Brahmamudi September 12th Episode: కావ్య వెనుక కుక్కపిల్లలా తిరుగుతున్న రాజ్- కళ్యాణ్ తో ప్రేమలో అప్పు!
కళ్యాణ్ అనామిక ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ జంట మధ్యలోకి అప్పు ఎంటర్ కాబోతుంది.
'బ్రహ్మముడి' సీరియల్ సెప్టెంబరు 12 ఎపిసోడ్: కళ్యాణ్ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా అప్పు గ్రౌండ్ కి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లల్ని కొడుతుంది. అందులో ఒకడు అప్పుని కొట్టడానికి వస్తుంటే కళ్యాణ్ వెళ్ళి అడ్డుగా నిలబడతాడు. దీంతో తన తలకి దెబ్బ తగులుతుంది. పోలీసులు రావడంతో అక్కడ వాళ్ళందరూ పారిపోతారు. సీతారామయ్యని అమెరికా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తామని రాజ్ చెప్తాడు. కానీ పెద్దాయన మాత్రం అందుకు ఒప్పుకోడు. తన ప్రాణం పరాయి గడ్డ మీద పోవడానికి వీల్లేదని తన ఇంట్లోనే సొంత గడ్డ మీదే పోవాలని తెగేసి చెప్తాడు. రాజ్ వాళ్ళు ఎంత సర్ది చెప్పినా కూడా పెద్దాయన మాత్రం చివరి దశలో అందరితో ఉండాలనే తన కోరిక తీరాల్సిందేనని అంటాడు. ఇంద్రాదేవి వచ్చి ఏం మాట్లాడుతున్నారని కంగారుగా అడుగుతుంది. బిజినెస్ గురించి మాట్లాడుతున్నారా తర్వాత రండి అనేసి వాళ్ళని పంపించేస్తుంది.
ఇలాగే వదిలేస్తే తాతయ్య దక్కేలా లేడని శుభాష్ కంగారుపడతాడు. ఆయన రావడం లేదు కనుక స్పెషలిస్ట్ లని ఇక్కడికి రప్పించి ట్రీట్మెంట్ ఇప్పించాలని డిసైడ్ అవుతారు. రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయని అంటే ఆఫీసులోనూ, తన ఫోన్లో కూడా ఉన్నాయని రాజ్ చెప్తాడు. అవి ఎవరి కంటా పడకుండా చూడమని శుభాష్ అంటాడు. అప్పు కళ్యాణ్ ని ఇంటికి తీసుకొచ్చి తలకి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టు కడుతుంది. కళ్యాణ్ విషయంలో అప్పు చూపిస్తున్న ఆత్రం చూసి అన్నపూర్ణకి డౌట్ వస్తుంది. తలకి దెబ్బ తగిలేసరికి ఎక్కడ గతం మర్చిపోయాడోనని టెన్షన్ గా అడుగుతుంది. అప్పుడే అనామిక ఫోన్ చేస్తే అప్పు తీసుకుని కళ్యాణ్ కి దెబ్బ తగిలిందని మాట్లాడటం కుదరదని చెప్పి కాల్ కట్ చేస్తుంది.
Also Read: కృష్ణని ఇంట్లో నుంచి పంపించేస్తానని ముకుంద ఛాలెంజ్- మురారీతో బైక్ మీద షికార్లు
అన్నపూర్ణ: ఈ అబ్బాయికి దెబ్బ తగిలితే టెన్షన్ పడుతూ ఇంటికి తీసుకొచ్చి కట్టు కట్టి పంపించావ్. మొన్న వేరే అమ్మాయితే వెళ్తే అరిచావ్. ఇవాళ ఆ అమ్మాయి ఫోన్ చేస్తే మాట్లాడనివ్వలేదు ఏంటి ఈ మార్పు.. నాకేం అర్థం కావడం లేదని అంటుంది
అవునా తనకి కూడా ఏం అర్థం కావడం లేదని అప్పు మనసులో అనుకుంటుంది. రాజ్ గదిలోకి రాగానే కావ్య పలకరిస్తుంది. ఫోన్ బెడ్ మీద పెట్టేసి బాత్ రూమ్ కి వెళతాడు. అప్పుడే ఫోన్ పదే పదే రింగ్ అవడంతో కావ్య లిఫ్ట్ చేయాలని చూస్తే టైమ్ రాజ్ వచ్చి ఫోన్ లాగేసుకుంటాడు.
రాజ్: నీకు అసలు బుద్ధి ఉందా? పక్క వాళ్ళ ఫోన్ చూడకూడదని తెలియదా?
కావ్య: ఇది పక్కింటి వాళ్ళది కాదు ఈ ఇంటిది. మీరు వాష్ రూమ్ లో ఉన్నారు ఫోన్ వస్తుంటే ఇంపార్టెంట్ అనుకుని లిఫ్ట్ చేద్దామని అనుకున్నా
రాజ్: నాకు బోలెడు ఫోన్స్ వస్తాయి. నా ఫోన్ చెక్ చేయడానికి తీసుకుని అబద్ధాలు ఆడతావు ఏంటి
కావ్య: మీ ఫోన్ చెక్ చేయాల్సిన అవసరం నాకేం లేదు. మారతాను అన్నారు ఇదేనా మారడం అంటే. మీ ఫోన్ చూడటానికి కూడా పనికిరాని భార్యని మీ జీవితంలోకి రావడానికి ఎలా ఒప్పుకుంటారు. మీరు మారడం అంటే నాకు డౌటే అనేసి వెళ్ళిపోతుంది.
మూడు నెలలు నటించి ఎలాగోకలా ఉందామని అనుకుంటే ఇలా ఒరిజనల్ క్యారెక్టర్ బయటకి వచ్చేసింది ఏంటని అనుకుని వెంటనే తన వెనుక పరుగు తీస్తాడు. కావ్య హాల్లోకి వస్తుంటే చూసుకోకుండా తన వెనుక వచ్చి ఆగుఅని చీర కొంగు పట్టుకుంటాడు. ఇంట్లో అందరూ అక్కడే ఉంటారు. అది చూసి ఆశ్చర్యపోతారు. దీంతో దెబ్బకి చీర కొంగు వదిలేస్తాడు. కళ్యాణ్ తలకి దెబ్బతో వచ్చేసరికి తనని చూసి అందరూ టెన్షన్ పడి ఏమైందని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. అనామిక వచ్చి కళ్యాణ్ పక్కన కూర్చుని ఏమైంది అనేసి పక్కన ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉంటుంది. తన తీరు చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఆ అమ్మాయి ఎవరని ధాన్యలక్ష్మి అడుగుతుంది.
కళ్యాణ్: తన కవితల పుస్తకం అచ్చు వేయించింది ఈ అమ్మాయి. పేరు అనామిక అని తనని పరిచయం చేస్తాడు.
Also Read: నిజం చెప్పేయమన్న జగతి- ఏంజెల్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ రిషి
కావ్య రాజ్ పక్క నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళి నిలబడుతుంది. తన వెనుకాలే రాజ్ కూడా కుక్కపిల్ల తిరిగినట్టు తిరుగుతూ ఉండటం చూసి అపర్ణ, రుద్రాణి రగిలిపోతూ ఉంటారు. తను చెప్పే కారణం వినమని మెల్లగా అడుగుతాడు. కానీ కావ్య మాత్రం పట్టించుకోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. నీ కొడుకు కావ్యని నిమిషం కూడా వదిలిపెట్టి ఉండలేకపోతున్నాడని రుద్రాణి పుల్ల వేస్తుంది. దీంతో అపర్ణ కావ్యని పక్కకి తప్పుకోమని సైగ చేస్తుంది. అనామికని కళ్యాణ్ తన గదికి తీసుకెళ్ళి చూపిస్తాడు. అక్కడ తను ఇచ్చిన మొక్క చూసి మురిసిపోతుంది. కళ్యాణ్ బెడ్ మీద దిండు కింద అనామిక తన ఫోటో ఉండటం చూసి మురిసిపోతుంది.