Brahmamudi Serial Today January 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అప్పుతో ఎమోషనల్ అయిన ధాన్యం – రుద్రాణిని అనుమానించిన కనకం
Brahmamudi serial today episode January 5th: సీమంతం కోసం రెడీ అవుతున్న అప్పు దగ్గరకు వెళ్లి ధాన్యం సారీ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: పసరు మందు వీరయ్య కోసం రుద్రాణి ఎదురుచూస్తుంది. అసలు వస్తాడా..? రాడా అనే అనుమానంతో గేటు వైపు చూస్తుంది. అప్పుడే వీరయ్య గేటు తెరుచుకుని లోపలికి వస్తుంటాడు. రుద్రాణి చూసి కంగారు పడుతుంది.
రుద్రాణి: ఓరేయ్ అక్కడే ఆగరా లోపలికి వచ్చేస్తున్నావు.. ముందు బయటకు పద
వీరయ్య: ఏమైందమ్మా ఎందుకు భయపడుతున్నారు
రుద్రాణి: ఏమైందా..? నిన్ను లోపలికి రావొద్దు బయట నుంచే ఫోన్ చేయమని చెప్పాను కదా..?
వీరయ్య: చెప్పారు అమ్మా కానీ నా ఫోన్‌లో బ్యాటరీ అయిపోతుంది.
రుద్రాణి: అలాగని గేటు తీసుకుని అత్తారింటికి వచ్చినట్టు లోపలికి వచ్చేస్తావా..? ఎవరైనా నిన్ను చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?
వీరయ్య: ఏమైందమ్మా ఇప్పుడు.. ఎవ్వరూ చూడలేదు కదా
రుద్రాణి: ఏం చెప్పానురా నీకు ఈ ఇళ్లంతా కళ్లే ఒక్కరి కంట పడ్డా నువ్వు నేను కతమే..
వీరయ్య: అంటే అమ్మా పసరు మందు తయారు చేసిన ఆనందంలో మీకు తొందరగా ఇవ్వాలని అలా లోపలికి వచ్చేశానమ్మా.. ఏమీ అనుకోవద్దమ్మా
రుద్రాణి: సరేలే పసరు ముందు ఎక్కడుంది ఇవ్వు..
వీరయ్య: ఇదిగోనమ్మా పసరు మందు
రుద్రాణి: ఇది అనుకున్నట్టు పని చేస్తుందా.?
వీరయ్య: ఎంత మాటమ్మా రోజంతా కష్టపడి చేసిన మందమ్మా..? ఇది కానీ కడుపులోకి వెళ్లిందంటే.. పేగులతో సహా బయటకు వచ్చేయాలమ్మా.. నన్ను నమ్మండి అమ్మా..
రుద్రాణి: సరే ఈ డబ్బు తీసుకో వెళ్లిపో
వీరయ్య వెళ్లిపోయాక కావ్య నీ సంగతి చెప్తాను అంటూ లోపలికి వెళ్తుంది రుద్రాణి. ఎదురుగా కనకం ఉంటుంది. రుద్రాణి భయపడుతుంది. కనకం మొత్తం చూసిందా అనుకుంటుంది.
రుద్రాణి: ఏంటలా చూస్తున్నావు
కనకం: ఏంటది..?
రుద్రాణి: నువ్వు దేని గురించి అడుగుతున్నావు
కనకం: నీ కొంగు చాటున దాచిన దాని గురించి అడుగుతున్నాను
రుద్రాణి: ఏం మాట్లాడుతున్నావు నువ్వు
కనకం: నీ కొంగు చాటున దాచిన దాగి గురించే అడుగుతున్నాను.. మర్యాదగా చూపించు
రుద్రాణి: ఇదిగో చూడు సరిగ్గా చూడు.. పసరు మందు
కనకం: పసరు మందా..? దేనికి
రుద్రాణి: రోజూ అజీర్తిగా ఉంది.. తెలిసిన వాళ్లు పసరు మందు వాడమని చెప్పారు.. తెచ్చుకున్నాను అంతే.. అయినా నువ్వేంటి..? దొంగను ప్రశ్నించినట్టు నన్ను ప్రశ్నిస్తున్నావు.. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి
కనకం: ఈ ఇంటికి వియ్యపురాలిని అనుకుంటున్నాను
రుద్రాణి: అలా అని గొప్ప అనుకోకు.. ఈ ఇంటికి పిల్లను ఇచ్చిన ఆడపిల్లవి తల్లివి మహా అయితే కాస్త బంధువువి అంతే అది మర్చిపోయి ఈ ఇంటి వ్యక్తి లాగా నన్ను ప్రశ్నించకు నాకు నచ్చదు.. నీ స్థానంలో నువ్వు ఉండు.. అర్థమైందా..?
వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది రుద్రాణి. కనకం అనుమానంగా చూస్తుంది. తర్వాతి రోజు సీమంతానికి రాజ్, కళ్యాణ్ ఏర్పాట్లు చేస్తుంటారు. ధాన్యలక్ష్మీ, అపర్ణ, ఇందిరాదేవికి మట్టిగాజుల ప్రత్యేకత గురించి చెప్తుంది కనకం. తర్వాత కావ్య తాగే కషాయంలో పసరు మందు ఎలా కలపాలా..? అని రుద్రాణి ఆలోచిస్తుంది. రేఖతో కలిసి కావ్య రూంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ కావ్య, కనకం ఉండటంతో వెనక్కి వెళ్లిపోతుంది. మరోవైపు అప్పు రూంలోకి వెళ్లిన ధాన్యలక్ష్మీ సారీ చెప్పి ఎమోషనల్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















