Brahmamudi Serial Today January 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్ : ధాన్యలక్ష్మీ, అపర్ణ మధ్య గొడవ పెట్టిన రుద్రాణి - రుద్రాణిని వాయించిన స్వప్న
Brahmamudi Today Episode: డైనింగ్ టేబుల్ దగ్గర అపర్ణ, ధాన్యలక్మీ గొడవ పడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ జరిగింది.
Brahmamudi Serial Today Episode: హాస్పిటల్‌లో సిస్టర్స్ ఇద్దరూ మాట్లాడుకోవడం విన్న కావ్య షాక్ అవుతుంది. సిస్టర్స్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఐసీయూ రూం డోర్ దగ్గరకు వెళ్లి లోపలికి చూస్తుంది. లోపల రాజ్, శ్వేత చేయి పట్టుకుని ఓదారుస్తుంటాడు. ఆ సన్నివేశం చూసిన కావ్యకు కన్నీళ్లు ఆగవు. ఏడుస్తూ ఉండిపోతుంది. ఇంతలో స్వప్న వస్తుంది. దీంతో కావ్య కన్నీళ్లు తుడుచుకుని ఇద్దరూ కలిసి డాక్టర్ దగ్గరకు వెళ్తారు. మరోవైపు ధాన్యలక్ష్మీ కిచెన్‌లో ఉండగా బామ్మ వచ్చి కావ్యకు ఈరోజు ఓంట్లో బాగాలేదని హాస్పిటల్‌కు వెళ్లింది ఆ వంట సంగతి నువ్వే చూసుకో అని చెప్తుంది. కావాలంటే అనామిక సాయం తీసుకో అంటుంది.
ధాన్యలక్ష్మీ: వద్దులేండి అత్తయ్యగారు నేను చూసుకుంటానులేండి. కొత్తగా ఇంటికి వచ్చింది తనను ఎందుకు ఇబ్బంది పెట్టడం.
రుద్రాణి: అప్పుడే కోడలును కూతురులా చూసుకోవడం మొదలుపెట్టావన్నమాట. సరే కానీ
బామ్మ: అందరూ నీలా ఉండరు కదా
అంటూ కళ్యాణ్ బయటకు వెళ్తుంటే పిలిచి తన రూంలో గీజర్ పనిచేయడం లేదని అలాగే తాతయ్య బట్టలు ఐరన్‌కు ఇచ్చానని వాడు ఇంకా తీసుకురాలేదని చెప్పడంతో నేను చూసుకుంటానులే నాన్నమ్మ అంటూ కళ్యాణ్ వెళ్లి పోతాడు. బామ్మ కూడా వెళ్లగానే రుద్రాణి, చూశావా నీ కొడుకేమైనా పనోడా అన్ని పనులు చెప్తుంది అంటూ ధాన్యలక్ష్మీకి నూరిపోస్తుంది. దీంతో నాన్నమ్మకు పనులు చేయడం తప్పా నువ్వు ఈ కట్టుకథలు చెప్పడం మానుకో అంటుంది ధాన్యలక్ష్మీ. ఇంతలో అపర్ణ వచ్చి డ్రైవర్ లేడని సాయంత్రం గుడికి వెళ్లాలనుకుంటున్నట్లు కళ్యాణ్‌కు చెప్తుంది. కళ్యాణ్ ఓకే అంటూ వెళ్లిపోతాడు. హాల్లో బుక్ చదువుతున్నట్లు బిల్డప్ ఇస్తున్న అనామిక అంతా గమనిస్తుంది. ఇక కిచెన్‌లో
రుద్రాణి: ఇప్పుడేమంటావు.. నీకొడుకేమైనా డ్రైవరా? అలా మాట్లాడుతుంది. పైగా కాలీనే కదా అంటుంది. ఒకవేళ వదినకు అంతలా వెళ్లాలని ఉంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లొచ్చు కదా? మనకు డబ్బులేమన్నా కరువా చెప్పు.
అంటూ చెప్పగానే ధాన్యలక్ష్మీ ఆలోచనలో పడిపోతుంది. ఇంతలో స్వప్న, కావ్య ఇంటికి వస్తారు. కావ్య రాజ్ గురించే ఆలోచిస్తూ ఇంట్లోకి వస్తుంది. బామ్మ ఎదురుగా వచ్చి ఏమైందని అడుగుతుంది. నీరసంగా ఉంది వెళ్లి పడుకుంటాను అని పైకి వెళ్తుంది కావ్య. రాజ్, శ్వేత గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. మరోవైపు మూర్తి వాళ్ల ఇంట్లో అందరూ మంట దగ్గర కూర్చుని మాట్లాడుకుంటుంటారు. ఇంతలో అప్పు కళ్యాణ్‌కు సంబంధించిన వస్తువులన్నీ తీసుకొచ్చి మంటలో వేసి నేను నాలా ఉండాలనుకుంటున్నాను అందుకే పాత జ్ఞాపకాలు మర్చిపోవాలని ఇలా చేస్తున్నాను అని చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటారు. అనామిక వడ్డిస్తుంది. ఇంతలో రాజ్ వచ్చి అదేంటి కళావతి లేదా? అనామిక వడ్డిస్తుంది. అని అడుగుతాడు. దానికి బామ్మ కావ్యకు హెల్త్ బాగాలేదని చెప్పడంతో.. రాజ్ భోజనం మానేసి కావ్య దగ్గరకు వెళ్లిపోతాడు. దీంతో రుద్రాణి సందు దొరికింది కదా అని పుల్లలు పెట్టడం మొదలుపెడుతుంది.
రుద్రాణి: గీసర్లన్నీ రిపేరుకొచ్చిన్నట్లున్నాయి. వేడి నీళ్లు పెట్టివ్వడానికి శాంత కూడా లేదు. మీ కోడలుకేమో బీపీ డౌన్ అయ్యింది. టెక్నీషియన్స్‌తో ఏమైనా చెప్పారా?
అపర్ణ: కళ్యాణ్ నీకు చెప్పాను కదా.. రెండు రోజుల్నుంచి ఆ టెక్నీషియన్స్‌ను పిలిపించమని చెప్తూనే ఉన్నాను. ఆ మాత్రం పట్టించుకోకపోతే ఎలారా?
కళ్యాణ్: రేపు దగ్గరుండి తీసుకొస్తాను పెద్దమ్మ.
ధాన్యలక్ష్మీ: ఏంటక్కా ప్రతిదీ నా కొడుకే చేయాలా? వాడేమన్నా ఈ ఇంటి నౌకరి అనుకుంటున్నావా? నీకు నీ కొడుకేంతో.. నాకు నా కొడుకు అంతే.. నీకొడుకు పెళ్లానికి ఒంట్లో బాగాలేకపోయినా రాలేనంత బిజీగా ఉండొచ్చి కానీ నా కొడుక్కి కొత్తగా పెళ్లైంది ఇలాంటి పనుల కోసం వాణ్ని పంపించడం ఎంటి?
కళ్యాణ్: అమ్మా నువ్వు ఊరుకో..
ధాన్యలక్ష్మీ: ఒరేయ్ నీకేం తెలియదు నువ్వు ఊరుకో.. ప్రతి చిన్న పనికి నువ్వొక్కడివే కనిపిస్తావేంటి?
అనగానే అపర్ణ కూడా చేయి కడుక్కుని ఇక ఎవ్వరూ ఏ పని చేయకండి అంటూ లేచి వెళ్లిపోతుంది. అనామిక లోపలికి వెళ్లి వాళ్ల అమ్మకు ఫోన్ చేసి ఈ ఇంట్లో కుంపటి రాజేశాను. త్వరలోనే తను ఏం చేయబోయేది వాళ్ల అమ్మకు చెప్తుంది. ఇంతలో కళ్యాణ్ రావడం చూసి షాక్ అవుతుంది అనామిక వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. అయితే కళ్యాణ్ మొత్తం వినడు. అది అర్థం చేసుకున్న అనామిక కూల్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: 'హనుమాన్' సీక్వెల్లో తేజ సజ్జ హీరో కాదు, ఓ స్టార్ హీరో - ప్రశాంత్ వర్మ షాకింగ్ కామెంట్స్