీ నాపై అటాక్ చేయాలని ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా అని అడుగుతాడు. అదేం లేదంటుంది వసుధార. అమ్మ కేసు ఏమైందని అడుగుతాడు
వసు: అప్పుడు హాస్పిట్లో ఉండి ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయాం..ఆ తర్వాత శైలేంద్ర సార్ ని అడిగితే ఇంకేవో వాయిస్ లు వినిపించారు.
రిషి:మరి అమ్మను చంపింది ఎవరై ఉంటారు
వసు: మీకు తొందర్లోనే అన్ని నిజాలు తెలుస్తాయి..
రిషి: అమ్మను ప్రేమగా చూసుకోవాలి అనుకున్నాను కానీ ఆ ఆశ తీరకుండానే అమ్మ వెళ్లిపోయింది. ఆ తర్వాత అమ్మ చావుకి కారణం ఎవరో ప్రయత్నం చేస్తుంటే నాకేం అర్థంకావడంలేదు. అమ్మ చావుకు కారణం ఎవరో తెలుసుకునే వరకు నా మనసు కుదుటపడదు. అసలు ఎవరికి కనిపించకుండా ఎందుకు దాక్కోవాలి. ఎందుకు అందరిని ఫేస్ చేయకూడదు అని లేవబోతాడు రిషి.
వసు: వద్దు సార్..ఈ సమయంలో మీ ఉనికి మీ నీడకు కూడా తెలియకూడదు. రౌడీలు మీ కోసమే వెతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వాళ్ల కంట పడితే ప్రమాదమనిహెచ్చరిస్తుంది.
రిషి: అసలు మన శత్రువు ఎవరై ఉంటారు. ఇవన్నీ మా అన్నయ్య చేసి ఉంటాడా? ఈ కుట్రలకు కారణం శైలేంద్రనేనా
వసు: తొందరలోనే అన్ని తెలుస్తాయి, తెలిసేలా చేస్తాను, మన శత్రువులు ఎవరు, ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారన్నది తెలిసే రోజు దగ్గరలోనే ఉంది
Also Read: ఇదికదా రిషిధార ప్లాన్ అంటే - శైలేంద్రతో ఆడుకున్న ధరణి!
ధరణి - శైలేంద్ర
శైలేంద్ర ఇంటికొచ్చేసరికి ధరణి సీరియస్‌గా ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తాడు.
శైలేంద్ర: అయినా బుర్రలో గుజ్జున్నవాళ్లు కదా ఆలోచించాలి...ఇదెందుకు ఆలోచిస్తోంది.. కొంపతీసి ఇస్రోకి ర్యాకెట్ ఏమైనా లాంఛ్ చేస్తోందా ఏంటి అని అనుకుంటాడు
ధరణి: సడెన్ గా వసుధార వాళ్ల నాన్న ఇంటికి ఎందుకు వెళ్లింది...వాళ్లమ్మ చనిపోయి ఆయన ఒక్కరూ ఉన్నప్పుడు కూడా వెళ్లలేదు.. ఇప్పుడెందుకు వెళ్లింది.. నాకు తెలిసి రిషిని కాపాడి తన తండ్రి దగ్గరకు తీసుకెళ్లి ఉంటుంది అనుకుంటుంది. రిషి ప్రాణాలకు ప్రమాదమనే అలా చేసి ఉంటుందని నిశ్చయించుకుంటుంది. రిషిని చూడాలి, తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోవాలి. రిషి బాధలన్నింటికీ కారణం మా ఆయనే. ఆయన ఏ ముహూర్తాన ఇంట్లో అడుగుపెట్టారో కానీ అప్పటి నుంచీ ఇంట్లో వాళ్లకి మనశ్సాంతి లేదు. రిషిపై అసూయతో ఇవన్నీ చేశారు. మొత్తం శైలేంద్ర అరాచకాలు అన్నీ గుర్తుచేసుకుంటుంది. మహేంద్ర ద్వారా రిషిని కలవాలని అనుకున్న ధరణి అతడి ఇంటికి బయలుదేరుతుంది.
తన ప్లాన్ తెలుసుకోవాలి అనుకుని ఫాలో అవుతాడు శైలేంద్ర...
Also Read: ఈ రోజు ఈ రాశులవారు ఫుల్ హ్యాపీగా ఉంటారు, జనవరి 09 రాశిఫలాలు
వసుధార తనని అనుమానంగా వేసిన ప్రశ్నలు గుర్తుచేసుకుంటాడు భద్ర. అక్కడ రిషి ఉన్నాడేమో అని ఆలోచిస్తుంటాడు. నిజంగా అక్కడ రిషి లేడా.. మరి వసుధార కళ్లలో ఏదో ఆందోళన కనిపించింది. మహేంద్ర సార్ కూడా ఆ విషయాన్ని నొక్కిమరీ అడిగారు కాకపోతే అది మనదాకా రాలేదు అనుకుంటాడు. ఇంతలో ధరణి అక్కడకు వస్తుంది. ఇంట్లో ఎవరూ లేరని చెబుతాడు భద్ర.
ధరణి: చిన మావయ్యతో కలసి వసుధార ఇంటికి వెళ్లాలని వచ్చాను
నేను తీసుకెళ్తాను అని చెప్పబోూ..సడెన్‌గా ఆగిపోతాడు భద్ర. వసుధార అడ్రెస్ తనకు తెలుసు అని చెప్పడం ప్లస్సవుతుందా? మైనస్ అవుతుందా అని ఆలోచిస్తుంటాడు.
మహేంద్రకు ఫోన్ చేయాలని ధరణి అనుకుంటుంది ఇంతలో తనను ఫాలో అయి వచ్చిన శైలేంద్రని చూస్తుంది...
ధరణి: ఇంట్లో ఎవరూ లేరు..ఇంటికెళదాం పదండి
శైలేంద్ర: కోపంగా చూస్తాడు
ధరణి: ప్రతి సారి ఏం చేస్తున్నారు..ఏం చేయబోతున్నారని మీ గురించి నేను ఆలోచించేదానిని. కానీ ఇప్పుడు మీరు నా గురించి ఆలోచిస్తున్నారు. నేను మీపై నిఘా పెట్టేదాన్ని కానీ ఇప్పుడు మీరు నాపై నిఘాపెట్టారు. పాట పాడుకుంటూ నన్ను ఫాలో అవుతూ వచ్చారు కదా . మీరలా చేస్తున్నందుకు నేను కదా కోపంగా చూడాలి..మీరు నన్ను చూస్తారేంటి
శైలేంద్ర: అసలే ఏంటిప్పుడు
ధరణి: మావయ్యగారు మిమ్మల్ని దారితప్పకుండా జాగ్రత్తగా చూసుకోమని నాతో చెప్పారు. అసలే శైలేంద్ర ఉట్టివెధవ, దద్దమ్మ, పనికిమాలినవాడు. చెట్టంత పెరిగినా అవగింజంత మెదడు లేదని మామయ్యతో అంటూ ఉంటారు. ఎంత చెప్పినా మీరు దారితప్పే పనులే చేస్తారు. అడ్డదారుల్లోనే నడుస్తారు
శైలేంద్ర: ధరణి మాటలతో శైలేంద్ర ఫైర్ అవుతాడు. నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది
ధరణి: మీరు నన్ను ఫాలో అయిన విషయం మామయ్యకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా...
ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు శైలేంద్ర తనను కలవడానికే వచ్చాడా లేదంటే ధరణిని ఫాలో అవుతూ వచ్చాడా అని భద్ర ఆలోచిస్తుంటాడు.
ఎపిసోడ్ ముగిసింది...