Brahmamudi Serial Today January 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : దుగ్గిరాల ఇంట్లోకి కళ్యాణ్ రీ ఎంట్రీ – కేసు చెల్లదన్న లాయరు
Brahmamudi Today Episode: ఆస్థి కోసం కేసు వేస్తానన్న ధాన్యలక్ష్మీకి ప్రకాష్‌కు గడ్డి పెడతాడు కళ్యాణ్ దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: కావ్య సుభాష్ దగ్గరకు వెళ్లి మీరే ఈ పరిస్థితిని చక్కదిద్దగలరు అని చెప్తుంది. దీంతో అపర్ణ కోపంగా కావ్యను తిడుతుంది. చేసేదంతా నువ్వు చేసి ఆయనను చెప్పమంటే ఎవరు వింటారు. ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాళ్లు కోర్టుకు వెళ్లే తీరతారు అంటూ అపర్ణ తిట్టడంతో కావ్య బాధపడుతుంది. రాజ్, కావ్య బెడ్ రూంలో కూర్చుని ఆలోచిస్తుంటారు.
రాజ్: చూస్తుండగానే పరిస్థితులు మన చేతులు దాటి పోయాయి ఏం చేద్దాం.. ఈ సమస్యను ఇలాగే వదిలేస్తే ఏమవుతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది.
కావ్య: ఇన్నాళ్లు ఏదో బెదిరిస్తున్నారు అనుకున్నాం కానీ ఇంత సీరియస్‌గా స్టెప్ తీసుకుంటారని అనుకోలేదు
రాజ్: ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇన్నాళ్లు పిన్ని బెదిరిస్తుంటే బాబాయ్ తో చెప్పి ఆపేవాళ్లం కానీ బాబాయ్ కూడా డిసిజన్ తీసుకున్నారు ఇప్పుడేం చేద్దాం.
కావ్య: మీ పిన్ని చస్తాననో.. ఇల్లు వదిలి వెళ్తాననో ఏదో చెప్పి బెదిరించి ఉంటారు. తప్పనిసరై కొంత.. నా ప్రవర్తన నచ్చక కొంత అని అర్థం అవుతుంది. తెల్లారితే వాళ్లు కోర్టుకు వెళ్తారు. తెల్లారే సరికే ఎలాగైనా ఆపాలి
రాజ్: కోర్టుకు గానీ వెళ్లడం జరిగితే ఇక మనం జరిగేది ఏది ఆపలేం ఇది పాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఒక్కసారి మీడియాకు అనుమానం వచ్చిందంటే మొత్తం తెలిసిపోతుంది. పిన్ని బాబాయ్ వెళ్లి కోర్టులో స్టే తెచ్చుకుంటే.. ఇక మనం పూర్తిగా మునిగిపోతాం
అని ఇద్దరూ బాధపడుతూ.. భయపడుతుంటారు. మరోవైపు రాహుల్, రుద్రాణి డ్రింక్ చేస్తూ.. హ్యాపీగా డాన్స్ చేస్తుంటారు.
రాహుల్: కంగ్రాట్స్ మమ్మీ మొత్తానికి అనుకున్నది సాధించావు.
రుద్రాణి: రేయ్ ఇక కోర్టుకు వెళ్లకుండా ఆపడం ఎవరి తరం కాదురా. మన ఆస్థి రాకుండా ఆపడం కావ్య వల్ల అసలు కాదు
స్వప్న: అత్తా అప్పుడే ఆస్థి ముక్కలు చేసి మీ వాటా మీకు వచ్చేసినట్టే ఎంజాయ్ చేస్తున్నారేంటి..?
రుద్రాణి: కోర్టు నోటీసు వచ్చాక నెక్స్ట్ జరిగేది అదే కదా..?
స్వప్న: నోటీసు వచ్చినంత మాత్రాన అంతా జరిగిపోయినట్టు అనుకుంటున్నారేంటి.? ముందు కోర్టులో మీకు హక్కు ఉందని నిరూపించుకోవాలి. పెట్టిన కేసులో మీరు గెలవాలి. ఇదంతా జరుగుతుందనుకుంటున్నారా..?
రుద్రాణి: ఓరే రాహుల్ ఇంత తింగరిదాన్ని చేసుకున్నావేంట్రా..? మా నాన్న ఆస్థి రాసిచ్చాక ఇప్పుడు వచ్చి నువ్వు మాకు నీతులు చెప్తున్నావా..? నీకు తెలియని విషయం ఇంకొకటి చెప్పనా… మా నాన్న నీకు రాసిచ్చిన ఆ ప్రాపర్టీ పర్మినెంట్ గా నీ సొంతం కాదు. నువ్వు అనుభవించగలవు. ఎప్పుడైతే మా నాన్న ఆస్థి మొత్తం కావ్యకు రాసిచ్చాడో అప్పుడే నీ ఆస్థి కూడా కావ్య చేతిలోకి వెళ్లింది. ఇప్పుడు చెప్పు ఎవరికి సపోర్టు చేస్తావు
స్వప్న: నా చెల్లికే చేస్తాను. కావ్య ఉండగా మీరు ఏం చేసినా సక్సెస్ కాలేరు. నా చెల్లెలు గురించి మీకు ఇంత తెలిసినా ఇంకా తక్కువ అంచనా వేస్తున్నారా..? మీరు కోర్టులో గెలవడం కాదు కదా..? కనీసం కోర్టు మెట్లు కూడా ఎక్కలేరు
అని చెప్పి వెళ్లిపోతుంది స్వప్న. రుద్రాణి, రాహుల్ నవ్వుకుంటారు. తర్వాతి రోజు ప్రకాష్ బాధపడుతుంటే ధాన్యలక్ష్మీ వచ్చి తిడుతుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ లాయరు ఇంటికి రాగానే అందరూ షాక్ అవుతారు. కావ్య వచ్చి తాత ఆస్థికి మనవడు వారసుడు కదా..? కొడుకు కేసు వేయవచ్చా అని లాయరును అడుగుతుంది. కొడుకు కేసు వేసినా నిలబడదు మనవడే వేయాలి అని చెప్తాడు లాయరు. దీంతో ధాన్యలక్ష్మీ కోపంగా కావ్యను తిడుతుంటే.. కళ్యాణ్ వచ్చి ధాన్యలక్ష్మీని తిడతాడు.
ఆస్థి కావాలని నేను అడిగానా అంటూ నిలదీస్తాడు. నా ఇష్టం లేకుండా.. నా సంతకం లేకుండా.. నా అనుమతి లేకుండా కేసు ఎలా వేయిస్తారు..? అనగానే ధాన్యలక్ష్మీ మీ నాన్న కూడా ఒప్పుకున్నాక ఇక నువ్వు తిరకాసు పెట్టొద్దు అంటుంది. అయితే విధి లేని పరిస్థితుల్లోనే నేను ఒప్పుకున్నాను అంటాడు ప్రకాష్. దీంతో కళ్యాణ్ మరింత కోపంగా ధాన్యలక్ష్మీని తిడతాడు. మధ్యలో అడ్డొచ్చిన రుద్రాణిని తిడతాడు. ఇంతటితో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

