ఆగష్టు 07 నుంచి 13 వారఫలాలు



మేష రాశి
ఈ వారం ఈ రాశివారికి అంతా మంచే జరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కార్యాలయంలో పని బాగాసాగుతుంది. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఆరోగ్యం బావుంటుంది.



వృషభ రాశి
ఈ వారం వృషభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. నిన్నటి వరకూ వెంటాడిన కొన్ని సమస్యలు ఈ వారంలో పరిష్కారం అవుతాయి. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. పని విషయంలో కొంత ఒత్తిడి ఉంటుంది కానీ మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారులు లాభపడతారు.



మిథునం రాశి
ఈ వారం మీకు ప్రశాంతంగానే ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. ఆ ప్రభావం కనిపిస్తుంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో కొన్ని కొత్త సమస్యలు రావచ్చు. ఉద్యోగులు చాలా కష్టపడాల్సి వస్తుంది.



కర్కాటక రాశి
ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మీ పనితీరుకి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ వారం వ్యాపార వర్గాలకు కూడా మంచిది.



సింహ రాశి
ఈ వారం మీకు చాలా మంచిది. పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు. కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో మంచి సమయం గడుపుతారు. కొన్ని కొత్త విషయాలు తెలియడం వల్ల సంతోషం ఉంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది.



కన్యారాశి
మీకు ఈ వారం హెచ్చు తగ్గులు ఉండబోతున్నాయి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది కొంచెం జాగ్రత్త . పని విషయంలో శ్రద్ధ చూపించడం మంచిది..అప్పుడే మెరుగైన ఫలితాలు పొందుతారు. భవిష్యత్ లో పర్యటనను ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది.



తులా రాశి
ఈ వారం మీకు చాలా అనుకూలమైన ఫలితాలున్నాయి. జాగ్రత్తగా ఉండండి , అనవసరమైన పనిలో జోక్యం చేసుకోకండి. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కాదు..నష్టాలు ఎదుర్కోకతప్పదు. ఆరోగ్యం, ఆహారం విషయంలో జాగ్రత్త



వృశ్చిక రాశి
ఈ వారం మీకు మంచి జరుగుతుంది. వ్యాపారం పుంజుకుంటుంది మంచి లాభాలు పొందుతారు. వైవాహిక జీవితంలో కూడా ప్రేమ పెరుగుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి కూడా ఈ వారం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలున్నా సమసిపోతాయి.



ధనుస్సు రాశి
ఈ వారం మీకు హెచ్చు తగ్గులతో కూడి ఉంటుంది. మీ ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ మీరు ఊహించినంతగా ఉండదు. కుటుంబంలో ఏదో ఒక విషయంలో టెన్షన్ పెరుగుతోంది. దాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి.



మకర రాశి
ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రేమ జీవితాన్ని ఆనందిస్తారు . మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది.



కుంభ రాశి
ఈ వారం ఈ రాశివారు కుటుంబానికి ఎక్కువ సమయం గడుపుతారు. ఆదాయం సాధారణంగా ఉంటుంది ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఏ పనినీ వాయిదా వేయవద్దు.



మీన రాశి
ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేక మిత్రులతో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తారు. పాత జ్ఞాపకాలు నెమరవేసుకుంటారు. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమ జీవితాన్ని ఆస్వాదించే మార్గాలు వెతికే పనిలో ఉంటారు. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి