అన్వేషించండి

 Brahmamudi Serial Today December 13th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: కలిపిపోయిన కావ్య, రాజ్‌ -  రుద్రాణి కొత్త ప్లాన్‌

Brahmamudi Today Episode: కావ్యకు ఎలాగైనా ఆస్థి దక్కకుండా చేయాలని రుద్రాణి మరో కొత్త ప్లాన్‌ వేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  తాతయ్య ఇచ్చిన ఇంటి, కంపెనీ బాధ్యతలు నేను మోయలేనని కావ్య దేవుడి ముందు నిలబడి భయపడుతుంది. ఇంతలో ఇందిరాదేవి వచ్చి కావ్యకు ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు మొక్కిన దేవుడే నీకు ఈ అవకాశం ఇచ్చాడేమో అనుకోవచ్చు కదా..? అంటుంది. ఇంతలో ఆస్థి పత్రాలు, తాళాలు తీసుకుని సుభాష్‌, అపర్ణ వస్తారు.

సుభాష్‌: నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మా.. ఆస్థి అపాత్రదానం కాకుండా ఆ భగవంతుడే అడ్డుపడ్డాడు. సమయానికి ఈ వీలునామా మన చేతికి వచ్చేలా చేశాడు. ఆస్థి నా పేరున రాసినా రాజ్‌ పేరున రాసిన ఈ దుర్మార్గులు ఆటాడుకునే వారు. మా నాన గారు దూరదృష్టితో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు.

కావ్య: మామయ్యగారు ఇది పరిష్కారం అని మీకనిపిస్తుంది. కానీ చిన్నత్తయ్యా కోర్టుకు వెళ్తానంటున్నారు. రుద్రాణి ఎగదోస్తుంది. వాళ్లను కంట్రోల్‌ చేయడం నావల్ల అవుతుందా..?

సుభాష్: నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా.. మా నాన్న పకడ్బందీగా వీలునామా రాశారు. ఎవరు కుప్పి గంతులు వేయలేరు.

అపర్ణ: ధైర్యంగా బాధ్యతలు తీసుకో కావ్య.. నీకు నీ అత్తా మామల సపోర్టు ఉంది. మా అత్తామామల సపోర్టు కూడా ఉంది. కంపనీ బాధ్యతలో పాటు ఇంటి బాధ్యతలు కూడా నువ్వే తీసుకో..

కావ్య: ఎంత ఈజీగా బరువు బాధ్యతలు దించేసుకున్నారు అత్తయ్య మీరు

అపర్ణ: ఇది మామయ్యగారి నిర్ణయం దాన్ని కాదనే హక్కు నీకు లేదు.. మాకు లేదు.

ఇందిరాదేవి: ఈ ఆస్థి పత్రాల వెనక బావ మనసులో ఉన్న పరమార్థం ఒక్కటే కావ్య. ఈ ఇల్లు ముక్కలు కాకూడదని.. ఇది ముళ్ల దారే కానీ ఏరిపారేస్తూ నడవాల్సిందే..

అని కావ్యకు భరోసా ఇచ్చి వెళ్లిపోతారు. కావ్య మాత్రం రాజ్‌కు చెప్పైనా తాను తప్పుకోవాలని మనసులో అనుకుంటుంది. రాజ్‌ దగ్గరకు వెళ్లి పత్రాలు, తాళాలు ఇస్తుంది. ఏంటిన రాజ్‌ అడగ్గానే జరిగిన విషయం మొత్తం చెప్తుంది కావ్య. రాజ్‌ కూడా కావ్యను సపోర్టు చేసి మాట్లాడతాడు. నాకు ఈ బాధ్యతలు అవసరం లేదని..  ఈ బాధ్యతలు చూసుకోవడానికి నువ్వే కరెక్టు.. ఆ తాళాలు నీ చేతుల్లో ఉంటేనే సేఫ్‌గా ఉంటాయి. తాతయ్య పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిలబెడతావని అనుకుంటున్నాను అంటూ రాజ్‌ వెళ్లిపోతాడు. రూంలో రుద్రాణి ఇరిటేటింగ్‌ చూస్తుంది.

రుద్రాణి: ఎన్ని కుట్రలు, ఎన్ని మోసాలు, ఎన్ని పథకాలు అన్ని బూదిదలో పోసిన పన్నీరులా అయపోయాయిరా..

రాహుల్‌: అవును మమ్మీ  కావ్య క్యారెక్టర్‌ ఇంతటితో క్లోజ్‌ అయిపోతుందనుకున్న ప్రతిసారి ఎంట్రీ ఇచ్చి మనకు షాక్‌ ఇస్తుంది.

రుద్రాణి : ఇక ఆస్థులు మనకు దక్కవు అని తలుచుకుంటేనే భయమేస్తుంది

 అని రుద్రాణి చెప్తుండగానే అనుకున్నదొక్కటి అయినదొక్కటి అనే సాంగ్‌ ప్లే అవుతుంది. సాంగ్‌ ఎక్కడి నుంచి వస్తుందా..? అని చూసే సరకి స్వప్న ప్లే చేసుకుంటూ వస్తుంది. ఇద్దరూ కలిసి మళ్లీ ఏదో ప్లాన్‌ చేస్తున్నారు ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే ఈ సారి తాట తీస్తానని బెదిరించి వెళ్లిపోతుంది. మరోవైపు ధాన్యలక్ష్మీ ఆస్థి విషయంలో కళ్యాణ్‌కు అన్యాయం జరిగిందని ఎలాగైనా న్యాయం చేయాలని లాయర్‌తో మాట్లాడుతుంది. ప్రకాష్‌ వచ్చి తిట్టి నువ్విక మారవా..? అంటూ వెళ్లిపోతాడు. తర్వాత దుగ్గిరాల ఇంటికి కనకం వస్తుంది. ఇందిరాదేవిని పరామర్శిస్తుంది. కనకాన్ని రుద్రాణి ఘోరంగా అవమానిస్తుంది. దీంతో ఇంట్లో అందరూ రుద్రాణిని తిడతారు. అయినా వినకుండా మా నాన్నను ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేసి తల్లీకూతురు కలిసి ఆస్థి రాయించుకున్నారు అంటూ తిడుతుంది.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Personal Loan: కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Embed widget