Naga Panchami Serial Today January 9th: తోటికోడళ్లకు చుక్కలు చూపించిన మేఘన.. పంచమిని మాయ చేస్తోన్న సుబ్బు!
Naga Panchami Serial Today Episode మేఘన గదిని చెక్ చేయడానికి వెళ్లిన జ్వాల, చిత్రలకు మేఘన తన మంత్ర శక్తులతో చుక్కలు చూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode: మోక్ష, పంచమి ఇంట్లో ఎవరికీ తెలీకుండా మేఘన గదిలోకి వస్తారు. ఇక పంచమిని పాములా మారమని చెప్పిన ఫణేంద్ర మోక్షను కసితో గట్టిగా కాటేసి చంపేయాలి అని చెప్తాడు. నెమ్మదిగా కాటేస్తే అటు చనిపోక ఇటు బతకక నొప్పితో పెద్దగా కేకలు వేస్తాడని దానివల్ల ఇంట్లో వాళ్లకి నిజం తెలిసిపోతుంది అని ఫణేంద్ర చెప్తాడు. ఇక పంచమి పాములా మారుతుంది. మోక్ష బెడ్ మీద పడుకుంటే పంచమి పాము మోక్ష పాదాల దగ్గరకు వెళ్తుంది. పంచమి పాము ఏం చేస్తుందా అని ఫణేంద్ర పాము దూరం నుంచి చూస్తుంటాడు. పంచమి పాము కాటేయకుండా అలాగే నిల్చొని చూస్తుంటుంది. దీంతో మోక్ష పంచమి త్వరగా కాటేయ్ అని అంటాడు. పంచమి పాము తిరిగి మనిషిగా మారిపోతుంది.
ఫణేంద్ర: వద్దులే యువరాణి. ఒకవేళ నువ్వు ఇష్టం లేకుండా బలవంతంగా కాటేసినా ఆ బాధ భరించలేక మోక్ష గట్టిగా అరిచాడు అంటే ఇంట్లో అందరూ వచ్చేస్తారు. ఈ ఇంట్లో కాకుండా ఇంకెక్కడైనా పర్లేదు. ఇక్కడ మాత్రం ఈ కార్యక్రమం వద్దే వద్దు.
పంచమి: యువరాజా నాగమణి కాకుండా నేను చెప్పిన నాగ చంద్రకాంత మొక్కను తీసుకురాలేమా..
ఫణేంద్ర: ఏం తీసుకురావాలి అన్నా మీరు ముందు కాటేయాలి యువరాణి. ముందు ఆ కార్యక్రమం ఎక్కడ చేయాలో తేల్చండి.
పంచమి: ఒక పని చేద్దాం యువరాజా మా ఊరి కొండల్లో నాగసాధువు ఉన్నారు. వారి ఆశ్రమంలో అయితే ఎవరికీ అనుమానం ఉండదు. మనం తిరిగి వచ్చేవరకు మోక్షాబాబుని తనైతే జాగ్రత్తగా చూసుకుంటారు.
మోక్ష: సరే.. ఎందుకు ఆలస్యం వెంటనే బయల్దేరుదాం.
మేఘన: మీ ముగ్గురు వెళ్లండి నేను కనిపించకపోతే మీ వాళ్లకి అనుమానం వస్తుంది. ఎలాగూ ఈ రాత్రికి మనం అనుకున్నది జరగదు కదా. రేపటికి నేను అక్కడికి చేరుకుంటా. మనసులో.. పంచమి మళ్లీ నాగమణిని వదిలేసి ఆ మొక్క వైపే మొగ్గు చూపుతోంది. వాళ్లని నమ్మకూడదు. నా ప్రయత్నం నేను చేసుకోవాలి. ఫణేంద్ర పంచమిని మోసం చేస్తే ఇక్కడ మోక్ష చనిపోతాడు. అక్కడ నుంచి నాగమణి రాదు. అలా జరగకుండా ఏదో ఒకటి చేయాలి.
వైదేహి: మన మోక్షని పంచమి పూర్తిగా మార్చేసింది అండీ. వాడు అసలు ఏం చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలీడం లేదు.
మేఘన: మీరు భయపడకండి ఆంటీ వాళ్లు ఎక్కడికి వెళ్లుండరు. పంచమికి నాలాగా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లి ఉంటుంది. మనకు తెలీదు కదా అంకుల్ మోక్ష పంచమిని ఎక్కడికైనా తీసుకెళ్లుండొచ్చు కదా.. ఈ ఊర్లోనే నాకు పంచమికి తెలిసిన ఫ్రెండ్స్ ఒకరిద్దరు ఉన్నారు. అలా బయటకు వెళ్తే వాళ్ల గురించి తెలుసుకుంటా.
చిత్ర: అక్క మేఘన వెళ్లిపోయింది.
జ్వాల: దరిద్రం వదిలిపోయింది. పంచమి వచ్చి ఈ ఇంటిని మంత్రగాళ్లకు మాయలోలకు పెద్ద సత్రంలా మార్చేసింది.
చిత్ర: అక్క ఒకసారి దాని గది చూద్దాం. మంత్రాలకు సంబంధించి ఏమైనా దొరికితే కాల్చేద్దాం. పద అక్క. ఇక ఇళ్లంతా వెతికి చిత్ర ఓ చిన్న నల్ల మూటని తీస్తుంది. మరోవైపు మేఘన ఏవో మంత్ర శక్తులు ప్రయోగించి జ్వాలా చూస్తున్న ఆ మూట నుంచి పొగ వచ్చేలా చేస్తుంది. దీంతో జ్వాల దెయ్యంలా మారి చిత్ర గొంతు పట్టుకుంటుంది. ఇక మళ్లీ మేఘన మంత్ర శక్తి ప్రయోగించడంతో ఈ సారి చిత్ర దెయ్యంలా మారి జ్వాలను ఇబ్బంది పెడుతుంది. మేఘన నవ్వుకుంటుంది. మరోవైపు పంచమి, మోక్ష, ఫణేంద్ర గుడికి వస్తారు.
పంచమి: ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ ఉంటే అంతా మంచే జరుగుతుంది.
ఫణేంద్ర: ముందు మీరు నన్ను నమ్మితే అంతా సవ్యంగా జరిగిపోతుంది.
పంచమి: నేను నమ్మబట్టే ఫణేంద్ర ఇప్పుడు నువ్వు చెప్పినట్లు చేయడానికి సిద్ధమయ్యాను. కానీ నేను ఆ స్వామి తోడు లేకుండా ఏ పని చేయలేను. ఆ సుబ్రహ్మణ్య స్వామి నన్ను చేయిపట్టి నడిపిస్తున్నారు. లేదంటే ఇన్ని కష్టాల మధ్య నేను ఇంకా ఊపిరితో ఉన్నాను అంటే ఆ స్వామి చలువే.
మోక్ష: నాకు అయితే ఇప్పుడు ఏ ఆశలూ, కోరికలు లేవు పంచమి. అన్నీ వదులు కొని చావుకు సిద్ధమైపోయి నీతో వస్తున్నాను. ఆ స్వామిని నీ కోసం కోరుకో. నా కోసం అయితే ఏమీ అక్కర్లేదు. నీకు మంచి జరిగింది అంటే నాకు జరిగినట్లే పంచమి. నువ్వేల్లి దేవుడిని వేడుకొని రా. ఫణేంద్ర నాకు ఏం జరిగినా పర్లేదు. పంచమికి ఎలాంటి కష్టం రాకూడదు.
ఫణేంద్ర: మనసులో.. ఈ రాత్రివరకే నీకు పంచమి. రేపటి నుంచి తను మా నాగలోకానికి యువరాణి. నాకు కాబోయే పట్టపురాణి.
మోక్ష: నన్ను బతికించగలవు అని పంచమి నిన్ను పూర్తిగా నమ్ముతోంది ఫణేంద్ర. నాకు అయితే అలాంటి ఆశలు ఏమీ లేవు.
ఫణేంద్ర: ఆ విషయం నాకు తెలుసు. నువ్వు తిరిగి బతకడం జరగదు. మీరు బాగా భయపడుతున్నారు మోక్ష. ధైర్యంగా ఉండండి. ఏం జరగాలో అదే జరుగుతుంది.
పంచమి: స్వామి నేను ఫణేంద్రని నమ్మి నా భర్త ప్రాణాలు పనంగా పెడుతున్నాను. తను ఏ మాత్రం మోసం చేసినా నా భర్త ప్రాణాలు పోతాయి. మోక్షాబాబును కాపాడుకోలేక పోతే నేను ప్రాణాలతో ఉండటం అనవసరం. నాకు నువ్వే అండగా ఉండాలి స్వామి. మిమల్నే నమ్ముకొని వెళ్తున్నా స్వామి. ఇక సుబ్బు పంచమిని పిలుస్తాడు. సుబ్బు పంచమికి కనిపించి తను వెళ్లి పట్టుకునే లోపు మాయం అయిపోతాడు. ఇలా చాలా సేపు సుబ్బు పంచమిని తిప్పిస్తాడు. చివరికి పంచమి సుబ్బుని పిలిచి పిలిచి కనిపించకపోయే సరికి ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: Jagadhatri Serial January 9th: నిషికకి ఘోర అవమానం.. సాక్ష్యాలు దొంగలించడానికి ప్లాన్ చేసిన వైజయంతి!
Also Read: Trinayani Serial Today Episode అనాథ అయిన గాయత్రీ పాప గత జన్మలో ఏం చేసిందని సుమన డమ్మక్కని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.!