Brahmamudi Serial Today January 10Th: కావ్యను వ్రతానికి దూరంగా ఉండమన్న ధాన్యలక్ష్మీ – రుద్రాణిని ఆటాడుకున్న స్వప్న
Brahmamudi Today Episode: రుద్రాణి కావాలని దీపపు కుంది కిందపడేసి కావ్య మీదకు నెట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: మ్యారెజ్ బ్రోకర్‌ను పిలిచి పెళ్లిసంబంధాల గురించి మాట్లాడుతుంటారు మూర్తి, కనకం, వాళ్ల అక్క. పెళ్లి బ్రోకర్ ఫోటోలు చూపిస్తుంటాడు. ఫోటోలు చూస్తూ డీటెల్స్ తెలుసుకుంటుంటే.. ఇంతలో అప్పు వస్తుంది. కోపంగా ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతుంది. అందరూ భయపడుతూ ఉంటే ఏంటి మీరు ఆలా భయపడతున్నారు నేను చెప్తాను ఉండండి అంటూ బ్రోకర్ లేచి అప్పుకు అబ్బాయిల ఫోటోలు చూపిస్తుంటే అప్పు బ్రోకర్‌ను తరిమేస్తుంది.
కనకం: ఏంటే నువ్వు చేసిన పని..
అప్పు: ఆ మాట నేను అడగాలి.
కనకం: కూతురుకు పెళ్లి చేయాలనుకోవడం తప్పా
అప్పు: నేను మనిషిని అమ్మ మిషన్ ను కాదు. ఒకర్ని ఇష్టపడి ఇప్పుడు వాడి పెళ్లి అయిపోయిందని వెంటనే ఇంకొకర్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు.
కనకం: చేసుకోకుండా ఇలాగే ఉంటావా?
అప్పు: ఉంటాను మీకు భరించడం కష్టమైతే చెప్పండి. వేరే దారి చూసుకుంటా?
అంటూ కోపంగా బయటకు వెళ్లిపోతుంది అప్పు. అప్పు ఇలా బాధపడుతుంటే నేను చూస్తే ఊరుకోలేను దాని మనసు ఎలాగైనా మార్చాలి అని మనసులో అనుకుంటుంది కనకం. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో వ్రతం కోసం ఏర్పాట్లు చేస్తుంటుంది కావ్య. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పైనుంచి వచ్చిన రుద్రాణి అటూ ఇటూ చూసి కావ్య పక్కనే నిలబడి ఇవాళ అయిపోయావే అని మనుసులో అనుకుని పక్కనే ఉన్న దీపపు కుందీని కిందపడేస్తుంది.
రుద్రాణి: ఏయ్ చూసుకునే పని లేదా?
కావ్య: అయ్యో నేనేం చేశానండి.
ఇంతలో ధాన్యలక్ష్మీ, అపర్ణ లోపలికి వస్తారు. కిందపడిపోయిన దీపపు కుందీని చూసిన ధాన్యలక్ష్మీ కోపంగా
ధాన్యలక్ష్మీ: అయిపోయింది. ఈ మహాతల్లి పూజ జరిగే చోట అడుగుపెట్టినప్పుడే ఇలాంటి అశుభాలు అపశకునాలు జరుగుతాయని ముందే అనుకున్నాను. అనుకున్నదంతా జరిగిపోయింది.
స్వప్న వచ్చి రుద్రాణిని చూస్తూ..
స్వప్న: మిమ్మల్నే అంటున్నారు.
రుద్రాణి: నన్నా నన్నెందుకు అంటుంది.
స్వప్న: మీరు అడుగుపెట్టినందు వల్లే అశుభాలు జరిగాయట.
ధాన్యలక్ష్మీ: నేను అనేది మీ చెల్లెలిని... అక్కా చూశావా? పూజ మొదలు కాకముందే కుంది పడేసింది. మళ్లీ ఏమీ తెలియని అమాకురాలిలాగా ఎలా చూస్తుందో చూడు.
కావ్య: ఏమైంది చిన్నత్తయ్యా..?
ధాన్యలక్ష్మీ: ఏమైందని ఏమీ ఎరగనట్టు మాట్లాడకు.
అంటూ ధాన్యలక్ష్మీ కావ్యను ఘోరంగా తిడుతుంది. నా కొడుకు కోడలు సంతోషంగా ఉండటం నీవు చూడలేవా? అంటుంది. దీంతో స్వప్న కోపంగా ఇంకా చూస్తావేంటి? పక్కకు రా అంటూ కావ్యను పక్కకు లాగి మా అత్తతో చేయించుకోండి అంటూ రుద్రాణి గురించి వెటకారంగా చెబుతుంది స్వప్న. ఇంతలో సుభాష్ అందరిని తిడుతూ తెల్లవారుజామునే కావ్య లేచి ఇన్ని ఏర్పాట్లు చేసింది. మీరంత చీరలు, నగలు అంటూ ఇప్పుడొచ్చారు అంటాడు. కళ్యాణ్ కూడా ధాన్యలక్ష్మీని తిడతాడు. ఇంతలో బామ్మ కలగజేసుకుని కావ్యను వెనకేసుకొస్తుంది. పూజలో మూడు జంటలు కూర్చోవాల్సిందే.. అని బామ్మ ఆర్డర్ వేస్తుంది. మరోవైపు పిజ్జా ఆఫీసుకు జాబ్ కోసం వెళ్లిన అప్పుకు జాబ్ లేదని ఓనరు చెప్పడంతో అప్పు డల్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు అనామిక, ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్లి కావ్యతో కలసి వ్రతంలో తాను కూర్చోనని చెబుతుంది. ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారు వాళ్లను అడిగి చెప్తాను అని హాల్లోకి వెళ్లి అపర్ణ, బామ్మలకు అనామిక చెప్పిన మాటలు చెప్తుంది. ఇప్పుడు వాళ్లంతా పూజలో కూర్చోవడానికి రెడీ అవతున్నారు. వాళ్లను వద్దనడం బాగుండదు. అందరూ పూజలో కూర్చోవాల్సిందే అని ఆర్డర్ వేస్తుంది. లోపల వ్రతం కోసం రెడీ అవతున్న స్వప్న అత్తా అత్తా అంటూ కేకలు వేస్తుంది. పరుగెత్తుకొచ్చిన రాహుల్, రుద్రాణి పిలిచావా అని అడుగుతుంది.
స్వప్న: అరిచాను.
రుద్రాణి: ఏం కొంప మునిగింది ఇప్పుడు.
స్వప్న: మీ కొడుకు కోట్లు పోసి కట్టించిన కొంపే మునిగింది.
అనడంతో అసలు ఏమైందని పిలిచావు అని అడుగుతుంది రుద్రాణి. తన చీర కుచ్చిల్లు పెట్టడానికి పిలిచానని స్వప్న చెప్పడంతో రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.