నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28) ఈ తేదీల్లో జన్మించినవారికి ఈ రోజు విజయాలతో నిండి ఉంటుంది. కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. కొత్త పథకాలపై పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం.
నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29) ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. మీరు పనిచేసే రంగంలో అదనపు పనిభారం ఉంటుంది. కొత్త పథకాలపై పని ప్రారంభించాలనుకుంటే, అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించండి. అనవసర వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.
నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30) ఈ రోజు మీ రోజు సాధారణంగా ఉంటుంది. కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ అనుకున్న పనులు పూర్తవుతాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.
నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31) ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగులైనా, వ్యాపారులైనా కష్టపడితేనే తగిన ఫలితం పొందుతారు. మనసులో ఏదో చింత ఫీలింగ్ ఉంటుంది. అవకాశాలు వస్తాయి కానీ పోటీ పరిస్థితులకు దూరంగా ఉంటారు. కోపం తగ్గించుకుంటే మంచిది.
నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23) ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల పరిస్థితులుంటాయి. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు అనుకూల సమయం ఇది.
నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24) ఈ తేదీల్లో జన్మించిన వారు ఈ రోజు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రణాళికలు ఈ రోజు అమలు చేయవద్దు. వివాద పరిస్థితులకు దూరంగా ఉండాలి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25) ఈ తేదీల్లో పుట్టినవారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. కార్యాలయంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులకు సంబంధించి ఇప్పటికే ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.
నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26) ఈ రోజు మీరు సానుకూలంగా ఆలోచిస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం ఉంటుంది. కుటుంబంలో - చేసే వృత్తిలో రెండింటిలోనూ బాధ్యతలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27) ఈ రోజు పెట్టే నూతన పెట్టుబడులు మీకు బాగానే కలిసొస్తాయి. రోజంతా సంతోంగా ఉంటారు. కుటుంబానికి పూర్తి సమయం కేటాయిస్తారు. వ్యాపారం బాగానే సాగుతుంది. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. Images Credit: Freepik