ABP Desam


సింహరాశిలోకి సూర్యుడు - ఈ రాశులవారికి బాగా కలిసొస్తుంది


ABP Desam


కర్కాటక రాశిలో సంచరిస్తున్న సూర్యుడు ఆగష్టు 17న సింహరాశిలోకి మారనున్నాడు. సెప్టెంబరు 17 వరకూ అదే రాశిలో ఉంటాడు.


ABP Desam


ఆదిత్యుడు తన సొంత రాశిలోకి వెళ్లడం వల్ల ఇంకొంత శక్తివంతుడు అవుతాడు. ఈ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది


ABP Desam


కొన్ని రాశులపై అనుకూల ప్రభావం, మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.ముఖ్యంగా ఈ మూడు రాశులవారికి మాత్రం సింహరాశిలో సూర్యసంచారం వల్ల రాజయోగమే అనిచెప్పాలి.


ABP Desam


మేష రాశి
సింహ రాశిలో సూర్య సంచారం ఫలితంగా ఇల్లు, విద్య, ప్రేమ, పిల్లలు, తెలివితేటలు, ఉద్యోగం ఇలా అన్నివిషయాల్లో మీకు అనుకూల ఫలితాలున్నాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు అద్భుతమైన ఫలితాలున్నాయి.


ABP Desam


వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి సూర్యుడు 10వ స్థానంలో సంచరించినప్పుడు మీ కెరీర్ ఊహించని మలుపు తిరుగుతుంది. ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే అనువైన సమయం. వ్యాపారులు కూడా లాభపడతారు.


ABP Desam


మీన రాశి
సింహ రాశిలో సూర్య సంచారం సమయంలో ఈ రాశివారికి రాజయోగమే అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ సమయంలో ఉద్యోగులు ఊహించని ప్రయోజనం పొందుతారు. వేరొకరు వెళ్లిపోవడం మీ అదృష్టానికి నాంది పలుకుతుంది.


ABP Desam


సూర్యుడు గౌరవం, ఆత్మగౌరవం, వృత్తి, రాజకీయాలు, ఉన్నత పదవి, ఉద్యోగానికి కారకుడు.


ABP Desam


జాతకంలో సూర్యుడు మంచి స్థానంలో ఉంటే మీరు ఈ రంగాల్లో విజయం సాధిస్తారు. ఇంకా సాత్విక భావాలు, నిజాయితీ, నాయకత్వ సామర్థ్యానికి కూడా సూర్యుడు కారకుడు.


ABP Desam


Images Credit: Pinterest