అన్వేషించండి

Prasanth Varma: 'హనుమాన్‌' సీక్వెల్లో తేజ సజ్జ హీరో కాదు, ఓ స్టార్‌ హీరో - ప్రశాంత్‌ వర్మ షాకింగ్‌ కామెంట్స్‌

Prasanth Varma: జై హనుమాన్‌పై ప్రశాంత్‌ వర్మ షాకింగ్ కామెంట్స్‌ చేశారు. సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ.. హనుమాన్‌ కంటే వందరేట్లు ప్లాన్‌ చేస్తున్నామన్నాడు. కానీ, హీరో మాత్రం స్టార్‌ హీరో అంటూ బజ్‌ పెంచారు.

Prasanth Varma Shocking Comments on Jai Hanuman: 'హనుమాన్‌' మూవీతో డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ట్రెండింగ్‌లోకి వచ్చారు. సంక్రాంతికి థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ పాజిటివ్‌ రివ్యూస్‌ అందుకుంది. అందుకే బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే మూవీ రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డు దిశగా పరుగులు పెడుతోంది. సూపర్‌ మ్యాన్‌ జోనర్‌కి 'హనుమాన్‌' సెంటిమెంట్‌ను జోడించి  బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టాడు ప్రశాంత్‌ వర్మ. విజువల్‌ వండర్‌గా తెరకెక్కించి ఆడియన్స్‌ని అట్రాక్ట్‌ చేశాడు. దీంతో ఇండస్ట్రీ మొత్తం ప్రశాంత్‌ వర్మ గురించే మాట్లాడుకుంటుంది. 'హనుమాన్‌'లో ప్రశాంత్‌ వర్మ టేకింగ్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అంతేకాదు మూవీ ఎండింగ్‌లో హనుమాన్‌ సీక్వెల్‌ ప్రకటించి ఆడియన్స్‌లో క్యూరియాసిటి పెంచాడు. 

దీంతో సినీ ప్రియులంతా 'జై హనుమాన్‌' కోసం ఈగర్‌గా వేయిట్‌ చేస్తున్నారు. దీంతో 'హనుమాన్‌' సీక్వెల్‌పై ఆడియన్స్‌లో ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. దానిని మరింత పెంచుతూ తాజాగా 'జై హనుమాన్‌'పై ఇంట్రెస్ట్రింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చి బజ్‌ క్రియేట్‌ చేశాడు ప్రశాంత్‌ వర్మ. జై హనుమాన్‌.. హనుమాన్‌కు వందరేట్లు ప్లాన్‌ చేస్తున్నట్టు చెప్పాడు. అయితే సీక్వెల్‌ల్లో తేజ సజ్జ హీరో కాదని చెప్పి అందరిని సర్‌ప్రైజ్‌ చేశాడు. 'హనుమాన్‌' సక్సెస్‌ నేపథ్యంలో రీసెంట్‌గా ఓ చానల్‌తో ముచ్చటించిన ప్రశాంత్‌ వర్మ.. జై హనుమాన్‌పై ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చాడు. హనుమాన్‌ లాంటి జానర్‌ కథలు ఇంకా తన దగ్గర చాలా ఉన్నాయన్నాడు. గతంలో సూపర్‌ హీరో కథలకు ఇతిహాసాలలోని దేవుళ్లను ముడిపెట్టి తెరకెక్కించేలాంటి స్క్రిప్ట్స్‌ తన ఇంకా తన దగ్గర దాదాపు 12 ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. అందులో నుంచే 'హనుమాన్‌' తెరకెక్కించామన్నాడు. 

Also Read: కన్నుల పండుగగా అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట - హాజరైన చిరంజీవి, పవన్‌, చరణ్‌.. ఫొటోలు వైరల్‌

ఇప్పుడు దీనికి రాబోయే సీక్వెల్‌ హను-మాన్‌ కంటే వందరేట్లు భారీ స్థాయిలో ఉందని చెప్పి హైప్‌ ఇచ్చారు. కానీ జై హనుమాన్‌లో తేజ సజ్జ హీరో కాదని చెప్పి షాకిచ్చాడు. తేజ హనుమంతు పాత్రలో మాత్రమే కనిపస్తాడని, హీరో కాదని స్పష్టం చేశాడు. జై హనుమాన్‌లో హీరో ఆంజనేయ స్వామి పాత్రలో ఒక స్టార్‌ హీరో కనిపిస్తారని చెప్పాడు. కానీ చెప్పినట్టుగానే జై హనుమాన్‌ 2025లో తప్పకుండ రిలీజ చేస్తామని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే జై హనుమాన్‌లో శ్రీరాముడిగా రామ్‌ చరణ్‌ నటించే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు హనుమాన్‌గా మెగాస్టార్‌ చిరంజీవి కనిపిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రశాంత్‌ వర్మ చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా మారాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget