అన్వేషించండి

Nindu Noorella Saavasam serial January 9th: మనోహరిని భయపెట్టిన హంతకుడు.. అరుంధతిని బంధించటానికి సర్వం సిద్ధం చేసిన ఘోర!

Nindu Noorella Saavasam Serial Today Episode: అరుంధతిని బంధించటానికి ఘోరకి సాయం చేస్తాడు దేవా. దీంతో ఘోర అరుంధతిని ఏ విధంగా వశీకరణం చేసుకుంటాడో అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో హంతకుడు ఇంట్లోకి ప్రవేశించడంతో ఉలిక్కిపడుతుంది అరుంధతి. అక్కడ ఉన్న వాడిని చూసి దొంగ అనుకుంటుంది. ఆ తర్వాత ఇతనిని ఎక్కడో చూశాను అనుకుంటూ అతడు తనని చంపిన వాడే అని గుర్తుపట్టి భయంతో వణికి పోతుంది. లోపలికి వెళ్తున్న హంతకుడిని  నీకు లోపల ఏం పని అంటూ అరుస్తుంది కానీ హంతకుడికి వినిపించదు.

అరుంధతి: ఇప్పుడు లోపలికి వెళ్లి ఏం చేస్తాడో అనుకుంటూ గుప్తా గారికి చెప్పాలి అనుకొని చిత్రగుప్తుడిని పిలుస్తుంది. అతను అందుబాటులో లేకపోవడంతో ఈయన  ఎక్కడికి వెళ్లారో అనుకుంటూ మళ్లీ హంతకుడి దగ్గరికి వెళుతుంది. ఇంతలోనే హంతకుడు తన పద్ధతిలో తలుపు తెరిచి లోపలికి వెళ్ళిపోతాడు. మనోహరి ఎక్కడ ఉందో అని వెతుకుతూ పిల్లల గదికి వెళ్తాడు. 

అరుంధతి: ఆగు, పిల్లల గదికి వెళ్ళకు వాళ్ళని ఏమి చేయకు నన్ను చంపింది సరిపోలేదా అంటూ కేకలు వేస్తుంది కానీ తన మాటలు హంతకుడికి వినిపించకపోవడంతో ప్రతి గది చెక్ చేస్తూ ఉంటాడు. ఎవరిని ఏం చేస్తాడో అని భయంతో అమర్ రూమ్ కి వెళ్లి అమర్ ని లేపుతుంది. కానీ అమర్ లేవకపోతే గట్టిగా పిలుస్తుంది. ఆ వైబ్రేషన్ ని ఫీలవుతాడు అమర్.

అమర్: అరుంధతి పిలిచినట్లుగా అనిపించింది ఏంటి అనుకుంటాడు ఆ తర్వాత మంచినీళ్ల కోసం కిందికి వస్తాడు.

ఈ లోగా హంతకుడు మనోహరి రూమ్ కి వెళ్లి ఆమెని నిద్ర లేపుతాడు.

మనోహరి: నిద్రలో హంతకుడిని చూసి కంగారు పడుతుంది భయంతో వణికి పోతుంది. నీకేమైనా పిచ్చా ఇక్కడికి ఎందుకు వచ్చావు అమర్ కి దొరికావంటే చంపేస్తాడు అంటుంది.

హంతకుడు: చంపితే నన్ను ఒక్కడినే చంపడు మిమ్మల్ని కూడా చంపుతాడు అందుకే నిజం చెప్పి చచ్చి పోదాం అనుకుంటున్నాను అంటూ మెల్లగా తలుపు తీసేసరికి ఎదురుగా మంచినీళ్లు తాగుతున్న అమర్ కనిపిస్తాడు. అది చూసిన మనోహరి మరింత భయపడిపోతుంది. నిజం చెప్పొద్దు అంటూ బ్రతిమాలుకుంటుంది.

ఈ లోపు అమర్ నీళ్లు తాగి మళ్లీ తన రూమ్ కి వెళ్ళిపోతుంటే హంతకుడు ఇక్కడే ఉన్నాడు చూడండి అంటూ భర్తని వెంబడిస్తూ అంటుంది అరుంధతి. అమర్ పైకి వెళ్ళటం చూసి హంతకుడు కంగారుగా బయటికి పారిపోతాడు. భర్త నిద్రపోవడం చూసిన అరుంధతి కంగారుగా కిందికి వస్తుంది మెయిన్ డోర్ వేసి ఉండటం చూసి హంతకుడు వెళ్లిపోయినట్లున్నాడు అనుకుంటుంది.

బయటికి వచ్చిన తర్వాత వెళ్లిన పని వర్క్ అవుట్ అయిందా అని హంతకుడి  ఫ్రెండ్ హంతకుడిని అడుగుతాడు.

హంతకుడు: భయాన్ని గుర్తు చేయటం కాదు మరెప్పుడూ మర్చిపోకుండా చేశాను అని గర్వంగా చెప్తాడు. అంతలోనే మనోహరి ఫోన్ చేసి నా కొంచెం టైం ఇవ్వు రెండు రోజుల్లో నువ్వు అడిగిన డబ్బు అరేంజ్ చేస్తాను అంటుంది.

హంతకుడు: నీ ఇష్టం అప్పటివరకు నేను సిటీలోనే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

మనోహరి: వీడికి ఇప్పుడు డబ్బు ఇస్తే మళ్లీ బ్లాక్ మెయిల్ చేయడని గ్యారెంటీ లేదు, అలాగని వదిలేస్తే మళ్లీ వస్తాడు ఎలాగైనా శాశ్వతంగా వదిలించుకోవాలి అనుకుంటుంది.

మరోవైపు పూజలో ఉన్న ఘోర తన ప్రయత్నం ఫలించినందుకు కోపంతో రగిలిపోతాడు. దేవా ని పిలిచి నేను ఎప్పుడూ ఓడిపోలేదు కానీ ఇప్పుడు ఓడిపోతున్నాను దీనికి కారణం ఏమిటి అని అడుగుతాడు.

దేవా: ఇప్పుడు అర్థమైందా నీ కన్నా ముందు ప్రయత్నించిన వాళ్ళు ఎందుకు ఓడిపోయారో. వశీకరణం అంత సులభమైన పని కాదు. మీకు సాయం చేయడం కోసం ఒక ప్రాణిని పంపిస్తాను అని చెప్పి శ్వేతనాగుని పంపిస్తాడు.

ఘోర: ఇప్పుడే ఈ పాముని ఇంటి లోపలికి పంపించి ఆ ఆత్మ ని బయటికి రప్పించి ఆత్మని బంధిస్తాను అని ఆనందంగా అనుకుంటాడు.

మరోవైపు  పిల్లలు ఆడుకుంటుంటే అంజు పడిపోతుంది. దెబ్బ తగిలి ఏడుస్తున్న  అంజూని దగ్గరకు తీసుకొని ఓదార్చలేక కన్నీరు పెట్టుకుంటుంది అరుంధతి. ఏడుస్తూ కోపంతో దేవుడిని తిట్టుకుంటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Also Read: Gruhalakshmi Serial Today Episode: దివ్యకు పిచ్చి ముదిరిందని స్టోర్ రూంలో వేస్తుంది రాజ్యలక్ష్మీ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

Also Read: Naga Panchami Serial Today Episode మోక్షని కాటేయడానికి పంచమి పాములా మారడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Also Read: Jagadhatri Serial January 9th: నిషికకి ఘోర అవమానం.. సాక్ష్యాలు దొంగలించడానికి ప్లాన్ చేసిన వైజయంతి!

Also Read: Trinayani Serial Today Episode అనాథ అయిన గాయత్రీ పాప గత జన్మలో ఏం చేసిందని సుమన డమ్మక్కని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vikatakavi Web Series: 'వికటకవి' టైటిల్ ఎందుకు... సిరీస్‌లో ఏం చేశారు? ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి
'వికటకవి' టైటిల్ ఎందుకు... సిరీస్‌లో ఏం చేశారు? ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి
Embed widget