అన్వేషించండి

Brahmamudu Serial December 12th Episode - బ్రహ్మముడి సీరియల్: కావ్య చేతుల్లో కాలిపోయిన కల్యాణ్, అనామికల మొదటి శుభలేఖ!

Brahmamudi Today Episode - అనామిక, కల్యాణ్‌ల మొదటి శుభలేఖ కావ్య హారతి ఇస్తున్నప్పుడు కాలిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Brahmamudi Telugu Serial Today Episode : కనకం బయట కూర్చొని కలలు కంటుంటుంది. అనామిక తన తల్లిదండ్రులతో వచ్చినట్లు.. వాళ్లకి కుటుంబ సభ్యులు స్వాగతం పలికినట్లు ఊహించుకుంటుంది. తర్వాత ఇరు కుటుంబాలు దేవుడి దగ్గర శుభలేక పెడితే కుంకుమ నేల పడినట్లు కలకంటుంది. దాన్ని ఇంట్లో వాళ్లంతా అపచారంగా భావించారు అని కనకం ఊహించుకుంటుంది. ఇక పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు ఊహించుకుంటుంది. ఈ విషయంపై అనామిక తల్లిదండ్రులతో కల్యాణ్, తన తల్లిదండ్రులు గొడవ పడినట్టు అనుకుంటుంది. ఇక కల్యాణ్ ఆ పెళ్లి వద్దు అనుకున్నట్లు అందుకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఓకే చెప్పినట్లు కలకంటుంది. దీంతో పెళ్లి ఆగిపోయింది అని గంతులు వేస్తుంది. ఇంతలో అప్పు అక్కడికి వచ్చి పగటి కలలు కంటున్నావా అని ఒకటి వేస్తుంది. ఇంతలో అక్కడికి కల్యాణ్ వస్తాడు. 

కల్యాణ్: బ్రో అప్పుడే వచ్చేశావా.. టైమింగ్ అంటే నీదే బ్రో.. పెళ్లి కార్డు ఇవ్వడానికి అనామిక వాళ్లు వస్తున్నారు. వాళ్లు వెళ్లిన తర్వాత మనం బయటకు వెళ్లి కార్డులు పంచాలి 
కనకం: ఇది నా కలే కావొచ్చు. కానీ నేను నా కూతురు కన్న కలని నిజం చేయడం కోసం ఈ కలనే నేను నిజం చేస్తాను
రాహుల్: ఏంటి మమ్మీ అందరూ అనామిక వాళ్లు మొదటి పత్రిక తెస్తున్నారు. పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేయాలా అని ఆలోచిస్తుంటే నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావ్
రుద్రాణి: మరి ఏం చేయమంటావ్. మనకు ఆ తలకుమాసిన స్వప్నను అంటగట్టి వీళ్లు మాత్రం ఇంత మంచి సంబంధం తెచ్చుకుంటారా.. దాన్ని చూస్తూ ఎలా ఉండాలి. నాకు దక్కని ఆనందం వాళ్లకు కూడా దక్కకూడదు.
రాహుల్: అయితే ఏంటి మమ్మీ ఈ పెళ్లి ఆపుతావా.. అలా చేస్తే వీళ్లు ఊరుకుంటారా
రుద్రాణి: పిచ్చి రాహుల్ నేను ఎందుకు ఆపుతాను. కావ్య చేత ఆపేలా చేస్తా.. వాళ్ల జాతకంలోనే మాంగల్య దోషం ఉందని పంతులు చెప్పారు కదా.. ఏ జరిగినా అది ఆ దోషం వల్ల జరిగిందని ఈ పెళ్లి ఆపేస్తారు. కాకపోతే ఆ తప్పుని కావ్య చేత చేయిస్తే మన చేతికి మంటి అంటుకోదు
రాహుల్: కావ్య మాత్రం ఎందుకు చేస్తుంది
రుద్రాణి: కావ్య చేయదు తనకి కూడా తెలికుండా నేను చేస్తా.. చూడు

మరోవైపు రాజ్ ఫ్యామిలీ అంతా హాల్‌లో కూర్చొని అనామిక వాళ్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో వాళ్లు వస్తారు. కొద్ది సేపు మాట్లాడుకుంటారు. అనామిక, కల్యాణ్‌లపై జోకులు వేస్తారు. ఇక కనకం కోపంతో ఊగిపోతుంటే.. అప్పు బాధ పడుతుంటుంది. ఇక ఊరికెళ్లి పూజ చేయించామని మొదటి శుభలేఖ మీకే ఇవ్వాలని తీసుకొచ్చామని అనామిక తండ్రి అంటారు. 

రుద్రాణి: మీ పద్ధతి చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఆడపిల్లని వదిలించుకుంటామా అని చూస్తున్నట్లు ఉంది. 
కావ్య: ఆడ పిల్లి ఎప్పటికీ పుట్టింటివాళ్లకు బరువు కాదు అండి అది ఒక బాధ్యత. పెళ్లీడు రాగానే మంచి ఇంట్లోకి పంపించాలని అది ఆరాటం. మీకు అది అర్థంకాదులేండి
రుద్రాణి: నేను ఏదో సరదాగా అంటే నువ్వు ఎందుకు అంత సీరియస్‌గా తీసుకుంటావ్. అనామిక ఈ ఇంటి కోడలు అవ్వడం నాకు ఇష్టమే
చిట్టీ: సరే సరే నువ్వు ఊరుకో రుద్రాణి. కావ్యా నువ్వు వెళ్లి మొదటి శుభలేఖ తీసుకురా. ధాన్యలక్ష్మి మీరు కార్డు తీసుకోండి.  
 
ధాన్యలక్ష్మి దంపతులు వియ్యంకులకు తాంబూలం ఇచ్చి మొదటి శుభలేక తీసుకుంటారు. ఇక కనకం కుంకుమ పట్టుకుంటుంది. ధాన్యలక్ష్మి అడిగితే అది ఇచ్చినట్లే ఇచ్చి కిందపడేలా చేస్తుంది కానీ ధాన్యలక్ష్మి సమయానికి పట్టుకుంటుంది. ఇక పెళ్లి పత్రికను దేవుడి దగ్గర పెట్టి పూజ చేయమని కావ్యతో బామ్మ చెప్తుంది. అందరూ పూజ చేయడానికి వెళ్తారు. 

మరోవైపు రుద్రాణి పసుపులో యాసిడ్ కలుపుతుంది. కావ్య శుభలేఖకు పసుపు రాసి హారతి ఇచ్చినప్పుడు కొంచెం మంటకే ఆ శుభలేఖ కాలిపోతుంది అని రుద్రాణి తన ప్లాన్‌ను రాహుల్‌తో చెప్తుంది. కావ్య హారతి ఇస్తున్నప్పుడు ఒక్కసారిగా కార్డుకు మంట అంటుకుంటుంది. అందరూ షాక్ అవుతారు. 
 
రుద్రాణి: ఏంటి కావ్యా నువ్వు చేసిని పని జాగ్రత్తగా ఉండాలి కదా.. నీ చేతుల మీద శుభకార్యం జరిపించాలి అని మా అమ్మ ఆశపడింది. కానీ నువ్వు ఇలా పెళ్లి పత్రిక తగలబెట్టావు. 
కావ్య: ఏంటి మీరు అనేది. నేను ఎందుకు అలా చేస్తాను
రుద్రాణి: నువ్వు చేయకపోతే దానంతట అదే తగలబడిందా
కావ్య: అదే నాకు అర్థం కావడం లేదు. 
రుద్రాణి: అర్థం కాకపోవడం ఏంటి.. నీ అజాగ్రత్త వల్లే ఇలా జరిగింది నువ్వే ఈ తప్పు చేశావు. ఒకసారి అనామిక ఫ్యామిలీని చూడు ఎంతలా కంగారు పడుతున్నారో. మీ చిన్నత్త మొహం చూడు ఎంత భయపడిపోతుందో. అసలే పంతులు వచ్చి మాంగల్య దోషం ఉంది. ఇంటి పెద్దకు గండం అని చెప్పాడు. ఇప్పుడు ఇలా జరిగితే ఏమనుకుంటారు. అమ్మాయి జాతకం వల్లే ఇలా అయిందని అనుకోరా. పెళ్లి పత్రిక అంటే మనం ఎంత మంగళకరంగా చూస్తాం. ఇప్పుడే మా అమ్మ చెప్పింది పత్రికను పెళ్లి అయినంత వరకు దేవుడి దగ్గర పెట్టాలి అని. నువ్వేమో దాన్ని తగలబెట్టి బూడిద చేశావు
రాజ్: ఏంటి అత్తా అలా అంటావ్ కళావతి కావాలని చేసిందా అనుకోకుండా అలా జరిగిపోయింది
అనామికతండ్రి: అనుకోకుండా కాదు బాబు. అజాగ్రత్త వల్ల జరిగింది. ఆడ పిల్ల తల్లిదండ్రులుగా ఒకసారి మావైపు ఆలోచించండి. రుద్రాణి గారు చెప్పింది నిజమే కదా. అమ్మాయి కున్న దోషం వల్ల ఇలా జరిగింది అనుకోరా
కనకం: ఏదో అనుకోకుండా ఇలా జరిగింది ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తే మంచిది కదా
అనామికతల్లి: ఏం ఆలోచించాలి అక్కయ్య గారు మీకు కూడా ముగ్గురు కూతుళ్లు ఉన్నారు కదా వాళ్ల విషయంలో ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా
రుద్రాణి: వాళ్లకి ఇంతకంటే పెద్ద గండాలే జరిగాయి లెండీ.. ఏంటి కనకం 
కావ్య: రుద్రాణి గారు నేను తప్పు చేశాను కాబట్టి నన్ను అనండి మా అమ్మని ఎందుకు అంటారు 
అనామికతల్లి: నిన్నే అంటున్నాం అమ్మా. ఎందుకు ఇలా చేశావ్. ఇప్పుడు జరిగిన దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అంటావ్. ఇంత జరిగాక కూడా ముందుకు వెళ్తే.. రేపు చీమ చిటుక్కుమన్నా మా అమ్మాయి వల్లే జరిగింది అనుకోరా ఇంట్లో వాళ్లు
కల్యాణ్: ఆంటీ మీరు అనవసరంగా చాలా దూరం ఆలోచిస్తున్నారు. 
అనామికతల్లి: ఆలోచన కాదు కల్యాణ్ బాబు ఇది మా కూతురి జీవితం. పెళ్లి చేసి పంపించేయడంతో పాటు మా బాధ్యత తీరిపోదు కదా. ఇక్కడ తను సంతోషంగా ఉండటం కూడా మాకు ముఖ్యమే. అసలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది మీ వదినకు ఈ పెళ్లి ఇష్టమేనాఅని. 
కల్యాణ్: ఏం మాట్లాడుతున్నారు అంటీ
అనామికతల్లి:  ఏం లేదు బాబు పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తుంది. ఇందాక వాళ్ల అమ్మ కుంకుమ కింద పడేయబోయింది. ఇప్పుడేమో కావ్య ఇదంతా చూస్తుంటే అనుమానమే వస్తుంది కదా. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget