ఓ వ్యక్తి వ్యక్తిత్వం, మనస్తత్వం, ప్రవర్తనా విధానం ఇవన్నీ కూడా వారి జాతకంలో ఉండే గ్రహాలే నిర్ధేశిస్తాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
పుట్టిన తేదీ సమయం ఆధారంగా చెబుతారు, ఇంకా నక్షత్రం - రాశి ఆధారంగా కూడా లక్షణాలు ఇలా ఉంటాయని చెప్పేస్తారు
ప్రేమను పంచడంలో ఈ 5 రాశులవారు అద్భుతం అంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు
వృషభ రాశి అన్ని విషయాల్లో విశ్వాస పాత్రులుగా ఉండే వృషభరాశివారు ప్రేమ విషయంలో కూడా తగ్గేదే లే అన్నట్టు ఉంటారట. జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. జీవితంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తారట
కర్కాటక రాశి.. ప్రేమను పంచడంలో కర్కాటక రాశివారి తీరే వేరు. సంబంధాలకు ఎక్కువ విలువనిస్తారు. భాగస్వామి అవసరాలను గుర్తించి తీరుస్తారు. రొమాంటిక్ గా, కేరింగ్ గా వ్యవహరిస్తారు
సింహ రాశి ఈ రాశివారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఎక్కడున్నా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉండేందుకు ఇష్టపడతారు. ప్రియమైన వారికి ప్రేమను అందించడం తిరిగి పొందడంలో వీరిని మించిన వారుండరు
తులా రాశి తులా రాశివారు బంధాలకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎలాంటి వివాదం తలెత్తినా పరిష్కరించడంలో నిష్ణాతులు. ప్రేమ బంధాన్ని ఏర్పరుచుకోవడమే కాదు దాన్ని నిలుపుకోవడంలో కూడా వీరు స్ట్రాంగ్ గా ఉంటారట.
మీనరాశి ఈ రాశి.. సానుభూతి-భావోద్వేగాల కలయిక. వీరి ఆలోచనలు చాలా సృజనాత్మకంగా ఉంటారు. ప్రియమైన వారికి ప్రత్యేక గౌరవం ఇస్తారు. వారి భావాలకు విలువిస్తారు. Images Credit: Pixabay