Brahmamudi Serial Today January 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: నిజం తెలుసుకున్న కావ్య – అయోమయంలో రాజ్ బిడ్డ పరిస్థితి
Brahmamudi serial today episode January 10th: రాజ్ రావడం లేదని తాను అబద్దం చెప్పానని కళ్యాణ్ చెప్పడంతో కావ్య చాటు నుంచి వింటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: అప్పు అనుమనంగా రాహుల్‌ను బ్రీప్‌కేస్ గురించి అడుగుతుంటే స్వప్న అడ్డుగా వెళ్తుంది. దీంతో అప్పు, స్వప్నల మధ్య గొడవ అవుతుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ కూడా తన కోడలిని అంటే బాగోదని స్వప్నను తిడుతుంది.
ఇందిరాదేవి: ఏయ్ ఆపండి.. ఇక్కడున్న పరిస్థితి ఏంటి..? మీరు చేస్తున్నదేంటి..? ఈ ఇంటి కోడలే దుగ్గిరాల వారి ఇంటికి వంశాకురాన్ని ఇచ్చే పిల్ల అది ఇప్పుడు చావు బతుకుల్లో ఉంది. దాని ప్రాణానికి ప్రాణమైన నా మనవడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు.. అర్థమైవుతుందా మీకు వాడేమో స్టేషన్ నుంచి వచ్చే పరిస్థితిలో లేడు.. ఇక్కడ కావ్య వాడొస్తే కానీ ఆపరేషన్ చేయించుకునే పరిస్థితిలో లేదు.. సమయానికి ఆపరేషన్ జరగకపోతే రెండు నిండు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అది కూడా తెలియడం లేదా మీకు దాన్ని బతిమాలో బామాలో కావ్యను ఆపరేషన్‌కు ఒప్పించడం పోయి పిల్లి ఎలుకల్లా ఇలా పోట్లాడుకుంటారా..? సిగ్గు లేదు మీకు
సిస్టర్: హలో ఎక్స్‌క్యూజ్ మీ ఇది హాస్పిటల్ అండి.. ఇక్కడ ఇలా గొడవ చేయకండి
సుభాష్: ఏం లేదు సిస్టర్ గోడవేం చేయడం లేదు
అంటూ అందరినీ సైలెంట్ గా ఉండమని చెప్తాడు. కట్ చేస్తే మంత్రి దర్మేంధ్ర వైప్ డెలివరీ టైం దగ్గర పడిందని డాక్టర్ చెప్పగానే.. ఇంతకు ముందులా కాకుండా ఈసారి జాగ్రత్త పడదామని చెప్తాడు దర్మేంద్ర. అయితే అడ్వాన్స్ గా హాస్పిటల్ లో జాయిన్ అవ్వమని చెప్తాడు డాక్టర్. సరే అంటాడు దర్మేంద్ర. తర్వాత కావ్యను అపరేషన్ కు ఒప్పించడానికి అందరూ ఐసీయూలోకి వెళ్తారు.
కావ్య: అత్తయ్యా ఆయన వచ్చారా..? ఎక్కడున్నారు..?
అపర్ణ: కావ్య ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చాం నువ్వు కంగారు తగ్గించుకోమ్మా
కావ్య: అత్తయ్యా నా కంగారు నా బాధ అన్ని అయన కోసమే అత్తయ్యా..? కళ్యాణ్, మామయ్య గారు కలిసి ఆయన్ని తీసుకొస్తామని చెప్పారు కదా..? మామయ్య చెప్పండి అయన ఎలా ఉన్నారు… ఎప్పుడొస్తారు..?
ఇందిరాదేవి: కావ్య వాడికేం కాలేదు.. కాదు కూడా కానీ నువ్వు ఇలా ఉంటే నీకు నీ బిడ్డకు మంచిది కాదని డాక్టర్ కూడా చెప్తున్నారు. నా మాట విను తల్లి.
కావ్య: ముందు ఆయన ఎప్పుడు వస్తారో చెప్పు అమ్మమ్మ.. మామయ్య గారు మీరు మాట్లాడరేంటి..?
సుభాష్: అమ్మా కావ్య ఈ రోజే నేను కళ్యాణ్ వెళ్లి నువ్వు కోరుకున్నట్టుగానే రాజ్‌ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం.. కానీ శని ఆదివారాలు కదమ్మా కోర్టుకు సెలవులు కాబట్టి బెయిల్ రాదు అన్నారు.. అది నీకు తెలుసు కదా..? అయినా కళ్యాణ్ ప్రయత్నం చేస్తా అన్నారు కాస్త ఓపిక పట్టు అమ్మ..
అపర్ణ: రెండే రెండు రోజులు రాజ్ బయటకు వస్తాడని లాయరు గారు చెప్పారంట కావ్య వాడు వచ్చేస్తాడు.. నువ్వు కంగారు పడకు కావ్య..
ఇందిరాదేవి: కానీ అప్పటి దాకా ఆపరేషన్ ఆపడం మంచిది కాదని డాక్టర్‌లు చెప్తున్నారు. నువ్వు కంగారు పడకుండా ప్రశాంతంగా ఆపరేషన్ చేయించుకోవాలి. నా ముని మనవణ్ని నాకు అందించాలి..
ఒకరి తర్వాత ఒకరు కలిసి కావ్యను కన్వీన్స్ చేసి ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పిస్తారు. కావ్య హ్యాపీగా నవ్వుతూ సరే అనడంతో డాక్టర్ ఆశ్చర్యపోతుంది.
డాక్టర్: చూశావా కావ్య నువ్వు సంతోషంగా అలా మాట్లాడుతుంటే నీ బీపీ కూడా డౌన్ అయిపోతుంది. టెస్టులు అన్ని కంప్లీట్ అయ్యాయి.. రిపోర్ట్స్ కూడా వచ్చేశాయి.. చెక్ చేశాను. కాకపోతే బేబీ కాస్త అండర్ వెయిట్ లో ఉంది
అపర్ణ: ప్రాబ్లమ్ ఏమీ లేదు కదా డాక్టర్
డాక్టర్: ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. బేబీ పుట్టగానే.. ఇంకుబేటర్‌లో పెడతాం.. టూ వీక్స్ లో వెయిట్ పెరిగేలా చేయోచ్చు.. ఇక మీరు బయటకు వెళ్లండి.. ఉదయాన్నే ఆపరేషన్ చేస్తాం..
అంటూ డాక్టర్ చెప్పగానే అందరూ వెళ్లిపోతారు. బయటికి వెళ్లిన తర్వాత అప్పును అనుమానం వచ్చి ఈ పాటికే ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ అయి ఉంటుంది బెయిల్ ఎలా వస్తుంది బావ గారు బయటకు ఎలా వస్తారు అని కళ్యాణ్‌ను అడుగుతుంది. దీంతో కళ్యాణ్ తాను వదిన కోసం అబద్దం చెప్పానని అంటాడు. వీళ్లు మాట్లాడుకోవడం కిటికీలోంచి కావ్య వింటుంది. బాధతో ఏడుస్తూ ఉంటుంది. తర్వాత జైళ్లో ఉన్న రాజ్ కూడా కావ్యను గుర్తు చేసుకుని బాధపడుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















