వారఫలాలు: సెప్టెంబరు 11 to 17



మేష రాశి
ఈ రాశివారికి ఈ వారం శుభఫలితాలున్నాయి. ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. మీ మేధస్సుని తక్కువ అంచనా వేసుకోవద్దు. నూతన ఆస్తి కొనుగోలు చేసేందుకు ఆలోచన చేస్తారు.



వృషభ రాశి
ఈ వారం రాజకీయనాయకులకు శుభసమయం. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు సాధారణ ఫలితాలున్నాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.



మిథున రాశి
ఈ వారం మిథున రాశి వారు కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులుకు కార్యాలయంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులు లాభపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.



కర్కాటక రాశి
ఈ వారం కర్కాటక రాశి వారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వైవాహిక జీవితం అద్భుతంగా సాగేందుకు చేసే ప్రయత్నాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో సంతోషం పెరుగుతుంది. వారం వారాంతంలో మంచి ఫలితాలుంటాయి



సింహ రాశి
సింహరాశికి చెందిన కళా, పారిశ్రామిక రంగాల వారికి ఈ వారం అద్భుతమైన సమయం. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. వారం ఆరంభంలో గ్రహ సంచారం అంత అనుకూలించదు. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.



కన్యా రాశి
అధ్యయన రంగంలో ఉండేవారికి ఈ వారం అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. కళారంగంలో ఉండేవారు ధైర్యంగా అడుగువేయండి. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.



తులా రాశి
మేనేజ్‌మెంట్, బోధన రంగాల్లో ఉన్నవారికి ప్రమోషన్‌కు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినా అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. మం.



వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారికి ప్రణాళికల అమలులో ఈ వారం చాలా ముఖ్యమైనది. అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ వారం నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.



ధనస్సు రాశి
ఈ రాశివారు ఈ వారం పెట్టే పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ వారం గ్రహ సంచారం ప్రైవేట్ , ప్రభుత్వ రంగాలవారికి గడిచిన వారంకన్నా ఈ వారం బాగానే ఉంటుంది.



మకర రాశి
ఈ వారం ఈ రాశికి చెందిన ప్రైవేట్ రంగమైనా లేదా ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికైనా ఆశించిన ఫలితాలు ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు సాధిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వారం ద్వితీయార్థం కలిసొస్తుంది.



కుంభ రాశి
ఈ వారం కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేసే ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలనిస్తాయి. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారం బాగానే సాగుతుంది. బంధువులను కలుస్తారు.



మీన రాశి
ఈ వారం ఈ రాశికి చెందిన సినీ, కళలు,సంగీత రంగాల్లో ఉండేవారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. గ్రహసంచారం మీకు పూర్తి అనుకూల ఫలితాలనిస్తోంది. ప్రేమసంబంధాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక స్థితిని బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉంటారు..
Images Credit: Pixabay