మేషం నుంచి మీనం వరకూ ఆగష్టు 13 రాశిఫలాలు



మేష రాశి
ఈ రాశివారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితులతో సామరస్యాన్ని కాపాడుకోండి. పనికిరాని చర్చలకు దూరంగా ఉండండి.



వృషభ రాశి
ఈ రాశివారి మనస్సులో ప్రతికూల ప్రభావం ఉంటుంది. మానసిక ప్రశాంతతను కాపాడుకునేందుకు ప్రయత్నించండి. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.



మిథున రాశి
చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పరిశోధన పనులపట్ల ఆసక్తి ఉంటుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి. కుటుంబ సమస్యలు తగ్గుతాయి, సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.



కర్కాటక రాశి
ఈ రాశివారు సంతోషంగా కనిపిస్తారు కానీ ఏదో తెలియని భయం మనసులో ఉంటుంది. సంభాషణలో సమతుల్యతను కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. స్నేహితులతో సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి.



సింహ రాశి
ఈ రాశివారు ఈ రోజు ఏదో విషయంలో ఆలోచనలో పడతారు. స్నేహితుడి నుంచి వ్యాపార ప్రతిపాదనను పొందవచ్చు. మతపరమైన పనులలో బిజీగా ఉంటారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో భాగంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు.



కన్యా రాశి
ఈ రాశివారు సహనాన్ని కోల్పోవద్దు. ఉద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. ఆదాయానికి మంచిన ఖర్చులు ఇబ్బందిపెడతాయి. తల్లి కారణంగా సంతోషంగా ఉంటారు. పుణ్యస్థల సందర్శనకు వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తారు.



తులా రాశి
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం, ఖర్చులు రెండూ పెరుగుతాయి. వ్యాపారం విస్తరించేందుకు ప్లాన్ చేస్తారు. అనారోగ్యం పాలవుతారు.



వృశ్చిక రాశి
ఈ రాశివారి మనసులో ఏదో నిరుత్సాహం ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఇబ్బందులు ఉండవచ్చు. అవసరమైన సమయంలో స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా బాగా ఉంటాయి.



ధనుస్సు రాశి
ఈ రాశివారు వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. స్నేహితుడితో కలసి విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.



మకర రాశి
విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. స్నేహితుల సహాయంతో ఉద్యోగం పొందుతారు. ఆదాయం మెరుగుపడుతుంది. మాటల్లో మాధుర్యాన్ని కోల్పోవద్దు. తండ్రి నుంచి ధనం పొందే అవకాశం ఉంది. రచనారంగంలో ఉండేవారు మంచి ఫలితాలు పొందుతారు.



కుంభ రాశి
ఈ రాశివారు ఈ రోజు ఆహ్లాదంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారు. వ్యాపారాల్లో లాభాలుంటాయి. సంగీతంపై ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతతను నిలుపుకోండి. కొన్ని సందర్భాల్లో మితిమీరిన కోపం ప్రదర్శిస్తారు.



మీన రాశి
ఈ రాశివారికి కన్నవారి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితుల మద్దతు లభిస్తుంది.